పదుగురిలో నీవు పెరగాలంటే నీచేత తగ్గింప బడాలి !
ఎదిగిన కొద్దీ ప్రతిసారి నీవు తగ్గించుకునేందుకే ప్రయత్నించాలి
నీకు నీవుగా తగ్గించుకుంటేనే పరమాత్మ చేత నీవు పెంచ బడతావు
నీకు నీవుగా తగ్గించుకుంటేనే పరమాత్మ చేత నీవు పెంచ బడతావు
లోకంలో అందరూ ఒకటేనని మరువరాదు
పీల్చే గాలి ఒకటైనపుడు ఎలా వేరవుతారు
నివసించే నేల ఒకటే అయినపుడు అంతా ఒకటే కాదా
ఎదుటివాడు లేకుంటే నీకు అధోగతే
నీ కోసం వంద సార్లు ఆలోచించు
ఒక్కసారైనా పరాలోచన చేయవా
నీకు చెందినది కాస్త పంచు
లేకపోతేనే అర్ధించు
దేవుడికి తలొగ్గడం కాదు
పరోపకారానికి తలొగ్గాలి
నన్ను పొగడమని ఏనాడూ దేవుడనలేదు
పూజిస్తావు .. ఆరాధిస్తావు ... అర్ధిస్తావు... వేడుకొంటావు.... ప్రార్ధిస్తావు .. అభిషేకిస్తావు
అనీ చేస్తావు ... ఏదీ చేయమని అడగని దేవుడి కోసం !
సాటి మనిషికి అడిగినా చేయలేని మనసాయే నీది
నీ పంథాని మార్చుకో
పదుగురిలో ఒకడిగా యోచన చెయ్
ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు ?
ఎండుటాకులా ఎలా పడుంటావ్
జనాలు తొక్కేసి పోరా మరి !
No comments:
Post a Comment