Tuesday, 4 May 2021

రాయి తగిలితే నొప్పిరానిదెవ్వరికి

ఎద ఎదకు ఎన్నెన్నో కథలు


ప్రతికథకు మరెన్నో వ్యధలు

కథ మార్చేదెవరు వ్యధ తీర్చేదెవరు?

రాయి తగిలితే నొప్పిరానిదెవ్వరికి

గుండె పగిలితే కన్నీరు పొంగనిదెందరికి

జీవితమన్నాక కష్టం రాకుండాఉంటుందా

ఓ సుఖం వచ్చి ఆ కష్టాన్ని కష్టపెట్టకపోతుందా

ఏదైనా మనసులోంచే కదా రావాలి !

మనిషి మనిషికి తేడా ఉన్నట్లే 

అనుభవంలోను ఆ స్వాదనలోను 

మరి తేడాలంటూ ఉండవా?.....

అభిరుచి ఉండాలే కాని

ఆకాశం నేల వాలదా ?

కొమ్మన పూలన్నీ ఆహ్వానం పలకవా!

ఒక్కసారి మనసు లోతుల్లోకి తొంగిచూడు

ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు, అనుభవాలు, ఆహ్వానాలు...

నీకేం తక్కువ? నువ్వు అందరికన్నా ఎక్కువే .....
  

No comments:

Post a Comment