పనికి మాలిన పనులకు
వత్తాసు పలుక రాదు.చెడు పనులకు దూరంగా ఉంటేనే
మంచి భవిష్యత్తు కనిపించును.
చెడు అనేది ఎక్కడున్నా , ఎలా వున్నా
దాన్ని సమూలంగా నాశనం చెయ్ !
నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా
తెలియజేయి - అబద్దాన్ని ఆదరించకు !!
పిల్లలని ప్రేమించే వాడు
ప్రపంచంలో దేన్నైనా ప్రేమించ గలడు !
నా మజిలి నీవైతే
నీ గమ్యాన్ని నేనౌతా !!
ప్రతీ విషయములోను తన మాటే నెగ్గాలని పట్టుదల మంచిది కాదు.ఒకవేళ పట్టుపట్టిన ఆ పనినెరవేరేవరకు విడువరాదు.ఆడిన మాట తప్పడంకంటే ఆత్మహత్య ఎంతో నయము అని తెలుసు కొండి. మంచి పని చేసేటప్పుడు మాత్రం మెలకువగా వ్యవహరించండి.
No comments:
Post a Comment