Tuesday, 4 May 2021

శివోహం..... అనండి

శివోహం.....  

వీలైతే రోజూ అంటే అనండి.... 

కాని ఇది కూడా తెలుసుకోండి. 

అమితమైన భక్తిలో ఎదో తెలియని గొప్ప అనుభూతి ఉంటుంది సుమా! 

రోజూ ఉదయానే భక్తిలో కాసేపు మునిగి పొతే ఇక ఆ రోజంతా ఎంత హాయిగా ఉంటుందో కదా!....

మనలో ఏదో కొత్త శక్తి చేరినట్లు అనిపిస్తుంది.  

అలాగే ఉత్సాహమూ ఆరోగ్యమూ రెట్టింపవుతుంది.  

రోజువారీ పనులన్నీ సులువవుతాయి. 

ఆటంకాలన్నీ అలవోకగా యిట్టె తొలగిపోతాయి. 

మనసులోకి ఎలాంటి భయమూ దరి చేరదు. 

మన మనసులో దైర్యం వచ్చి చేరుతుంది. 

ఆత్మ విశ్వాసం పెరిగిపోతుంది. 

సగటు మనిషిగా మనకు 

అంత కన్నా మేలు ఇంకేమి కావాలి చెప్పండి?

No comments:

Post a Comment