నది పుష్కరాల సమయంలో చేయాల్చిన పిండప్రదానాలు
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ఆ వంశంలో గతించినవారికి సద్గతి కలుగుతుందని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణవచనం.
అందుకే పుష్కరాల్లో పితృదేవతలకు పిండప్రదానం తప్పక ఆచరించాలి.
గతించిన వారి బంధుత్వాన్ని అనుసరించి పిండప్రదానం చేయాలి.
బ్రాహ్మణ పురోహితుల ఆధ్వర్యంలో శాస్తోక్తంగా పిండప్రదానం చేస్తే పితృదేవతలందరికీ సద్గతి లభిస్తుంది.
బంధుత్వాల్లో ఎవరు మరణించి ఉన్నా వారందరికీ పిండప్రదానం చేయడం శాస్త్రప్రమాణం.
అయితే.. తండ్రి మరణించివారు మాత్రమే పుష్కరాల సమయంలో పిండప్రదానం చేసేందుకు అర్హులనే విషయం మర్చిపోకూడదు.
నది పుష్కరాల్లో తొమ్మిదో రోజు, ఆరోజున వీలుకాకపోతే, గతించిన వారి తిథిని అనుసరించి కానీ లేదా పుష్కర స్నానానికి వెళ్లినరోజున కానీ పిండప్రదానం చేయవచ్చు.
No comments:
Post a Comment