చాణక్య నీతి దర్పణము - షష్ఠాధ్యాయము
శ్లో || శ్రుత్వా ధర్మం విజనాతి శ్రుత్వా త్యజతి దుర్మతిమ్ |
శ్రుత్వా జ్ఞాన మవాప్నోతి శ్రుత్వా మోక్షమవాప్నుయాత్ || 1
అర్థము :- మనుష్యుడు, శ్రుత్వా = వేదాది శాస్త్రముల విని, ధర్మం = ధర్మము యొక్క రహస్యములను, విజానాతి = తెలిసికొనుచున్నాడు, శ్రుత్వా = శాస్త్రములను, విద్వాంసుల ప్రవచనములను విని, దుర్మతిం = దుర్భుద్ధిని, త్యజతి = విడుచుచున్నాడు, శ్రుత్వా = శాస్త్రములను విని జ్ఞానం = జ్ఞానవిజ్ఞానములను, అవాప్నోతి = పొందుచున్నాడు, శ్రుత్వా = వినియే, మోక్షం = మోక్షమును, అవాప్నుయాత్ = పొందవలెను.
తాత్పర్యము :- మనుష్యుడు వేదాది శాస్త్రముల విని ధర్మరహస్యముల నెఱుంగును. శాస్త్రములను, విద్వాంసులను ప్రవచనములను విని దుర్భుద్ధిని విడుచును. శాస్త్రములను విని జ్ఞానవిజ్ఞానములను పొందును. శాస్త్రాదుల గురువుల ద్వారా విని ప్రపంచబంధములనుండి విడివడి మోక్షమును పొందును.
వివరణము:- మనుష్యుడు బాగుగా చదివి విద్వాంసుడగును. బాగుగా విని బహుశత్రుడగును. అందుచేత శాస్త్రముల వినవలెను. పరమాత్మ మనుష్యునకు రెండు చెవుల నొక నోరు నిచ్చెను. అందుచేత మనుజుడు ఎక్కువగా వినవలెను. తక్కువగా మ్లాడవలెను.
శ్లో || పక్షిణాం కాకశ్చాండాలః పశూనాం చైవ కుక్కురః |
మునీనాం కోపీ చాండాలః సర్వేషాం చైవ నిన్దకః || 2
అర్థము :- పక్షిణాం= పకక్షులలో, కాకః= కాకి, చాండాలః = చాండాలమైనది, నీచమైనది, చ = మఱియు, పశూనాం = పశువులలో, కుక్కురః ఏవ = కుక్కయే, చాండాలః = నీచమైనది, మునీనాం = మునులలో, కోపీ = కోపించువాడు, చాండాలః = చాండాలుడు, అట్లే, సర్వేషాం = అందఱిలో, నిందకః = ఇతరులను నిందించువాడు, ఏవ = కూడ, చాండాలః= చాండాలుడే.
తాత్పర్యము :- పకక్షులలో కాకి, పశువులలో కుక్క, మనులలో ముక్కోపి అందఱిలోను పరులను నిందించువాడును చాండాలుడు.
వివరణము :- దేనిని నిందయందురు? 'గుణేషు దోషారోపణం, దోషేషు గుణారోపణం నిందా' - గుణములందు దోషము నారోపించుటయు, దోషములందు గుణము లారోపించుటయు నిందయగును. కాకి అన్నింని దినును. కావునను కుక్క కక్కి దానిని మరల నాకి తినును. కావునను క్రోధము స్వయముగా నీచమైనది కావునను, యివి యన్నియు చాండాలమైనవే. మనుష్యుడు కూడ దోషములను గుణములుగా, గుణములను దోషముగా చూచును కావున న్టివాడు చాండాలుడే.
శ్లో || భస్మనా శుధ్యతే కాంస్యం తామ్రమమ్లేవ శుధ్యతి |
రజసా శుధ్యతే నారీ నదీ వేగన శుధ్యతి || 3
అర్థము :- కాంస్యం = కంచుపాత్ర, భస్మనా = బూడిదతో, శుధ్యతే = శుద్ధిచేయబడుచున్నది, తామ్రం = రాగిపాత్ర, అమ్లేన = చింతపండుతో, శుధ్యతి = శుభ్రమగుచున్నది, నారీ = స్త్రీ, రజసా = రజస్వలయగుటచే, శుధ్యతే = పవిత్రయగుచున్నది, నదీ = నది, వేగేన = ప్రవాహ వేగముతో, శుధ్యతి = నిర్మలమగుచున్నది.
తాత్పర్యము :- కంచుపాత్ర బూడిదతోను, రాగి పాత్ర చింత పులుసుతోను, స్త్రీ రజస్వలయగుటతోను, నది తీవ్ర గమనము గలిగియు (వరద వచ్చుటచే) నిర్మలములగును.
వివరణము : - దుష్టుల ద్వారా దూషితయైన స్త్రీ రజస్వలయైనచో శుద్ధయగును. అనగా నే కారణము చేతనైన స్త్రీ దుష్టులచే బలాత్కరింపబడి చెఱపబడి నను రజస్వలానంతరము శుద్ధయై స్వీకరింపదగును. ఉమ్మి, మలమూత్రాదులు, చెత్త చెదారముతో మలినమైన్టిది ప్రవాహము వచ్చినంతనే పవిత్రమగుచున్నది.
శ్లో || భ్రమన్ సంపూజ్యతే రాజా భ్రమన్ సంపూజ్యతే ద్విజః |
భ్రమన్ సంపూజ్యతే యోగీ స్త్రీ భ్రమన్తీ వినశ్యతిః || 4
అర్థము :- రాజా = రాజు, భ్రమన్ = తిరుగుచు, సంపూజ్యతే = పూజింపబడుచున్నాడు, ద్విజః = బ్రాహ్మణుడు, విద్వాంసుడు, భ్రమన్ = తిరుగుచు, సంపూజ్యతే = పూజింపబడుచున్నాడు, యోగీ = యోగియైనవాడు, భ్రమన్ = దేశసంచారముచేయుచు,సంపూజ్యతే = పూజింపబడుచున్నాడు, స్త్రీ = స్తీ, భ్రమన్తీ = ఇటు నటు తిరుగుచున్నదై, వినశ్యతి = నశించుచున్నది, చెడిపోవుచున్నది.
తాత్పర్యము :- రాజు ప్రజల క్షేమాదుల నరయుటకు తిరుగుచు, విద్వాంసుడు తన విజ్ఞానమును పంచి పెట్టుటకు దిరుగుచు, యోగాభ్యాసములోని విశేషముల దెల్పుటకు యోగి తిరుగుచు పూజింపబడుదురు. అటు నిటు తిరుగుచు స్త్రీ పరులచే బలాత్కరింపబడి భ్రష్టయగును. పతిత యగును.
వివరణము :- మనుమహర్షి స్త్రీ దూషిత యగుటకు నాఱు కారణముల దెల్పెను. అందులో భ్రమణ మొకి-
పానం దుర్జననంసర్గః పత్యా చ విరహో-టనమ్ |
స్వప్నో-న్యగేహ వాసశ్చ నారీ నందూషణాని ష్ || (మను. 9-13)
మత్తును కలిగించు మాదకద్రవ్య సేవనము, దుష్టపురుష సంబంధము, పతి వియోగము, మోసగాండ్రు పాఖండలునైన బాబాలు మొదలగువారి దర్శనము కొఱకు నిటు నటు తిరుగుట, ఇతరుల యిండ్లలో నివాసము చేయుట యను నాఱును స్త్రీని దూషితగా జేయును.
శ్లో || తాదృశీ జాయతే బుద్ధి ర్వ్యవసాయో-పి తాదృశః |
సహాయాస్తాదృశా ఏవ యాదృశీ భవితవ్యతా || 5
అర్థము:- యాదృశీ = ఏ విధముగా, భవితవ్యతా = కావలసియున్నదో, తాదృశీ = అి్టదియే, బుద్ధిః = బుద్ధి, జాయతే = పుట్టును, కలుగును, వ్యవసాయో-పి = ప్రయత్నము, ఉపాయముకూడ, తాదృశః = అి్టదేయగును, సహాయాః = సహాయులుకూడ, తాదృశాః ఏవ = అి్టవారే లభింతురు.
తాత్పర్యము :- తన భవిష్యత్తు ఏమి కానున్నదో దానికి దగిన బుద్ధియే కలుగును. వ్యవసాయము (ప్రయత్నము, ఉపాయము) దానికి దగినట్లే యుండును. సాయపడున్టిది కూడ న్టిదే సంభవించును.
వివరణము:- మనుష్యుడు వర్తమాన కాలములో పూర్వజన్మ కర్మఫలముల ననుభవించును. భాగ్యమేదియన-
పూర్వజన్మ కృతం కర్మ తద్దైవవితి కథ్యతే ||
పూర్వజన్మములో చేసిన కర్మఫలములనే అదృష్టము, భాగ్యమునందురు.
కావలసిన దేదైన నున్నచో నది జరిగియే తీఱును. శ్రీరాముడు బుద్ధిమంతుడయ్యు బంగారు లేడి వెంట పరుగెత్తును-
అసంభవం హేమమృగస్య జన్మ
తథా-పి రామో లులుధే మృగాయ |
ప్రాయః సమాపన్న విపత్తికాలే
థియో-పి పుంసాం మలినీ భవన్తి || (మహా నాటకము. 4-5)
బంగారు లేడి యుండుట యసంభవమని యెఱింగియు శ్రీరాముడులోభగుణము కలవాడై బంగారులేడి వెంటబడెను. దీని వలన దెలియునదేమనగా ఆపత్తి కలుగవలసిన సమయమున మనుష్యుల బుద్ధి మలినమై ఆలోచనాశక్తిని గోల్పోవును. లక్ష్మణుడు - ఇది మారీచుని మాయవలె నాకు తోచుచున్నదని చెప్పినను వినక శ్రీరాముడు బంగారు లేడి వెంటబడుట జరుగవలసినది తప్పక జరిగియే తీఱుటకాక యన్యమేమగును?
శ్లో || కాలః పచతి భూతాని కాలః సంహారతే ప్రజాః |
కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః || 6
అర్థము :- కాలః = కాలము, సమయము, భూతాని = ప్రాణములన్నిని, పచతి = మ్రింగుచున్నది, కాలః = కాలమే, ప్రజాః = ప్రజలనందఱిని సంహరతే = నాశముచేయుచున్నది, కాలః = కాలము, సుప్తేషు = నిద్రించుచుండ గాననగాసర్వ పదార్థములు నశించినను, జాగర్తి = మేల్కొని యుండును, మిగిలియుండును, కాలః = కాలము, దురతిక్రమః = అతిక్రమింపరానిది, హి = గదా!
తాత్పర్యము :- కాలము (సమయము) ప్రాణులను పచనము (జీర్ణము) చేయుచున్నది. మ్రింగును. కాలమే ప్రజలను నాశనము చేయును. సమస్త పదార్థములు నశించినను కాలము నిలిచియుండును. నిశ్చయముగా కాలము నెవ్వడును నుల్లంఘింపజాలడు. అతిక్రమించలేడు.
వివరణము:- కాలమునకు సంబంధించి వేదవచనము-
కాలో అశ్వో వహతి సప్తరశ్మిః సహస్రకో అజరో భూరిరేతాః |
తమారోహన్తి కవయో విపశ్చితస్తన్య చక్రా భువనాని విశ్వా ||
(అథర్వ. 19-53-1)
కాలరూపమైన గుఱ్ఱము విశ్వరూపమైన రథమును లాగుచున్నది. ఏడు రోజులు లేక ఏడు ఋతువులు అనునవి ఈ గుఱ్ఱమునకు ఏడు పగ్గములు కలవు. లెక్కలేనన్నిప్రాణుల శరీరముల నశింపజేయును. కాని తానెన్నడు జీర్ణము కాక మిక్కిలి బలము గలదిగా నుండును. కవులు మేధావులు దానిపై నెక్కుదురు. అనగా దానిని తగినట్లుగా సమయోచితముగా నుపయోగించుకుందురు. లోకలోకాంతరములు దాని చక్రములు, అనగా కాలము ద్వారానే లోకలోకాంతరములు చక్రము వలె తిరుగుచున్నవి- మహాభారతములో యకక్షుడు ధర్మరాజు నడిగెను-
'కావార్తా'- సమాచార మేమనెను? ధర్మరాజు సమాధానము-
అస్మిన్ మహామోహమయే రాత్రి దివేన్ధనేన |
మాసర్తుదుర్వీ పరిఘట్టనేన
భూతాని కాలః పదతీతి వార్తాః (భార.వన.313-118)
ఈ మహామోహరూపకళాయియందు (ప్రపంచములో) కాలము సమస్త ప్రాణులను మాసము, ఋతువుల రూపమగు తెడ్డుతో కలయ ద్రిప్పుచు, సూర్యరూపాగ్నిని, రాత్రిందినము లను కట్టెలతో మండించి వచనము (వండుట) చేయుచున్నది. ఇది యే వార్తయనెను.
శ్లో || న పశ్యతి చ జన్మాన్ధః కామాన్ధో నైవ పశ్యతి |
న పశ్యతి మదోన్మత్తో హ్యర్థీ దోషాన్ న పశ్యతి || 7
అర్థము :- జన్మాంధః = పుట్టు గ్రుడ్డి, న పశ్యతి = చూడలేదు, కామాంధః = కామాంధుడైన, నైవ పశ్యతి = చూడనే చూడడు, మదోన్మత్తః = మదోన్మత్తుడు, మత్తు పదార్థముల సేవించినవాడు, న పశ్యతి = చూడడు, అర్థీ = స్వార్థపరుడు, దోషాన్ = దోషములను, న పశ్యతి హి = చూడడు గదా!
తాత్పర్యము :- పుట్టుగ్రుడ్డి చూడలేడు. కామాంధుడు కూడ మంచిచెడ్డల చూడడు. సారాయి మొదలగు మత్తు పదార్థములు సేవించినవాడు కూడ ముందు వెనుక చూడడు. స్వార్థపరుడైన మనుష్యుడుకూడ చేయు పనిలోని మంచిచెడ్డల గమనింపడు.
కామప్రాబల్యమును గూర్చి భర్తృహరి-
కృశః కాణః ఖంజః శ్రవణరహితః పుచ్ఛ వికలో
వ్రణీ పూయక్లిన్నః కృమికులశతై రావృతతనూః |
కక్షుధాక్షామీ జీర్ణ పిఠరక కపాలార్పితగలః
శునీమన్వేతి శ్వా హతమపి నిహన్త్యేవ మదనః ||
(భర్తృ. శృం. 63)
ఆహారము లేక బక్కచిక్కియున్నను, ఒంికిందైనను, కుిందైనను చెవి తెగినదైనను, తోకలేనిదైనను పుండువడి చీము కారుచున్నను, పురుగులు పడిన శరీరము కలదైనను, ఆహారము లేక ముసలితనముతో ఊగుచున్న శరీరము కలదైనను, పగిలిన కుండ మూతిని మెడకు తగిలించుకొని కుక్క సంభోగము కొఱకు ఆడ కుక్క వెంటబడిపోవుచుండును. ఓహో! ఇన్ని విధముల నష్టపోయియున్నను ఇంకను బాధించుచున్న ఆ కామదేవుడెంతివాడో కదా!
శ్లో || స్వయం కర్మ కరోత్యాత్మా స్వయం తత్ఫలమశ్ను తే |
స్వయం భ్రమతి సంసారే స్వయం తస్మా ద్విముచ్యతే || 8
అర్థము :- ఆత్మా = జీవుడు, స్వయం = స్వయముగా, తానే, కర్మ = కర్మను, కరోతి = చేయుచున్నాడు, స్వయం = స్వయముగానే, తత్ఫలం = ఆ కర్మఫలమును, అశ్నుతే = అనుభవించుచున్నాడు, స్వయం = స్వయముగానే తానే, సంసారే = ప్రపంచములో, భ్రమతి = విభిన్న యోనులలో బుట్టుచున్నాడు, స్వయం = స్వయముగానే పురుషార్థమొనర్చి, తస్మాన్ = ఆ సంసార బంధనము నుండి, రాకపోకలను చక్రమునుండి, విముచ్యతే = విడువబడి మోక్షము పొందును.
తాత్పర్యము :- జీవుడు స్వయముగానే శుభాశుభకర్మలను స్వయముగానే శుభాశుభఫలముల ననుభవించుచున్నాడు. స్వయముగానే ప్రపంచములో విభిన్న యోనులలో పుట్టుచు చచ్చుచు తిరుగును. స్వయముగానే యీ సంసార చక్రబంధనము నుండి విడివడి ముక్తిని పొందుచున్నాడు.
వివరణము :- మనుష్యుడు కర్మ చేయుటలో స్వతంత్రుడు. కర్మ చేసిన తర్వాత పరమాత్ముని వ్యవస్థ చేత శుభాశుభ, పుణ్య పాపముల ననుభవించును. గంగలోకాని, యమునలోగాని, సముద్రములోకాని మునిగి స్నానము చేసినను ఆ కర్మల ఫలములు అనుభవింపనిదే విడిచి పెట్టవు-
న భుక్తం క్షీయతే కర్మ కల్పకోి శతైరపి |
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||
(బ్రహ్మ వైవర్త. ప్రకృతి. 37-16)
మనుష్యుడు చేసిన శుభాశుభకర్మల ఫలితమనుభవింపకుండ కోట్ల కొలది సంవత్సరములు గడచినను విడిచిపెట్టదు. విభిన్న యోనులలో బ్టుి యనుభవించిన తరువాతనే విడిచిపెట్టును. జీవుడు తన కర్మలను బ్టియే ప్రపంచములో భిన్న యోనులందు జన్మించుచుండును. వేదములో-
ఏష దేవో అమర్త్యః వర్ణవీ రివ దీయతే |
అభి ద్రోణా న్యాసదమ్ || (సామ. 1256)
ఈ ఆత్మ నానావిధ క్రీడల నాడుచుండును. ఇది నశింపదు. ఱెక్కలుగల పక్షివలె గతి కలది. ఇది యొక శరీరమును విడిచి మఱొక శరీరమునందు ప్రవేశించును. మనుష్యుడు తన పురుషార్థముతోనే సంసార బంధనమును విడిపించుకొనగలడు.
శ్లో || రాజా రాష్ట్రకృతం పాపం రాజ్ఞః పాపం పురోహితః |
భర్తా చస్త్రీకృతం పాపం శిష్య పాపం గురు స్తథా || 9
అర్థము :- రాష్ట్రకృతం = రాష్ట్రములో చేయబడిన, పాపం = పాపమును, రాజా = రాజు, రాజ్ఞః = రాజు యొక్క, పాపం = పాపమును, పురోహితః = పురోహితుడు, చ = మఱియు, స్త్రీ కృతం = భార్యచే జేయబడిన, పాపం = పాపమును, భర్తా = భర్తయు, తథా = అట్లే, శిష్యపాపం = శిష్యుని పాపమును, గురుః = గురువును ననుభవింతురు.
తాత్పర్యము:- రాష్ట్రములో చేయబడిన పాపమును రాజు, రాజు చేసిన పాపమును పురోహితుడు, భార్య చేసిన పాపమును భర్తయు, శిష్యుడు చేసిన పాపము గురువు ననుభవింతురు.
వివరణము:- ఇది యెనిమిదవ శ్లోకమునకు విరుద్ధమగుటచే ప్రక్షిప్తమనవలెను. ఎనిమిదవ శ్లోకములో - జీవుడు స్వయముగా కర్మచేసి తత్ఫలితముగా స్వయముగానే యనుభవించుచున్నాడు. అి్ట తఱి రాష్ట్రములో చేసిన కర్మఫలితము రాజు ద్వారా, రాజు చేసిన కర్మఫలితము పురోహితుని ద్వారా, భార్య చేసిన కర్మఫలితము భర్త ద్వారా, శిష్యుడు చేసిన కర్మఫలము గురువు ద్వారా యనుభవింపజేయుట యనుచితము. మనుష్యుడు తాను చేసిన కర్మ ఫలితమునే యనుభవింపవలెనుగాని యితరుల కర్మఫలితముగాదు. వేదములో ప్రార్థన-
మా వ ఏవో అన్యకృతం భుజేమ | (ఋ. 6-51-7)
ఓ విద్వాంసులారా! మనము స్త్రీలచే చేయబడిన పాపకర్మఫలము ననుభవింపకుందుము గాక!
శ్లో || ఋణకర్తా పితా శత్రుః మాతా చ వ్యభిచారిణీ |
భార్యా రూపవతీ శత్రుః పుత్రః శత్రు రపండితః || 10
అర్థము :- ఋణకర్తా = అప్పులు చేయున్టి, పితా = తండ్రి, శత్రుః = శత్రువు, చ = మఱియు, వ్యభిచారిణీ = వ్యభిచారము చేయున్టి, మాతా = తల్లియు, రూపవతీ = అందగత్తెయైన, భార్యా = భార్యయు, శత్రుః = శత్రువులు, అట్లే, అపండితః = మూర్ఖుడైన్టి, పుత్రః = పుత్రుడు కూడ, శత్రుః = శత్రువగుచున్నాడు.
తాత్పర్యము :- ఋణము చేత తండ్రియు, వ్యభిచారిణియైన తల్లియు, అందగత్తెయగు భార్యయు, మూర్ఖుడైన కుమారుడును శత్రువులుగా పరిగణింపబడుదురు.
వివరణము :- కష్టములు కలిగించువాడు శత్రువు. అప్పులపాలైన తండ్రి కష్టములు కలిగించును. తల్లి వ్యభిచారిణియగుచో ఆ తల్లి సంతానము దురాచారములు కలదగును. కుటుంబ మర్యాదలు పవిత్రత నశించును. కురూపియైన భర్తకు రూపవతియగు భార్యయున్నచో నందఱు నామెను కుదృష్టితో చూతురు. రూపవతియైన భార్య గుణవతి కాక కఠిన హృదయయగుచో శత్రువగుటలో సందేహము లేదు. ప్రసిద్ధుడైన ఆంగ్లకవి 'మిల్టన్' గ్రుడ్డివాడు. అతని భార్య మిక్కిలి అందగత్తె. కాని ఆమె మిక్కిలి కఠినమైన తీక్షణమైన స్వభావము కలది. అతని మిత్రుడొకనాడు మిత్రమా! నీ భార్య గులాబి పుష్పము వలె చాల అందమైన దనగా నిట్టూర్చి ' నేను గులాబి అందము నెఱుగను దాని ముళ్ల యనుభవము మాత్రము ప్రతిదినము నెఱుగుదుననెను. మూర్ఖుడైన పుత్రుడు తన కుటుంబము యొక్క ఖ్యాతికి బదులు అపఖ్యాతి కలుగజేయును కావున నతడు శత్రువే.
శ్లో || లుబ్ధమర్థేన గృహ్ణీయాత్ స్తబ్ధమంజలి కర్మణా |
మూర్ఖం ఛన్దో-ను వృత్తేన యథార్థత్వేన పండితమ్ || 11
అర్థము :- లుబ్ధం = ధనలోభిని, అర్థేన = ధనముతో, గృహ్ణీయాత్ = వశపఱచుకొనవచ్చును, స్తబ్ధం = అహంకారుని, దురభిమానుని, అంజలి కర్మణా = చేతులు జోడించి నమస్కరించియు, మూర్ఖం = మూర్ఖుడైన వానిని, ఛందో-నువృత్తేన = వాని కోరిక కనుకూలముగా పనిచేసియు, పండితం = పండితుని, యథార్థత్వేన = నిజము చెప్పుటచేతను, గృహ్ణీయాత్ = వశపఱచుకొనవలెను.
తాత్పర్యము :- ధనము నందాసక్తిగల లోభిని ధనము ద్వారా, అహంకారికి నమస్కారము ద్వారా, మూర్ఖుని అతని కోరిక ననుసరించి పనిచేసియు, బుద్ధిమంతుడైన వానిని సత్యవచనముల ద్వారా వశపఱచుకొనవలెను.
శ్లో || వరం న రాజ్యం న కురాజ రాజ్యం
నరం న మిత్రం న కుమిత్ర మిత్రమ్ |
వరం న శిష్యో న కుశిష్య శిష్యో
వరం న దారా న కుదార దారాః || 12
అర్థము :- రాజ్యం = రాజ్యము, న = లేకుండుటయే, వరం = శ్రేష్ఠము, కురాజరాజ్యం = చెడ్డరాజు రాజ్యము, న = అక్కఱలేదు, అనగా = చెడ్డరాజ్యముండుటకంటె రాజ్యము లేకుండుట మేలని యర్థము, మిత్రం = స్నేహితుడు, న = లేకుండుటయే, వరం = శ్రేష్ఠము, కుమిత్రమిత్రం = చెడ్డమిత్రునకు మిత్రుడు, న = కారాదు, శిష్యః = శిష్యుడు, న = లేకుండుటయే, వరం = శ్రేష్ఠము, కుశిష్యశిష్యః = చెడ్డశిష్యుడు శిష్యుడుగా నుండుట, న = వద్దు, దారాః = భార్య, న = లేకుండుటయే, వరం = శ్రేష్ఠము, కుదారదారాః = చెడ్డభార్య భార్య యగుట, న = వద్దు.
శ్లో || కురాజరాజ్యేన కుతః ప్రజాసుఖం
కుమిత్ర మిత్రేణ కతో-స్తి నిర్వృత్తిః |
కుదార దారైశ్చ కుతో గృహే రతిః |
కుశిష్య మధ్యాపయతః కుతో యశః || 13
అర్థము :- కురాజరాజ్యేన = దుష్టరాజుయొక్క రాజ్యములో, ప్రజాసుఖమ్ = ప్రజలకు సుఖము, కుతః = ఎక్కడిది? కుమిత్ర మిత్రేణ = మోసగాడైన మిత్రుని మైత్రితో, నిర్వృత్తి= ఆనందము, కుతఃఅస్తి = ఎక్కడున్నది? చ = మఱియు, కుదారదారైః = దుష్టస్త్రీ భార్యయైనచో, గృహే = ఇంిలో, రతిః = ప్రీతి, కుతః = ఎక్కడిది? కుశిష్యం = మోసగాడైన శిష్యునకు, అధ్యాపయతః = బోధించువానికి, యశః = యశస్సు, కుతః = ఎట్లుండును?
తాత్పర్యము :- దుష్టరాజు పాలించు రాజ్యములో ప్రజలకు సుఖమెక్కడిది? మోసగాడైన స్నేహితుని మైత్రి వలన ఆనందమెక్కడిది? దుష్టయైన భార్యవలన నింలో ప్రీతియేముండును? చెడ్డ శిష్యునకు బోధించు అధ్యాపకునకు కీర్తి యెక్కడిది?
శ్లో || సింహాదేకం బకాదేశం శిక్షే చ్చిత్వారి కుక్కుాత్ |
వాయసాత్పంచ శిక్షేచ్చ ష్ శునస్త్రీణి గర్దభాత్ || 14
అర్థము :- మనుష్యుడు, సింహాత్ = సింహము వలన, ఏకం = ఒక గుణము, బకాత్ = కొంగవలన, ఏకం = ఒక గుణమును, అట్లే, కుక్కుాత్ = కోడినుండి, చత్వారి = నాలుగును, శిక్షేత్ = నేర్చుకొనవలెను, వాయసాత్ = కాకివలన, పంచ = అయిదు గుణములు, చ = మఱియు, శునః = కుక్కనుండి, ష్ = ఆఱు గుణములు, గర్దభాత్ = గాడిద నుండి, త్రీణి = మూడు గుణములు, శిక్షేత్ = నేర్చుకొనవలెను, ఆయా గుణములు క్రింద వివరింపబడును.
తాత్పర్యము :- మనుష్యుడు సింహము నుండి యొక గుణము, కొంగ నుండి యొక గుణము, కోడినుండి నాలుగు గుణములు, కాకి నుండి యైదు గుణములు, కుక్కనుండి యాఱు గుణములు, గాడిద నుండి మూడు గుణములు నేర్వవలెను.
శ్లో || ప్రభూతం కార్యమల్పం వా యన్నరః కర్తు మిచ్ఛతి |
సర్వా రమ్భేణ తత్కార్యం సింహా దేకం ప్రచక్షతేః || 15
అర్థము :- నరః = మనుష్యుడు, యత్ = ఏ, ప్రభూతం = గొప్పదికాని, వా = లేక, అల్పం = చిన్నది కాని కార్యం = పనిని, కర్తుం = చేయుటకు, ఇచ్ఛతి = కోరుచున్నాడో, తత్కార్యం = ఆ పనిని, నర్వారం భేణ = శక్తి నంతయు నుపయోగించి సర్వ విధముల ప్రయత్నించి చేయవలెను ఇది, సింహాత్ = సింహమువలన, ఏకం = ఒక శిక్షణగా, ప్రచక్షతే = చెప్పబడుచున్నది.
తాత్పర్యము : - మనుష్యుడు తాను చేయదలచిన పని పెద్దదికాని చిన్నదికాని దానిని పూర్తిచేయుటకు సర్వశక్తి నుపయోగించి యన్నివిధముల ప్రయత్నము చేయవలెను. ఈ విషయము సింహమునుండి నేర్చుకొనవలెను.
వివరణము :- సింహము తాను వేాడుటకు శక్తినంతయు నుపయోగించును. అది తుపాకి గుండుకెదురుగా వెళ్లగలదు. ఇట్లే మనుష్యుడు కూడ పనిచేయుటలో శక్తినంతయు నుపయోగించుచో నది సఫలమగును.
శ్లో || ఇంద్రియాణి చ సంయమ్య బకవత్ పండితో నరః |
దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్ || 16
అర్థము :- పండితః = బుద్ధిమంతుడైన, నరః = మనుష్యుడు, బకవత్ = కొంగవలె నేకాగ్రచిత్తుడై, చ = అట్లే, ఇంద్రియాణి = ఇంద్రియములను, సంయమ్య = వశపఱచుకొని, దేశకాలబలం = దేశమును, కాలమును, తన బలమును, జ్ఞాత్వా = తెలుసుకొని, సర్వకార్యాణి = సమస్త కార్యములను, సాధయేత్ = సాధింపవలెను.
తాత్పర్యము :- బుద్ధిమంతుడైన మనుష్యుడు కొంగవలె నేకాగ్రచిత్తుడై యింద్రియములను వశమునందుంచుకొని, దేశమును, కాలమును, తన బలమును తెలిసికొని సమస్త కార్యములను సాధింపవలెను.
వివరణము :- కొంగజపము ప్రసిద్ధము, శ్రీరాముడు ధ్యానమగ్నమైయున్న కొంగనుజూచి లక్ష్మణునితో-
పశ్య లక్ష్మణ పంపాయాం బకః పరమధార్మికః |
మన్దం మన్దం పదం ధత్తే జీవానాం వధశంకయా ||
ఓ లక్ష్మణా! పంపాసరోవరములో పరమధార్మికమైన కొంగను జూడుడు. అది జీవహింసయగు నేమోయను శంకతో మెల్లమెల్లగా పాదములుంచుచున్నదనెను.
లక్ష్మణుడు సమాధాన మిచ్చుటకు ముందే యొక చేప యిట్లనెను-
అహో బకం ప్రశంసతే (రామ) యేనాహం నిష్కులీ కృతా |
సహవాసీ నిజానీయాత్ చరిత్రం సహవాసినామ్ ||
ఓహో! రామ! ఈ కొంగ నా కుటుంబమును చంపి నన్ను కుటుంబములేని దానినిగా చేసినది. అి్ట దానిని నీవు పొగుడుచున్నావు. తోివారి చరిత్ర తోివాడే యెఱుగునని చేపయనెను.
శ్లో || ప్రత్యుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు |
స్వయ మాక్రమ్య భుక్తం చ శిక్షేచ్చత్వారి కుక్కుాత్ || 17
అర్థము :- ప్రత్యుత్థానం = తగిన సమయమున మేల్కొనుట, చ = అట్లే, యుద్ధం = యుద్ధమునకు సిద్ధముగా నుండుట, చ = మఱియు, బంధుషు = బంధువులకు, సింవిభాగం= తగిన భాగము నిచ్చుట, చ = అట్లే, స్వయం = స్వయముగా, ఆక్రమ్య = ఆక్రమించి, లాగుకొని, భుక్తం = భుజించుటయును, చత్వారి, నాలుగు గుణములు, కుక్కుాత్ = కోడినుండి, శిక్షేత్ = నేర్చుకొనవలెను.
తాత్పర్యము :- తగిన సమయమున నిద్రలేచుటయు, యుద్ధమునకు సిద్ధపడి యుండుటయు, బంధువులకు రాదగిన భాగమిచ్చుటయు, స్వయముగా ఆక్రమించుకొని లాగుకొని భుజించుటయు నను ఈ నాలుగు విషయములను కోడినుండి నేర్చుకొనవలయును.
వివరణము :- ఎప్పుడు నొకే సమయమున నిద్రలేచుట కోడి నుండి నేర్వవలెను. గడియారమైనను తప్పుగా నడచునేమో కాని కోడి మాత్రము ప్రతిదినము నొకే సమయమున మేల్కొని కూయును. వేదములో-
ఉద్యన్ సూర్య ఇవ సుప్తానాం ద్విషతాం వర్చ ఆదదే | (అథర్వ.7-13-2)
ఒక వైదిక వీరుడు చాటుచున్నాడు - 'ఉదయించుచున్న సూర్యుడు నిద్రించుచున్న సోమరుల తేజస్సును హరించునట్లు, నేను కూడ శత్రువుల తేజస్సును, బలమును లాగి తీసుకొందును' అని.
సూర్యోదయము తరువాత నిద్రించు సోమరి యెందుకును పనికిరాడు. అతని లక్ష్మి నశించును. ఇందువలన సూర్యోదయమునకు ముందే నిద్రనుండి లేవవలెను. భారతీయ సంస్కృతిలో సూర్యోదయానంతరమును, సూర్యాస్తమయ సమయమునను నిద్రించుట పాపముగా పరిగణింపబడెను. భరతుడు కేకయరాజు (తాత) గారి యిిింనుండి వచ్చినపుడు తన నిర్దోషిత్వమును వెల్లడించుటకు ఒట్టుపెట్టుకొనెను. అందులో నొకి-
ఉథే సంధ్యే శయానస్య య త్పాపం పరికల్ప్యతే |
తత్పాపం భవేత్ తన్య యస్కా-ర్యో-ను మతే గతః ||
(వాల్మీకి రామాయణం. అయోధ్య. 75-44)
ఎవరి యనుమతితో ఆర్యుడైన రాముడు వనమునకు బంపబడెనో, యాతడు ప్రాతః సాయం సంధ్యాసమయములో నిద్రించువాని క్టిె పాపము సంభవించునో య్టి పాపమనుభవించును.
బంధువులకు రావలసిన భాగమీయకున్నచో దుర్యోధనునివలె నశించును. వేదములో-
కేవలాఘో భవతి కేవలాదీ || (ఋ. 10-117-6)
ఒంటరిగా భుజించువాడు పాపమునే తినును.
శ్లో || గూఢం చ మైధునం ధారష్ట్యం కాలే కాలే చ సంగ్రహమ్ |
అప్రమత్త మవిశ్వాసం పంచ శిక్షేచ్చ వాయసాత్ || 18
అర్థము :- గూఢం = రహస్యముగా, మైథునం = మైధునము (సంభోగము) చేయుటయు, దౌర్జ్యం = దౌర్జన్యము చేయుటయు, చ = అట్లే, కాలే కాలే = ప్రతి సమయమునను, సంగ్రహమ్ = ప్రోగు చేయుటయు, అప్రమత్తం = ఎల్లపుడు జాగరూకతతో నుండుటయు, చ = అట్లే, అవిశ్వాసం = ఎవరిని నమ్మకుండుటయు, ఈ యైదు గుణములు, వాయసాత్ = కాకి నుండి, శిక్షేత్ = నేర్చుకొనవలెను.
తాత్పర్యము :- రహస్యముగా మైథునము (సంభోగము) చేయుట, మొండితనము, సమయానుకూలముగా సంపాదించుట, అజాగ్రత్తగా నుండకుండుట, ఇతరులను నమ్మకుండుట యను నైదును కాకి నుండి నేర్చుకొనవలెను.
శ్లో || బహ్వాశీ స్వల్పసంతుష్టః సునిద్రో లఘుచేతనః |
స్వామి భక్తశ్చ శూరశ్చ షడేతే శ్వాసతో గుణాః || 19
అర్థము :- బహ్వాశీ = ఎక్కువ తినగలశక్తి, స్వల్ప సంతుష్టః = దొరకనపుడు, కొంచెముతోనే తృప్తిపడుటయు, సునిద్రః = బాగుగా నిద్రించుటయు, లఘుచేతనః = కొంచెము చప్పుడైనను నిద్రమేల్కొనుటయు, స్వామిభక్తః = యజమానునియందు భక్తి, ప్రీతి, విశ్వాసము, చ = మఱియు, శూరః = శౌర్యము, ఏతే = ఈ, షడ్ = ఆఱు, గుణాః = గుణములు శ్వాసతః = కుక్కనుండి, శిక్షేత్ = నేర్చుకొనవలెను.
తాత్పర్యము :- ఎక్కువ తినుశక్తియు ఎక్కువ లభింపకున్నను తక్కువ దానితోనే సంతోషించుట, బాగుగా నిద్రించుట, కొంచెము ధ్వనియైనను మేల్కొనుట, స్వామిభక్తియనగా యజమానుని విషయములో నమ్మకముగా నుండుట, శౌర్యము కలిగియుండుట యను నీ యాఱును కుక్క నుండి నేర్వవలెను.
శ్లో || సుశ్రాన్తో-పి వహేద్ భారం శీతోష్ణం న చ పశ్యతి |
సంతుష్టశ్చరతే నిత్యం త్రీణి శిక్షేచ్చ గర్దభాత్ || 20
అర్థము :- సుశ్రాన్తో-పి = బాగుగా అలసిపోయినను, భారం = బరువును, వహేత్ = మోయును, చ = అట్లే, శీతోష్ణం = చలిని, వేడిని, న పశ్యతి = చూడదు, లెక్క చేయదు, చ = మఱియు, నిత్యం = ఎల్లపుడును, సంతుష్టః = సంతోషించునదై, చరతే = సంచరించును, త్రీణి = ఈ మూడు గుణములు, గర్దభాత్ = గాడిద నుండి, శిక్షేత్ = నేర్వవలెను.
తాత్పర్యము :- అలసియున్నను భారము మోయుటయు, శీతోష్ణములను లెక్క చేయకుండుటయు,సంతోషముతో జీవనము గడుపుటయను మూడింని గాడిద నుండి నేర్చుకోవలెను.
శ్లో || య ఏతాన్ వింశతి గుణా నాచరిష్యతి మానవః |
కార్యా-వస్థాసు సర్వాసు అజేయః స భవిష్యతి || 21
అర్థము :- యః = ఏ, మానవః = మానవుడు, ఏతాన్ = ఈ, వింశతి గుణాన్ = ఇరువది గుణములను, ఆచరిష్యతి = ఆచరించునో, నః = వాడు, సర్వాసు = సమస్తమైన, కార్య-వస్థాసు = కార్యములందు, అవస్థలయందును, అజేయః = ఓటమి లేనివాడు, విజయుడు, భవిష్యతి = కాగలడు
తాత్పర్యము:- మనుష్యుడీ యిరువది గుణములను ఆచరణలో బ్టెినచో సమస్త కార్యములందును, సమస్తావస్థలలోను పరాజయము లేనివాడై విజయుడగును.
షష్ఠాధ్యాయము సమాప్తము
No comments:
Post a Comment