Tuesday, 4 May 2021

మానవబంధాలు కాపాడుకుంటేనే నిలబడతాయి

వజ్రం సంగతి మనకు తెలిసిందే! 

ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూర్  డైమండ్ విలువ ప్రస్తుతం 100 కోట్లకు పైమాటే! 

వజ్రం అన్నది దేనికీ లొంగని దట! 

ఆ మాట నిజమే కావచ్చు. 

ఒకవేళ దాన్ని బలి చేయాలంటే అలాంటి దాన్ని- అంత కన్నా గట్టి దాని మరొకటి వాడాల్సిందే. 

అంటే మరేమీ లేదు.... వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. 

అంటే వజ్రం ఎంత విలువైనదో అది అంత కన్నా పటిష్ట మైన దన్న మాట. 

దాని గట్టి దనాన్ని ఎవరూ కాదనలేరు. 


నేటి కాలంలో వజ్రాన్ని లేసర్ కిరణాలతో చక్కగా సాన బెడుతున్నారు. 

అలాగే కోస్తున్నారు కూడా ..... 

వజ్రం నీటిలో వుంచి సుమారు 770 డిగ్రీల సెంటి గ్రేడు వద్ద వేడి చేస్తే  అది ఆనవాలును మిగిల్చకుండా అంతా ఆవిరై పోతుంది.  

ఈ సృష్టిలో దేన్నయినా నాశనం చేయడం ఎంత సులువో చూడండి. 

కానీ బాగు చేయడం ఎంతో కష్టం.  

దేన్నయినా నిర్మించడానికి ఏల్లూ పూల్లూ పడితే కూలదోయడానికి  ఒక్క క్షనమ్ చాలును. 

సరిగ్గా వజ్రం విషయంలోనూ అంతే మరి! 

అది భూమి లోపలి పొరలో తయారవడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడితే దాన్ని బూడిద చేయడానికి ఓ  క్షనం సరిపోతుంది.

మానవబంధాలు కూడా అంతే 

జాగ్రత్తగా కాపాడుకుంటేనే అవి నిలబడతాయి 

అహంకారంతో కూలదోసుకున్నావా... 

నీకిక మిగిలేది అధోగతే !

అంధకారంలోకి పరుగులు తీస్తావు 



No comments:

Post a Comment