Tuesday, 4 May 2021

చాణక్య నీతి దర్పణము - ప్రథమాధ్యాయము

చాణక్య నీతి దర్పణము - ప్రథమాధ్యాయము

శ్లో ||  ప్రణమ్య శిరసా విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుమ్‌ |

 నానాశాస్త్రోద్ధృతం వక్ష్యే రాజనీతి సముచ్చయమ్‌ || 1

 శబ్దార్థము :- త్రైలోక్యాధిపతిం = పృథివి, అంతరిక్షము, దివి యను ముల్లోకములకు సధిపతియైన్టియు, ప్రభుం = సర్వశక్తిమంతుడైన్టియు, విష్ణుం = సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని, శిరసాప్రణమ్య = తలవంచి నమస్కరించి, నానాశాస్త్రోద్ధృతం = నానాశాస్త్రములనుండి యేరి, రాజనీతి సముచ్చయమ్‌ = రాజనీతి సముచ్చయమను గ్రంథమును, పక్ష్యే = చెప్పుదును.

 తాత్పర్యము :- పృథివి, అంతరిక్షము, ద్యులోకములను ముల్లోకములకు స్వామియు, సర్వశక్తిమంతుడును, సర్వవ్యాపకుడునైన పరమేశ్వరుని తలవంచి నమస్కరించి వేదాదులగు ననేక శాస్త్రములనుండి రాజనీతి సముచ్ఛయమను పేరుగల గ్రంథమును చెప్పుదును.

 వివరణము :- 'వేవేష్టి వ్యాప్నోతి చరాచరం జగత్‌ స విష్ణుః' చరాచర జగత్తునందంతట వ్యాపించి యుండుటచే పరమాత్మ నామము విష్ణువని మహర్షి దయానంద సరస్వతి సత్యార్థప్రకాశము ప్రథమ సముల్లాపమున తెలిపి యున్నారు. ప్రభువనగా సర్వశక్తిమంతుడు, అనగా తాను చేయదలచిన దానిని చేయగలడని కాదు. ఎందుచేతననగా పరమేశ్వరుడు తన్ను తాను చంపుకొని మఱొక పరమేశ్వరుని సృష్టింపలేడు. స్వయముగా మూర్ఖుడు కాలేడు. వ్యభిచారము మొదలగు పాపకర్మలు చేయలేడు. ఎవ్వనిని గూడ తన రాజ్యముకంటె వెలుపల నుంచలేడు. తనపై తా నెక్కలేడు. సర్వశక్తిమంతు డనగా పరమేశ్వరుడు సృష్ట్యుత్పత్తి స్థితి లయములను చేయుటలోను, జీవులకు (మనుజులకు) కర్మానుసారము ఫలమిచ్చుటలోను కొంచెము కూడ నితరుల సాయము కోరకయే తన సామర్థ్యముతో పూర్తి చేయగలడు.

 రాజనీతి సముచ్చయము :- చాణక్యుడు తాను వ్రాసిన గ్రంథమునకు రాజనీతి సముచ్చయమని పేరిడెను. కాలాంతరమున నది చాణక్య నీతి దర్పణముగా మాఱినది.

 నానాశాస్త్రోద్ధృతమ్‌ :- చాణక్యుడీ గ్రంథమును తాను కల్పించి వ్రాయలేదు. వేదము, మనుస్మృతి, మహాభారతము, ఉపనిషత్తులు మొదలగు గ్రంథములనుండి సారమును వెలికితీసి దీనిని సిద్ధము చేసెను.

శ్లో ||  అధీత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సత్తమః |

 ధర్మోపదేశ విఖ్యాతం కార్యాకార్యం శుభాశుభమ్‌ || 2

 అర్థము :- సత్తమః నరః = శ్రేష్టమనుష్యుడు, ఇదం = ఈ నీతి సముచ్ఛయమును, యథాశాస్త్రమ్‌ = శాస్త్ర పద్ధతిగ, అధీత్య = చదివి ధర్మోపదేశ విఖ్యాతమ్‌ = వేదము, మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములందు ప్రసిద్ధమైన, కార్యాకార్యమ్‌ = చేయదగిన చేయరాన్టియు, శుభాశుభమ్‌ = మంచిచెడ్డపనులను జానాతి = బాగుగా దెలిసికొనుచున్నాడు.

 తాత్పర్యము :- శ్రేష్ట మనుష్యుడు ఈ రాజనీతి సముచ్ఛయమును శాస్త్ర పద్ధతిగా జదివి వేదము, మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములందు ప్రసిద్ధమైన్టి కర్తవ్యాకర్తవ్యములను, పుణ్యపాపములను, మంచి చెడ్డలను బాగుగా తెలిసికొనును.

 వివరణము :- 'సత్తమః నరః' శ్రేష్ఠనరుడెవరో మహాభారతము చెప్పుచున్నది. చూడుడు-

 అమిత్రమపి చేద్దీనం శరణైషిణ మాగతమ్‌ |

 వ్యసనే యో2సుగృహ్ణాతి స వై పురుషసత్తమః || (మ.భా. అను 59-10)

శ్లో || తదహం సంప్రపక్ష్యామి లోకానాం హితకామ్యయా |

 యేన విజ్ఞాన మాత్రేణ సర్వజ్ఞత్వం ప్రపద్యతే ||  3

 అర్థము : - అహం = నేను, లోకానాం = ప్రజలకు, హితకామ్యయా = మేలు చేయవలెనను కోరికతో, తత్‌ = ఆ నీతి సముచ్ఛయమును, సంప్రపక్ష్యామి = బాగుగా చెప్పుదును, యేన = దేనిని, విజ్ఞానమాత్రేణ = తెలిసికొనిన మాత్రముచేతనే, మనుజుడు, సర్వజ్ఞత్వం = సర్వము దెలిసి కొనుటను, ప్రపద్యతే = పొందుచున్నాడో (దానిని)

 తాత్పర్యము :-  నేను మానవమాత్రులకు శుభము చేయు కోరికతో ఆ రాజనీతి సముచ్చయమును అనగా దేనిని తెలిసికొనినంతమాత్రమున మనుష్యుడు సర్వజ్ఞుడు కాగలడో య్టి దానిని బాగుగా చెప్పుచున్నాను.

 వివరణము :- సర్వజ్ఞుడనగా భూత వర్తమాన భవిష్యత్తులను దెలిసినవాడని కాని, లోకలోకాంతరమందలి విషయముల నన్నిని దెలిసినవాడని కాని యర్థముకాదు. ధర్మార్థకామముల జ్ఞానముకలవాడని యర్థము.

శ్లో || మూర్ఖశిష్యోపదేశేన దుష్టస్త్రీ భరణేన చ |

 దుఃఖితైః సంప్రయోగేణ పండితో-ప్యవ సీదతిః || 4

 అర్థము :- మూర్ఖశిష్యోపదేశేన = బుద్ధిహీనుడైన శిష్యుని చదివించుటచేతను లేక ధర్మసంబంధ విషయముల నుపదేశించుట చేతను, చ = మఱియు, దుష్టస్త్రీభరణేన = వ్యభిచారిణియు, కఠినముగా మ్లాడునదియు నగు స్త్రీ పోషించుటచేతను, దుఃఖితైః = నానాప్రకారములగు రోగములచే పీడింపబడున్టియు, ఆత్మీయుల వియోగముచే బాధపడున్టియు, ధననాశాదులచే దుఃఖితులైన్టివారితో, సంప్రయోగేణ = వ్యవహారముచేయుటచేత, పండితః అపి = బుద్ధిమంతుడైనవాడు కూడ, అవసీదతి = దుఃఖితుడై కష్టముల ననుభవించును.

 తాత్పర్యము :- బుద్ధిహీనుడైన శిష్యునకు ధర్మోపదేశము చేసినను, వ్యభిచారిణి, కఠినభాషిణియైన స్త్రీని పోషించినను, నానారోగములచే పీడితులును, ప్రియజనుల వియోగపీడితులును, ధననాశాధికారణములచే దుఃఖితులునునైన వారితో వ్యవహారము చేయుటచేతను బుద్ధిమంతుడైన మనుష్యుడు కూడ దుఃఖములపాలు కావలసివచ్చును.

 వివరణము :-

 ఉపదేశో హి మూర్ఖాణాం ప్రకోపాయ న శాస్తయే |

 పయః పానం భుజంగానాం కేవలం విషవర్ధనమ్‌ || (పం.తం. 1-42)

 ఉపదేశించుటచేత మూర్ఖులు కోపింతురేగాని శాంతింపరు. పాములకు పాలు పోసినచో విషమే వృద్ధియగును.

 మూర్ఖుని పంచ లక్షణములు :-

 మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వో దుర్వచనం తథా |

 హఠశ్చైవ విషాథ్చ పరోక్తం నైవ మన్యతే ||

 1. దురభిమానము, 2. కఠినముగా మ్లాడుట (బూతులు తిట్టుట), 3. మొండిపట్టు పట్టుట, 4. దుఃఖితుడగుట, 5. ఇతరుల మాటను వినకుండుట యను నైదును మూర్ఖుని లక్షణములు.

 దుష్టస్త్రీని (వ్యభిచారిణిని) పాలన పోషణ చేయరాదు.

 మాతా యస్య గృహే నాస్తి భార్యా చాప్రియవాదినీ |

 అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహమ్‌ || (పం.తం.4-53) 

 ఎవని తల్లి యిిింలో నుండదో, ఎవని భార్య అప్రియములు పలుకుచు దురాచారిణి యగునో య్టి యిిిం యజమానుడు అరణ్యమునకు బోవలెను. అి్ట యిల్లు అరణ్యముతో సమానమని యర్థము.

 దుఃఖితులు, రోగులు, పీడితులు, శోకసంతప్తులతో వ్యవహరించినచో కష్టములు సంప్రాప్తమగును. వైద్యుడు 'పరదుఃఖేన దుఃఖ్యతే' ఇతరుల దుఃఖముతో దుఃఖము కలవాడగును. ఇందువలన దుఃఖితులతో వ్యవహరించుటచేత పండితుడు కూడ దుఃఖితుడగును.

శ్లో || దుష్టాభార్యా శఠం మిత్రం భృత్యశ్ఛోత్తర దాయకః |

 స సర్వేచ గృహే వాసో మృత్యురేవ న సంశయః || 5

 అర్థము : - దుష్టా = కఠినముగా మ్లాడున్టియు దురాచారిణియునైన, భార్యా = భార్యయు, శఠం = వెనుకాడగు, మిత్రం = స్నేహతుడు, చ = అట్లే, ఉత్తరదాయకః = ఎదురు పలుకున్టి, భృత్యః = సేవకుడును, చ = మరియు, నసర్పే = సర్పమున్న్టి, గృహే = ఇంియందు, వానః = నివసించుటయు, మృత్యురేవ = మృత్యువుతో సమానమే, సంశయః న = సందేహము లేదు.

 తాత్పర్యము :- కఠినముగా మ్లాడున్టియు దురాచారిణియగు భార్యయు, వెనుకాడగు మిత్రుడు, ఎదురు చెప్పు సేవకుడు, సర్పముండు గృహనివాసము మృత్యువుతో సమానమే, సంశయము లేదు.

 వివరణము :- దుష్టభార్య - 

 అః పాకం కరోషి పాపిని, కథం పాపీ త్వదీయః పితా |

 రండే జల్ససి కిం, తవైవ జననీ రండా త్వదీయా స్వసా ||

 నిర్గచ్ఛ త్వరితం గృహాత్‌ బహిరితో, నేదం త్వదీయం గృహమ్‌ |

 హా! హా! నాథ! మమాద్యదేహి మరణం జారస్య భాగ్యోదయ ||

 గృహస్థు డొకడు అకలితో వ్యాకులుడై యిిింకి వచ్చి భోజనము చేయ దలంచును. కాని యిిింలో వంట తయారు కాకపోవుటచే క్రోధావేశమున భార్యతో - ఓ పాపిని! ఇప్పివఱకేల వంటచేయలేదు? పత్ని - నేనేల పాపినియగుదును? నీ బాబు పాపియగును. కోపించిన భర్త ఓసి ముండ? అధిక ప్రసంగము చేయుచున్నావేమి యనగా - ఆమె నేనేల ముండ నగుదును? నీ తల్లి నీ సోదరియే ముండలగును కుపితుడైన పతి - నా యిిింనుండి బయటకు పొమ్మనును, భార్య - ఇది నీ యిల్లేమియు గాదు అని సమాధానము ఈయగా భర్త, ఓరి భగవంతుడా! నాకీనాడే చావు వచ్చిన బాగుండునని వ్యభిచారిణియైన భార్య పెత్తనముగల యిిిం యజమానుడు వాపోవును. నిజముగా న్టి కులట మృత్యువే యగును.

 ధూర్త మిత్రుడు :-

 ముఖం పద్మదలాకారం వాచా చందనశీతలా |

 హృదయం క్రోధనం యుక్తం త్రివిధం ధూర్త లక్షణమ్‌ ||

 ముఖము పద్మము వలె ప్రసన్నముగా నుండును. వాక్కు చందనమువలె చల్లగా నుండును. హృదయము క్రోధయుక్తమై యుండును. ఈ మూడు లక్షణములు గలవాడే ధూర్తుడు. దొంగతో దొంగతనము చేయమని చెప్పును. యజమానునితో మేల్కొని యుండుమని చెప్పును. ఇి్ట ధూర్తుడు కూడ మృత్యువుతో సమానుడే. మిత్రుని మోసము చేసిన ధూర్తుడు మృత్యువునకు కారణమగును.

శ్లో ||  ఆపదర్థే ధనం రక్షేద్‌ దారాన్‌ రక్షే ద్ధనైరపి |

 ఆత్మానం సతతం రక్షేద్‌ దారైరపి ధనైరపి || 6

 అర్థము :- ఆపదర్థే = ఆపత్కాలమున నుపయోగపడుటకై, ధనం = ధనమును, రక్షేత్‌ = రక్షింపవలెను, ధనైరపి = ధనము కంటె నధికముగా, దారాన్‌ = భార్యను, రక్షేత్‌ = రక్షింపవలెను, సతతం = ఎల్లప్పుడు, దారైరపి = భార్యకంటె నధికముగ, ఆత్మానం = తన్నుతాను, రక్షేత్‌ = రక్షింపవలెను.

 తాత్పర్యము :- ఆపత్కాలము కొఱకు ధనమును రక్షింపవలెను. ధనము కంటె నధికముగా భార్యను రక్షింపవలెను. ఎల్లప్పుడు భార్యకంటెను ధనము కంటెను నధికముగా తన్నుతాను రక్షించుకొనవలెను. తాను నశించిన తర్వాత ధనము భార్యవలన ప్రయోజనముండదు. కావున ఆత్మ రక్షణము ముఖ్యము.

 వివరణము :- విదురనీతి - మ. భా. ఉ. 37-17 చూడుడు-

 త్యజేత్‌ కులార్థం పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్‌ |

 గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థం పృథివీం త్యజేత్‌ ||

 కులమును రక్షించుటకు పురుషుడు బలిదానము కావలెను. గ్రామరక్షణ కొఱకు కులమును త్యజింపవలెను. జిల్లారక్షణ కొఱకు గ్రామమును త్యజింపవలెను. ఆత్మరక్షణ కొఱకు సర్వప్రపంచమును విడువవలెను.

శ్లో || ఆపదర్థే ధనం రక్షే చ్ఛ్రీమతాం కుత ఆపదః |

 కదాచి చ్చలతే లక్ష్మీః సంచితో-వినశ్యతి || 7

 అర్థము :- ఆపదర్థే = ఆపదలను బోగొట్టుకొనుటకు, ధనం = ధనమును, రక్షేత్‌ = రక్షింపవలెను, శ్రీమతాం = ధనవంతులకు, ఆపదః = ఆపదలు, కుతః = ఎట్లు కలుగును? కదాచిత్‌ = ఎన్నడైన దైవ యోగముతో, లక్ష్మీః = సంపద, చలతే = పొయినచో, సంచితో-పి = సంపాదింపబడినది కూడ, వినశ్యతి = నశించి పోవును.

 తాత్పర్యము :-ఆపత్కాలములో ఆపదలను నివారించుకొనుటకు ధనమును రక్షించుకొనవలెను. శ్రీమంతులకు ఆపద లెట్లు వచ్చును? ఎప్పుడైనను దైవయోగము వలన సంపద పోవును. అప్పుడు కూడబ్టెిన ధనము కూడ నష్టమగును.

శ్లో ||  యస్మిన్‌ దేశే న సమ్మానో సవృత్తి ర్న చ బాంధవాః |

 న చ విద్యా--గమః కశ్చిత్‌ తం దేశం పరిపర్జయేత్‌ || 8

 అర్థము :- యస్మిన్‌ దేశే = ఏ ప్రదేశమందు, నమ్మానః = ఆదరణ, గౌరవము, న = వేదో, వృత్తిః = బ్రతుకుదెఱువు, న = లేదో, బాంధవాః చ = బంధువులు కూడ, న = లేరో, కశ్చిత్‌ = ఏదైనను, విద్యా+ఆగమః చ = విద్యాప్రాపియు, న = లేదో, తం దేశం = ఆ దేశమును, పరివర్జయేత్‌ = విడువవలెను.

 తాత్పర్యము :- ఏ ప్రదేశములో ఆదరాభిమానములుండవో, జీవనము జరుగదో, బాంధవులుండరో, ఏదైన విద్యాప్రాప్తి గలుగదో, అి్ట ప్రదేశమును విడిచిపెట్టవలెను.

శ్లో ||  ధనికః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః |

 పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివసం వసేత్‌ || 9

 అర్థము :- ధనికః = ధనవంతుడు, శ్రోత్రియః = వేదజ్ఞుడయిన బ్రాహ్మణుడు, రాజా = ధార్మికుడు, న్యాయశీలుడైన రాజు, నదీ = పొలము తడుపుటకు ఉపయోగించునదియు, పంచమః = అయిదవవాడైన, వైద్యః = రోగముల బోగొట్టు వైద్యుడు, యత్ర = ఎక్కడ, పంచ = ఈ అయిదును, న విద్యన్తే = ఉండవో, తత్ర = అచ్చట, దివ సం = ఒకరోజైనను, న వసేత్‌ = ఉండరాదు.

 తాత్పర్యము :- ధనవంతుడు, వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు, ధార్మికుడు, న్యాయ శీలుడైన రాజు, వ్యవసాయమున కుపయోగించు నదియు, ఐదవ వాడైన వైద్యుడునను న్టి అయిదు లేనిచోట నొక్కరోజైనను నుండరాదు.

 వివరణము :- ధనికః = ఆవశ్యకమైనపుడు ఋణమిచ్చు ధనికుడుండవలెను; శ్రోత్రియః = జనులకు ఉపదేశము చేసి సన్మార్గమున నడుపుటకు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడుండవలెను. బోధాయన గృహ్యసూత్రములలో శ్రోత్రియ శబ్దమున కిచ్చిన నిర్వచనము - బ్రాహ్మణేన బ్రాహ్మణ్యా ముత్పన్నః ప్రాగుపవయనా జ్ఞాతః ఇత్యభి ధీయతేః - బ్రాహ్మణుని వలన బ్రాహ్మణియందు ప్టుినవాడు ఉపనయనమునకు పూర్వము 'జాతు'డు అనబడును. 'ఉపనీత మాత్రో వ్రతానుచారీ వేదానాం కించి దదీత్య బ్రాహ్మణః' బ్రహ్మచర్యాది వ్రతముల పాలించువాడును, యజ్ఞోపవీతము ధరించినవాడును కొంత వేదపఠనముచేసిన వాడును బ్రాహ్మణు డనబడును - 'ఏకాంశాఖా సుధీత్య శ్రోత్రియః' వేదములోని యొక శాఖను అధ్యయనము చేసినవాడు శ్రోత్రియు డనబడును, మరియు దానకమలాకరములో-

 ఏకాం శాఖాం సకల్పాం వా షడ్భిరంగై రధీత్య చ |

 షట్కర్మ నిరతో విప్రః శ్రోత్రియో వాసు ధర్మనిత్‌ ||

 కల్పము లేక షడంగములతో గూడిన వేదము యొక్క యొక శాఖను అధ్యయనము చేసి - చదువుట, చదివించుట, యజ్ఞము చేయుట, యజ్ఞము చేయించుట, దానమిచ్చుట, దానము పుచ్చుకొనుట యను షట్కర్మలయందు ఆసక్తికలిగి నిర్వహించు ధర్మము తెలిసిన వాడైన బ్రాహ్మణుడు శ్రోత్రియుడగును. రాజు - న్యాయము, రక్షణ కొఱకు ధార్మికుడైన రాజు ఆవశ్యకమగును. నదీ - పొలము తడుపుటకు అభివృద్ధి పొందుటకు నదులుండవలెను. వైద్యుడు - రోగములు సంభవించినపుడు రోగనివృత్తిచేయుటకు వైద్యుడుండవలెను.

శ్లో ||  లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం త్యాగశీలతా |

 పంచ యత్ర న విద్యన్తేన కుర్యాత్‌ తత్ర సంస్థితమ్‌ ||  10

 అర్థము :- యత్ర = ఎక్కడ, లోకయాత్రా = జీవనోపాధి, భయం, దండనభయము, లజ్జా = లోకలజ్జ, దాక్షిణ్యం = చతురత, త్యాగశీలత = దానప్రవృత్తి అనున్టివి, పంచ = ఐదు, యత్ర = ఎక్కడ, న విద్యన్తే = ఎండవో, తత్ర = అక్కడ, సంస్థితం = నివాసమును, న కుర్యాత్‌ = చేయరాదు (ఉండరాదు)

 తాత్పర్యము :- ఎక్కడ బ్రతుకు దెరువు, వ్యాపారము, దండభయము, లోకలజ్జా, చతురత, దానమిచ్చు ప్రవృత్తి యను నైదు విషయము లుండవో యచ్చట నివసింపరాదు.

శ్లో ||  జానీయాత్‌ ప్రేషణే భృత్యాన్‌ బాంధవాన్‌ వ్యసనా--గమే |

 మిత్రంచా--పత్తి కాలేషు భార్యాం చ విభవక్షయే || 11

 అర్థము :- ప్రేషణే = పనులలో నియమించిన తర్వాత, భృత్యాన్‌ = సేవకులను, వ్యసనాగమే = దుఃఖము సంభవించినపుడు, బాంధవాన్‌ = బంధువులను, ఆపత్తికాలేషు =  ఆపదలు కలిగినపుడు, మిత్రం = మిత్రుని, చ = అట్లే, విభవక్షయే = ఐశ్వర్యము పోయినపుడు, భార్యాం = భార్యను, జానీయాత్‌ = తెలిసికొనవలెను (పరీక్షించవలెను)

 తాత్పర్యము :- పనుల నిర్వహణనుబ్టి నౌకరుల శక్తి తెలిసికొనవలెను. దుఃఖముల సంప్రాప్తమైనపుడు బంధు బాంధవులెంత యుపయోగపడుదురో గుర్తించవచ్చును. కష్టకాలములో సాయపడుటను బ్టి మిత్రుని స్థితి తెలియును. అట్లే ఐశ్వర్యము క్షీణించునపుడు భార్య స్వభావము తెలిసికొనవచ్చును.

శ్లో || ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రుసంకటే |

 రాజద్వారే శ్మశానే చ య స్తిష్ఠతి స బాంధవః || 12

 అర్థము : - ఆతురే = రోగము వచ్చినపుడు, వ్యసనేప్రాప్తి = దుఃఖము సంభవించినపుడు, దుర్భిక్షే = కఱువు వచ్చినపుడు, శత్రుసంకటే = శత్రువు వలన కష్టము కలిగినపుడు, రాజద్వారే = రాజసభయందు, చ = మరియు, శ్మశానే = శ్మశానమందు (వల్లకాడు), యః = ఎవడు, తిష్ఠతి = తోడుగా వెంటనుండునో, వః = వాడే, బాంధవః = నిజమైన బంధువు.

 తాత్పర్యము : - రోగము వచ్చినపుడు, దుఃఖము కలిగినపుడు, కఱువు వచ్చినపుడు, శత్రువుల బాధ యేర్పడినపుడు, రాజసభయందు, శ్మశానమందు ఎవడు తనతో నుండునో యతడే నిజమైన బంధువు.

శ్లో || యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువం పరిషేవతే |

 ధ్రువాణి తస్య నశ్యన్తి అధ్రువం నష్టమేవ చ || 13

 అర్థము :-  యః = ఏ మనుష్యుడు, ధ్రువాణి = నిశ్చిత పదార్థములను లేక బోగాధులను, పరిత్యజ్య = విడిచిప్టిె, అధ్రువం = అనిశ్చిత వస్తువును లేక భోగ్యపదార్థము కొఱకు, పరిషేవతే = పరుగెత్తుచు ప్రయత్నించునో, తన్య = అతని యొక్క, ధ్రువాణి = నిశ్చిత పదార్థము లేక కార్యములు, నశ్యన్తి = నశించును లేక చెడిపోవును, చ = మఱియు, అధ్రువం = అనిశ్చిత పదార్థము, నష్టమేవ = నష్టమేయగును.

 తాత్పర్యము :- ఏ మనుష్యుడు నిశ్చితములగు పదార్థములను విడిచిప్టిె యనిశ్చితములగు పదార్థములను పొందుటకు ప్రయత్నము చేయునో యతనికి నిశ్చిత పదార్థములు నష్టములగును, మఱియు ననిశ్చిత పదార్థము లెటునైనను నష్టములే గదా!

శ్లో || నరయేత్‌ కులజాం ప్రాజ్ఞో విరూపామపి కన్యకామ్‌ |

 రూపవతీం న నీచస్య వివాహః సదృశే కులే || 14

 అర్థము :-  ప్రాజ్ఞః = బుద్ధిమంతుడు, కులజాం = శ్రేష్ఠకులమందు ప్టుిన్టి, విరూపామపి = అందవిహీనమైన దానినైనను, సన్యకాం = కన్యను, పరయేత్‌ = వరింపవలెను. వివాహమాడవలెనుకాని, రూపవతీం = అందకత్తెయునను, నీచస్య = నీచుని యొక్క కులమందలి కన్యను, న = వివాహమాడరాదు, వివాహః = వివాహము, సదృశేకులే = తన గౌరవమున కనుకూలమైన కులమందలి కన్యనే చేసికొనవలెను.

 తాత్పర్యము :- బుద్ధిమంతుడైనవాడు శ్రేష్ఠకులమునందు ప్టుిన్టి కన్యను సౌందర్యవతి కాకున్నను వివాహము చేసికొనవలెను, అందెకత్తెయైనను నీచకులమునందు ప్టుిన కన్యను వివాహమాడరాదు. సదృశ్యయైన కన్యనే వివాహమాడవలెను.

 వివరణము :- ఈ శ్లోకము నిశ్చయముగా ప్రక్షిప్తమే. ఈ శ్లోకము ఈ యధ్యాయములోని పదునాఱవ శ్లోకమునకు విరుద్ధముగా నున్నది. దానిలో 'స్త్రీ రత్నం దుష్కులాడపి' అనగా దుష్కులమునుండి యైనను స్త్రీ రత్నమును గ్రహింపవలెనని యున్నది.

శ్లో ||  నఖీనాం చ నదీనాంచ శృంగీణాం శస్త్ర పాణినామ్‌ |

 విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ ||  15

 అర్థము :- నఖీనాం = గోళ్లుగల సింహములు, పెద్ద పులులు మొదలగువాని విషయములో, నదీనాం = నదుల విషయములో, చ = అట్లే, శృంగీణాం = పెద్ద పెద్ద కొమ్ములుగల ఆబోతుల విషయంలో, శస్త్రపాణినాం = ఆయుధములు చేతులలో గలవారి విషయములో, స్త్రీషు = స్త్రీలయందు, చ = మఱియు, రాజకులేషు = రాజకుమారులందు, విశ్వాసః = విశ్వాసము, న ఏవ కర్తవ్యః = చేయగూడదు, అనగా నమ్మరాదు.

 తాత్పర్యము :- వాడియైన గోళ్లుగల సింహాది మృగములందు, లోతైన నదులందు, వాడియైన కొమ్ములుగల ఆబోతులు మొదలైన వానియందు చేతిలో పదునైన కత్తులు గొడ్డళ్లు మొదలగు నాయుధములుగల వారియందు, స్త్రీలయందు, రాజకులములందు, విశ్వాసము కలిగియుండరాదు.

 వివరణము :- స్త్రీలయందు విశ్వాసముండనిచో గృహకృత్యములు నెఱవేరవు. స్త్రీ పురుషులలో పరస్పరము విశ్వాసము లేకున్నచో ఆ గృహము నరకమగును. విశ్వాసము లేని స్త్రీ పురుష సంతతి మోసగాళ్లగుదురు. ఇచ్చట స్రీలయందు విశ్వాస ముంచరాదనుట యనగా వారిని స్వేచ్ఛగా అరక్షితలుగా విడువరాదని యర్థము. వారిని స్వేచ్ఛగా విడిచినచో వారు శారీరకముగా దుర్భలులగుటచే బలవంతులైన పురుషులచే పరాభవింపబడుటకు, పతితలగుటకు నవకాశమున్నది. కావున స్వేచ్ఛగా విడువరాదనిరి. ఆ విషయములో దప్ప తక్కిన సర్వ విషయములందును వారి సలహాలు, సంప్రదింపులు మొదలగునవన్నియు నుండవలెను.

శ్లో || విషాదప్యమృతం గ్రాహ్యమమేధ్యాదపి కాంచనమ్‌ ||

 నీచాదప్యుత్తమా విద్యా స్త్రీ రత్నం దుష్కులాదపిః 16

 అర్థము :- విషాదపి = విషము నుండి కూడ, అమృతం = అమృతము, గ్రాహ్యం = గ్రహింపదగినది, అమేధ్యాదపి = అశుద్ధమైన మురికి పదార్థము నుండియు, కాంచనం =  బంగారము, నీచాదపి = నీచుని నుండియు, ఉత్తమా = శ్రేష్టమైన, విద్యా = విద్యయు, దుష్కులాదపి = దుష్కులము నుండియు, స్త్రీ రత్నమ్‌ = రత్నము విం స్త్రీ, గ్రాహ్యం = గ్రహింపదగినదే.

 తాత్పర్యము :- విషము నుండియు నమృతమును స్వీకరింపవలెను. అశుద్ధమైన మురికి నుండియు బంగారమును తీసుకొనవచ్చును. నీచుడైన వాని నుండియు శ్రేష్టమైన విద్యలను కళాకౌశముల నేర్చుకొనవచ్చును. అట్లే దుష్టకుల సంభవయైనను స్త్రీ రత్నమును గ్రహించి వివాహమాడవచ్చును.

శ్లో ||  స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిస్తాసాం చతుర్గుణా |

 సాహసం షడ్గుణం చైవ కామో-ష్టగుణ ఉచ్యతే|| 17

 అర్థము : - స్త్రీణాం = పురుషులకంటె స్త్రీలకు, ఆహారః = ఆహారము, ద్విగుణః = ర్టిెంపుండును, తాసాం = వారికి, బుద్ధిః = బుద్ధి, చతుర్గుణా = నాలుగు రెట్లుండును, సాహసం ఏవ = సాహసము కూడ, షడ్గుణం = ఆఱురెట్లుండును, చ = మఱియు, కామః = కామము, అష్టగుణః = ఎనిమిది రెట్లుగా, ఉచ్యతే = చెప్పబడుతున్నది.

 తాత్పర్యము :- స్త్రీలకు పురుషులకంటె ఆహారము రెండురెట్లు కావలెను. బుద్ధి నాలుగు రెట్లుండును.సాహసము ఆఱు రెట్లుండును. కామము ఎనిమిది రెట్లుండును.

 వివరణము :- ఈ శ్లోకములో స్త్రీ నిందలేదు. స్త్రీ స్వభావస్థితి చిత్రింపబడినది. స్త్రీలు గర్భమును ధరించి బిడ్డలను కని పాలనిచ్చి పోషించుచుందురు. అందుచే వారి యాహారము ర్టిెంపుండును. స్త్రీకి బుద్ధి పురుషునికంటె నాలుగు రెట్లుండును. ఈ విషయము నేడు విద్యాలయములలో, మహావిద్యాలయములలో, విశ్వవిద్యాలయములలో మగ పిల్లల కంటె ఆడపిల్లలే ప్రథమస్థానము లందున్నారు. పురుషుడు 25 సంవత్సరములకు యువకుడగును. స్త్రీ 16 సంవత్సరములకు యువతి యగును. పురుషుడు 25 సంవత్సరములలో నెంతనేర్చునో స్త్రీ 16 సంవత్సరములకే యంత నేర్చును. దీనినిబ్టియు పురుషుని బుద్ధికంటె స్త్రీ బుద్ధి తీవ్రమైనదని ధృడపడుచున్నది.

 మఱొకమాట స్త్రీలు స్వెట్టరు అల్లుదురు. దానిలో నొక్క తప్పు కూడ నుండదు. పిల్లలకు తినిపించుచుందురు. ప్రక్కవారితో మ్లాడుచుందురు. చర్చించుచుందురు. ఇట్లు పలు విషయములలో నొకేసారి పాల్గొనుటచే నాలుగురెట్లు బుద్ధియున్నట్లు సిద్ధమగుచున్నది. ఏ పురుషుడు న్లిొకేసారి యింతపని చేయజాలడు. సహజముగా స్త్రీలు సాహస స్వభావము గలవారు కాదు. ఒకవేళ సాహిసించవలసి వచ్చినచో పురుషుని మించి సాహసము చూపుదురు. మైధున సమయమున వీర్య స్ఖలనము కాగానే పురుషునకు కామశాంతి కలుగును. అంతే కాదు మైధునమునందు విముఖత ఏర్పడును. అందుచేత వీర్యస్ఖలనమునకు తరువాత పురుషుడు శారీరక మానసిక దృష్టులతో స్త్రీ సేవనములో నసమర్థుడనగును. పురుషుని వలె స్త్రీలకు మైధునసమయమున కామశాంతి కొఱకు స్వాభావికమైన క్రియ లేనందున వారాంగనలు (వేశ్యలు) ఒకరి తరువాత మఱొకరికి ననేకమంది పురుషులకు కామశాంతి కలుగచేయుచున్నారు. ఇందువలన శారీరక దృష్టిలో స్త్రీ పురుషునికంటె మిక్కిలి యధికమైన కామము కలది యగును.

అధ్యాయము-1 సమాప్తము


No comments:

Post a Comment