శ్రీ కృష్ణ ఎదుర్కోలు - శ్రీ కృష్ణాయ నమః
శ్లో|| కృష్ణో రక్షతు మాం చరాచరగురుః
కృష్ణం నమస్యామ్యహమ్ |
కృష్ణేనానురశత్రవో సినిహతాః
కృష్ణాయ తస్మై నమః |
కృష్ణాదేవ సముత్థితం జగదిదం
కృష్ణస్య దాసో7స్మ్యహం |
కృష్ణే భక్తిరచంచలా7స్తు భగవన్
హే కృష్ణ! తుభ్యం నమః ||
శ్లో|| కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం
బాలం ముకుందం మనసా స్మరామి ||
1. శ్రీమదాదినారాయణుడు ధర్మసంస్థాపనార్ధం ప్రతి యుగంలోను అవతరిస్తున్నాడు. భక్తులను ఉద్ధరించడానికి తాను ఎన్నో బాధలు పడుతున్నాడు. అయినా దయాసముద్రుడు కనుక ఎక్కడో పరమపదంలో ఉన్నవాడు భూమి మీదకి దిగివచ్చాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములను ధరిస్తూ, ఈనాడు ఈ దివ్యక్షేత్రమైన ..............లో శ్రీకృష్ణస్వామిగా అర్చారూపంలో - అనగా విగ్రహరూపిగా మన కృష్ణస్వామి మనల్ని కాక్షిస్తున్నాడు.
ఇక ప్రస్తుత విషయం ఏమంటే - మా ప్రభువు అనగా శ్రీకృష్ణుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామాది విభవావతారములను ధరించి ప్రస్తుతం శ్రీకృష్ణావతారియై ఇక్కడ వేంచేసియున్నాడు. మా స్వామికి ప్రేమ ఎక్కువే. అనుగ్రహము ఎక్కువే. ఈ ప్రేమమూర్తికి విలక్షణ లక్షణయైన భార్య కోసమై వారి దాసానుదాసులమైన మేము ఇక్కడ ఈ క్షేత్రంలో అపర క్షీరాంభోనిధి కన్య శ్రీలక్ష్మీదేవి ఉన్నదని తెలిసి ఇటు వస్తున్నాము. మా కార్యము సఫలం చేస్తారేమోనని ఎదురుచూస్తున్నాము, ఇక్కడ వేంచేసియున్న భాగవతోత్తములను, స్వామీ!
శ్రీ రుక్మిణ్యై నమః
శ్లో|| పద్మప్రియే పద్మిని పద్మహస్తే | పద్మాలయే పద్మదళాయతాక్షి |
విశ్వప్రియే విష్ణుమనో7నుకూలే | త్యత్పాదపద్మం మయి సన్నిధత్స్య ||
శ్లో|| మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః |
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి
లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే ||
2. చాలా సంతోషము స్వామీ! నిరంతరం జీవులను తన బిడ్డలుగా భావించి, వారికి ధారకత్వ, పోషకత్వ, బోధన, జీవన, ఉజ్జీవనాలను అందించి రక్షించుటయే తన పనిగా పెట్టుకొని, స్వామివారికి నిత్యానసాయినిగా ప్రతి అవతారంలోనూ, ప్రతి సమయంలోను తోడుగా ఉంటూ స్వామివారి నిగ్రహానుగ్రహాలను సరిదిద్దుతూ - వాత్సల్యాది మహా గుణవిభూషితురాలైన మా అమ్మ 'శ్రీలక్ష్మీదేవి' ఇక్కడే వేంచేసియున్నది. ఆమెకీ యుక్తవయస్సు వచ్చింది. తగిన వరుని కోసం మేమూ అన్వేషణలోనే ఉన్నాం. ఇవాళ మీరు కూడా అదేపని మీద వచ్చామంటున్నారు. చాలా సంతోషం. మీకు స్వాగతం పలుకుతున్నాం. రండి! వేంచేయండి! ఇదిగో మా అమ్మాయి శ్రీలక్ష్మి. ఈమే రుక్మిణి ఆండాళ్. ఈమే సత్యభామ, ఈమే రాధాదేవి. అన్నీ ఈమెలోని వెలుగుజిలుగులే. మా అమ్మాయిని చూడండి శ్రీకృష్ణస్వామీ!
3. ఓహో! రుక్మిణీగారేనా మీ అమ్మాయి స్వామీ! ఈ అమ్మగారేనా బుద్ధిగా ఉన్న మా స్వామికి ప్రేమలేఖలు వ్రాసి ఆయన బుద్ధి పాడుచేసిన తల్లి! ఈమేనా శ్రీలక్ష్మి! ఇంో్ల తల్లిదండ్రుల మాటకాదని, స్వతంత్రించి స్వంత నిర్ణయాలు చేసుకొనే నేి సంప్రదాయాలకు సన్యాసమిప్పించిన సచ్చరిత్ర? ఇలాిం వారిని మా స్వామి శ్రీకృష్ణుడు. ఎలా వరిస్తాడు చెప్పండి?
సీ|| ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని
కర్ణరంధ్రంబుల కలిమియేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
జిహ్వకు ఫలరససిద్ధియేల?
ఆ||వె|| నీరజాత నయన! నీ వనమాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబుసేయని
జన్మమేల! యెన్ని జన్మములకు
4. స్వామీ! విషయం తెలియక ఏవేవో మాటలంటున్నారు జాగ్రత్త సుమండీ! మీ అబ్బాయి గుణగణాలను మేము కూడా ఏకరువు పెట్టగలము. ఈ ధూర్త గోపాలచక్రవర్తి శైశవహేల మాకూ తెలుసు. ఈయన కారాగారంలో పుట్టటం, తల్లిదండ్రులను నానాయిక్కట్లు పెట్టటం - అకల్రను, అన్నలను అందరినీ ముందుగానే నష్టపరచటం మాకు తెలినివా! సరే! సంప్రదాయమంటున్నారుగా! మీ అబ్బాయిగారి పుట్టుపూర్వోత్తరాలు, వంశము, కులగోత్రాలు ఏవీ వినిపించండి స్వామీ!
శ్లో|| తమద్భుతం బాలకమంబు జేక్షణం
చతుర్భుజం శంఖగదాద్యుధాయుధమ్ |
శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం
పీతాంబరం సాంద్ర పయోదసౌభగమ్ ||
కం|| సుతు గనె దేవకి నడురే
యతి శుభగతి దారలను గ్రహంబుల నుండన్ |
దితిసుత నిరాకరిష్ణున్
శ్రిత వదనాలంకరిష్ణు జిష్ణున్ నిష్ణున్ ||
5. స్వామీ! ముందే మనవి చేశాం. ఈయన ఆదినారాయణుడనీ, అవతారాలు ధరిస్తుాండనీ! ప్రస్తుతం శ్రీకృష్ణుని రూపంలో ...........క్షేత్రంలో వెలిసినాడని. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి, బుధవారం, రోహిణి నక్షత్రం, నాల్గవ పాదం, అర్ధరాత్రి చంద్రేదయ సమయం. వృషభలగ్నంలో దేవకీదేవికి అష్టమ సంతానంగా మా కృష్ణస్వామి ఆవిర్భవించారు. తండ్రి వసుదేవ చక్రవర్తి. తాత శూరసేన మహారాజు. గార్గేయ గోత్రం.
6. చాలా సంతోషం స్వామీ! అన్ని వసతులూ, నక్షత్ర గతులూ సరిచూసుకునే మీ అబ్బాయి అవతరించినట్లున్నది. మీరే అన్నారు కదా! దైవకార్యం వీరి రాచకార్యమని, ఏవేవో వేషాలు వేస్తూాండని - అదే లీలామానుష వేషధారి అని!
7. వీరి అన్నగారే బలరామస్వామి. హలాయుధధారులు. మా కృష్ణుడు నవరసనటనా చక్రవర్తి రసపురుషులు. రసస్వరూపులు. 'రసోవైసః' అన్నది ఉపనిషుత్త. ఈయన ముగ్ధమోహన సౌందర్యరాశి. వీరి తండ్రి వసుదేవుడు. ఆయన శుద్ధ సత్త్వ గుణసంపన్నులు. విశుద్ధచిత్తమే ఆయన. ఇక దేవకీదేవి వీరి తల్లి. ఆమెది నిష్కామబుద్ధి. ఈ శుభ దంపతుల అనురాగ దాంపత్యఫలం మా కృష్ణస్వామి శుభావిర్భావం. కంసుడు మా స్వామికి మేనమామ. 'పరిత్రాణాయ సాధూనాం...'. వీరి అవతార లక్ష్యం. దైవకార్యం వీరి రాచకార్యం. లీలామానుషవేషధారి. మరి మీ అమ్మాయి?
8. ఇక మా అమ్మాయి అపర లక్ష్మీదేవి. పాలసముద్రంలో ప్టుిన జగదేక సౌందర్యరాశి. 'లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం...' 'కాలస్య నారాయణః'. కాలరూపియైన నారాయణునికి నిత్యానసాయినీ. ప్రస్తుతం ద్వాపరయుగమని భావిస్తే - విదర్భ దేశాధీశులైన భీష్మకులవారి చిన్నకూతురీమె. పేరు రుక్మిణి. ఈమె పెద్దన్నగారు రుక్మి. ఎందరో రాజాధిరాజులు ఈమె రూప, యౌవన, శీల, సౌశీల్యాదులకు లోబడి పెళ్ళి చేసుకుాంమని వస్తున్నారు. కానీ ద్వారకాధిపతి అయిన శ్రీకృష్ణుని గురించి విన్నప్పి నుంచి ఈమె ఎలాగైనా శ్రీకృష్ణునే వివాహమాడాలని పట్టుబ్టి ఉన్నది. రాత్రింబగళ్ళు ఆమె శ్రీకృష్ణునే స్మరిస్తూ పలవరిస్తున్నది.
9. స్వామీ! మీ రుక్మిణి విషయం విన్నాక మేము వచ్చినపని తప్పక సఫలమవు తుందనిపిస్తున్నది. ఆడబోయిన తీర్థమెదురైనట్లు, ఇక మా అభియోగాలు కేవలం భ్రమజనితాలు. ఊహ - అపోహలు మహాపరమార్ధాల మాటున దాగిన మనుష్యభావనలు. గోవులు నోరు వాయాలేనివి కావు. 'గో' అంటే ఇంద్రియాలనీ, భక్తిజ్ఞానాలనీ, ఉపనిషత్తులనీ, ఆవులనీ, భూమి అనీ, అనేకార్ధాలున్నాయి. గోపాలుడంటే ఇంద్రియాలను లేదా వేదాలను పాలించేవాడనీ, నియమించి నియంత్రించేవాడనీ అర్ధం. ఆవులు మాతృస్వరూపాలు కదా! మనస్సు వెన్నవింది. దీన్ని అపహరిస్తే సర్వబంధాలూ తొలిగిపోతాయి. 'మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః'. మా కృష్ణుడు చూపరులను ఆకట్టుకున్నట్టే వారి మనస్సులనూ హరిస్తాడు. ఆయన చిత్తచోరుడు. 'పూసాం మోహనరూపుడు' కదా! కానీ, ఆయన మాత్రం చిక్కడు. గోపికల మనస్సులను యితర విషయాలపై పోకుండా ఉండేందుకే మా స్వామి గోపికా మానస చోరుడైనాడు.
శ్లో|| సా7శృణ్వత్ ముకుందస్వరూప వీర్యా గుణశ్రియః |
గృహాగతైః గీయమానాంస్తం మేనే సదృశం పతిమ్ ||
10. సంతోషమే. కానీ మీ కృష్ణుడు ఏవో చిలిపిచేష్టలు చేస్తూాండట! వెన్న, పాలు దొరికితే చాలు! ఈ దొంగపాలు తాగేవాడికీ, మ్టి తినేవాడికీ, ఆడపిల్లలను గోల చేసేవాడికి, నోరూవాయాలేను మూగజీవాలను తోలుకొని బ్రతికేవాడికి ఎలా పిల్లనీయగలమండి? సరే! ఏదో వేదాంతార్ధాలు రాద్ధాంతం చేస్తున్నారు. మాకూ సంతోషమే మరి వెర్రిపిల్లాడులాగా మ్టి తినడమేమి? 'తల్లిపాలు త్రాగి స్తన్యం గ్రుద్దినట్లు' ఇదేమి కృతఘ్నత? రోికి కట్టేస్తే తెంచుకొనిపోవడం, చెట్లను కూల్చేయడం, పాములను కాళ్ళ క్రిందేసి త్రొక్కేయడం, దావాగ్నిని త్రాగేయడం - ఇలాిం గారడీలు చేసే పగి వేషగాణ్ణి నమ్మి, మా అమ్మాయిని ఇస్తే, తరువాత ఇక మా అమ్మాయి పనీ - మా పనీ - ''గోవిందో హరీ!'' మా అమ్మాయి మహాక్రమశిక్షణ కలది. అభమూ శుభమూ తెలియని ఆత్మీయతా వాత్సల్యము ఆమె లక్షణాలు.
కం|| చిక్కడు వ్రతముల క్రతువుల
జిక్కడు దానముల శౌచశీలతపములన్
జిక్కడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు శుద్ధము సుండీ!
11. అయ్యా! విషయం తెలియక అలా అంటున్నారు కానీ మ్టి తిన్నారన్నారు. మా స్వామి పరమ పావనమూర్తి. ఎందరో ఋషులు, మునీంద్రులు గోవులుగా అవతరించి, గోకులంలో నివసిస్తున్నారు. వారి చరణ ధూళి కృష్ణుని ఉదరంలోకి ప్రవేశిస్తే ఆ జీవులు, గోవులు అన్నీ ముక్తిని పొందుతాయి. అలాిం జీవులకు ముక్తినివ్వడానికే మా స్వామి - 'బృందావన చంద్రుడు' వ్రజరజాన్ని (అంటే మ్టిని) తిన్నాడు. ఇక తల్లిపాలు త్రాగి స్తన్యం తన్నినాడన్నారు. పూతన రాక్షసి. అంటే అవిద్య అనగా అజ్ఞానం. మాయ. దాని సారాన్ని త్రాగివేశాడు. పూతన పవిత్రతను పొందింది. అందుకే ఆమెను దహనం చేస్తే అగరు పరిమళాల పొగలు వెలువడినాయట.
''దేహకల్మషములు శ్రీహరి ముఖమున దాచబడుట జేసి భూవరేణ్య!''
సీ|| పల్లవ వైభవాస్పదములు, పదములు కనకరంభా తిరస్కారులూరులు
అరుణాప్రభామనోహరములు కరములు, కంబు సౌందర్య మంగళము గళము
మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు, చకక్షురుత్సవదాయి చన్నుదోయి
పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు, జితమత్తమధుకర శ్రేణివేణి.
ఆ|| భావజాశుగముల ప్రాపులు చూపులు |
కుసుమశరుని విం కొనులు బొమలు |
చిత్తతోషణములు చెలువ భాషణములు |
జలజ సయన ముఖము చంద్రసఖము ||
- మరి మీరేమాంరో సెలవీయండి స్వామీ!
12. బాగుంది. పరమ భాగవతులు కనుక అన్నింలోను నారాయణ పరత్వాన్ని ఆపాదిస్తారు. మేమూ భక్తులమేనండి. మా అమ్మ శ్రీలక్ష్మీదేవి పద్మాలయ 'పద్మప్రియ పద్మిని పద్మ హస్తే' అంటుంది వేదం. పద్మం జ్ఞానానికి చిహ్నం. మా అమ్మ అవిద్యను తొలగించి జ్ఞానానందాలను కలిగించే వెలుగురేఖ. వేదం ఏమంటుందో చూడండి -
ఆదిత్యవర్ణే తపసో7ధిజాతో
వనస్పతి స్తన వృక్షో7థ బిల్వః |
తస్య ఫలాని తపసా నుదంతు
మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః ||
మాలక్ష్మి ఆర్ద్ర, పుష్కరిణి, పుష్టి, పింగళవర్ణ పద్మమాలిని.
13. మా స్వామి బృందావన చంద్రుడు. అదేోంగానీ అనవసరంగా ఆయనను అనరాని మాటలంటున్నారు ఎందరో. యశోదాదేవి రెండంగుళాల త్రాడు తగ్గితే కట్టలేకపోయింది. అహంకార, మమకారాలనేవి ఈ త్రాళ్ళు, ప్రేమ, భక్తి మాత్రమే మా స్వామిని బంధించగలవు. యమలార్జునలు రెండు చెట్లు. వీరు కుబేరుని పుత్రులు. నలకూబరులు. నారథాపంతో వృక్షాలైనారు. జీవుడు తనను బంధించినా, స్వామి తాను ఆ బంధనాలను త్రెంచుతాడట. అలాగే వత్సాసురుడు బకాసురుడు అజ్ఞానానికి , దంభానికి ప్రతిరూపాలు. మా స్వామి వీరిని వధించాడు. కాళీయమర్దనం కూడా అలాిందే. కాళీయమనగా ఇంద్రియధ్యానం. విషయాలు విషపూరితాలు కదా! 'బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసమపి కర్షతి' 'జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం' అని మా స్వామి చెప్పాడు. మా ప్రభువు కాళీయమర్దనం చేసి సత్సంగం యొక్క ఔన్నత్యాన్ని చాడు. కాళీయుడు విషరహితుడయ్యాడు. రమణకద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇక దావాగ్ని ప్రశమనం. సంసారమే దావాగ్ని. 'సంసార దావ దహనాకుల భీకరోగ్ర' దీనిని కృష్ణుడు త్రాగివేశాడు. కృష్ణనామ స్మరణం వ్యామోహప్రశమౌషధం.
14. మీ స్వామి మాహాత్మ్యాన్ని చెప్పారు. విన్నాం. మంచిదే. మా అమ్మాయిని తక్కువచేసి మ్లాడుతున్నారు. ఈమె 'చంచల' అన్నారు. అది తప్పు. ఆమె కడగించూపు చాలు. ఆమె మందకాక్షం చాలు. ఆమె బ్రహ్మరుద్రేందులకు మహావిభవాన్ని అనుగ్రహించిన అక్షయ ఐశ్వర్య వర్షిణి. 'లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం' ఈమె పెద్దల మాటవినదా? మంచివాళ్ళను నానాతిప్పలు పెడుతుందా? ఎంతమాట? 'మా అమ్మాయి శుభదాయి'. సకల సౌభాగ్యప్రదాత్రి.
15. సరే, మీ అమ్మాయి లక్ష్మి కదా! ఈమెను 'చంచల' అంారు. మతిస్థిమితం లేని అమ్మాయి. పెద్దలమాట వినదు. కాలు ఒకచోట నిలవదు. ప్రేమించిన వాళ్ళను మోసగిస్తుంది. సత్యాన్ని, ధర్మాన్ని నమ్మినవాళ్ళను నానా తిప్పలూ పెడుతుంది. రేపు మా స్వామిని కూడా ఇలాగే మోసగిస్తే ఎలాగండీ! చెప్పండి! స్వామీ!
16. మా లక్ష్మి పురుషకారభూతురాలు. ఎడమొగం పెడమొగంగా ఉన్న తండ్రినీ, బిడ్డలనీ మంచి మంచి మాటలతో సరిదిద్ది యిద్దరినీ కలిపే అమృతమూర్తి ఈమె. సిఫార్సు, సంస్కరణ, సామరస్యం ఈమె శుభలక్షణాలు. ఈమె ఉన్నచోట సకల సంపదలూ ఉంాయి. సర్వశుభాలు కలుగుతాయి. నిజానికి సత్యము, ధర్మము, నీతినిజాయితీలు ఈమె స్వరూపాలు. నమస్కరిస్తే చాలు అక్షయ మంగళములను ప్రసాదిస్తుంది మా తల్లి. మీ స్వామిలాగ జారత్వని, చోరత్వం, ధూర్తత్వం ... ఇలాింవి మా యిిాంవాం లేవు. గోపికలను వెంటవేసుకొని ఏదో బృందావనమనీ, రాచలీలలనీ, ..... ఎందుకలెండి అవన్నీ.
17. అలాగా స్వామీ! బృందావనమంటే ఏదో ఉద్యావనం కాదండి. రాచలీలలంటే మీరనుకుంటున్న తుచ్ఛమైన ప్రాకృత శృంగారం కాదు.
శ్లో|| చాపల్యసీమ చపలానుభవైక సీమ | చాతుర్యసీమ చతురానన శిల్పసీమ |
సౌలభ్యసీమ సకలాద్భుతకేళిసీమ | సౌభాగ్యసీమ తదిదం వ్రజభాగ్యసీమ ||
ఆ బృందావనంలో చక్కదనాల పూర్ణచంద్రుడు మా గోపాలుడు. ఆయన గోపికా చిత్తచోరుడు.
శ్లో|| మందారమూలే మదనాభిరామా | బింబాధరాపూరిత వేణునాదమ్ |
గోగోపగోపీజనమధ్యసంస్థం | గోపం భజే గోకుల పూర్ణచంద్రమ్ ||
ఆ గోపికల మధ్య విహరించే హృద్యమైన రసరమ్యమూర్తి శ్రీకృష్ణమూర్తి. 'నారి నారి నడుమ మురారి' ... 'హరికి హరికి మధ్య నడుమ వయ్యారి' అన్నట్టుగా ఇద్దరు గోపికల మధ్య ఒక కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్య ఒక గోపిక. బ్రహ్మనే మతి భ్రమింపజేసిన రాసలీలలు.
శ్లో|| అంగనామంగనామంతరే మాధవో, మాధవం మాధవంచాంతరే ఆంగనా |
ఇత్థమాకల్పితే మండలే మధ్యగో, ... ||
18. స్వామీ! చాలా సంతోషం. మధురాతి మధురమైన రాసలీలలను సాక్షాత్కరింపజేశారు. బాగానేవుంది. కానీ, మాకొక అనుమానం. వీరికి ఇప్పికే చాలాసార్లు పెళ్ళిళ్ళు ఐనాయట కదా! ఐనా వీరు 'అనాది బ్రహ్మచారి' అంటున్నారు. ఈ గోపికలూ, ఈ రాసలీలాహేలలూ, ఏకపత్నీవ్రత మర్యాదలకూ తిలోదకాలిచ్చారా? ఇంతమందిని ఇప్పికే ప్రేమించి పెళ్ళాడిన ఈ ఘనుడికి ఇక సంతానం సంఖ్య ఎంతో ఏమీో? రేపు మా రుక్మిణిని ఇచ్చి కట్టబెడితే మా స్థితిమతులు ఏమవుతాయోనని భయంగా వుంది స్వామీ!
19. స్వామీ! మా కృష్ణునికి పదహారువేల మంది గోపికలున్నమాట నిజం. కానీ మనమనుకునే పెళ్ళివింది కాదు మా స్వామిది. 'రసో వై సః' అని వేదం చెప్పింది. ప్రాకృతభావంతో మీరు మా స్వామిని అర్థం చేసుకోలేరు. ఆయన సర్వాంతర్యామి. ఆత్మారాముడు. సర్వభూతాంతరాత్మ. 'వాసనాద్వాసుదేవస్య....' వాసుదేవుడనగా పరమాత్మ. గోపికలు ఆత్మలు. వాళ్ళు జీవులకు ప్రతిరూపాలు, ప్రేమరూపాలు. యమునానదీతీరం. వెన్నెలవేళ. అవి శరద్రాత్రులు. వేణునాదాన్ని విన్న గోపికలు స్వామిని చేరారు. ఏ దివ్యక్రీడలో అన్ని రసాలు కలిసిపోతాయో అదే రాసక్రీడ. అదొక అద్భుతమైన, అవ్యక్తమైన భావనాప్రకర్ష. అలౌకిక, అప్రాకృత జీవాత్మ, పరమాత్మల సమ్మేళనము. నాయకుడు సచ్చిదానంద విగ్రహుడు, బృందావన సంచారి, స్వేచ్ఛావిహారి, గోపీజనమనోహరుడు. నాయికలు హ్లాదినీశక్తులు, పంచప్రాణాలు భగవంతునితో కలిసి రమించడమే రాసలీల. ఇది కామవిజయం. రాసలీల అనుకరించేది కాదు. కేవలం ఆలోచించేది, ఆరాధించేది మాత్రమే స్వామీ! 'భాగవతము తెలిసిపలుకుట చిత్రంబు శూలికైన, దమ్మి చూలికైన!' అన్నారు కదా మన పోతనామాత్యులు. అందువలననే మా కృష్ణస్వామి నిత్యపెళ్ళికొడుకు. 'అనాది బ్రహ్మచారీ చ కృష్ణో వ్యసనకర్శకః' నిత్యకళ్యాణం పచ్చతోరణం మా శ్రీ-నివాసుని శుభనికేతనం.
20. మా తల్లి మహాలక్ష్మి వాత్సల్యజలధి.
'ఈశానాం జగతో7స్య వేంకటసతేః
విష్ణోః పరాం ప్రేయసీం...'
ఈమె శ్రీమహాలక్ష్మి. అంటే మంగళప్రద. జయప్రద. సర్వ సంపత్ప్రద. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య .... ఒకటేిం మోక్షంతో సహా సర్వమూ ఈమె అధీనంలో ఉన్నాయి.
'ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణవిభవ ........' అని
భగవద్రామానుజులు శరణాగతి సమర్పించిన విషయం మీకు తెలిసిందే కదండీ!
21. అయినా ప్రేమలేఖలు వ్రాసి, ఊరి అవతలకు రమ్మనమని పిలిపించి, వరించమని ప్రాధేయపడితే వచ్చినవాళ్ళను యిలా నిష్ఠురంగా మాటలంటే ఎలాగండీ! మర్యాదగా మ్లాడటం మానవతుల లక్షణం కదా! ఇంతకూ మా అమ్మాయి గుణగణాలేోం కాస్త వివరిస్తారా స్వామీ!
22. అసంఖ్యేయ కల్యాణగుణగుణాలు ఈమెవి. ప్రత్యేకించి మీ స్వామి వలె ఏ సాందీపుల వారివద్దనో చదువులు సాగించనవసరంలేని స్వయంప్రభ మా అమ్మ. ఈమె సకల విద్యా వనవాసిని. తన చిన్నతనంలోనే సదాచార్యుల వలన భగవద్గూణానుసంధానాన్ని గావించింది. అలాగే భాగవతోత్తములైన సద్బ్రాహ్మణుని ఆశ్రయించి తన ఆర్తిని స్వామికి నివేదించుకున్న పూజ్యరాలీమె. సరే. మా అమ్మాయి గుణగణాలు విన్నవించాము. మీ స్వామి చదువు సంధ్యలు ఏపాివో వివరించండి స్వామీ!
23. మా స్వామి జగద్గురువు 'కృష్ణం వందే జగద్గురుం' అని లోకమంతా ఈయన్ని కీర్తిస్తోంది. భగవద్గీతాప్రవక్త. అర్జునునికి ద్వారా లోకానికి గీతోపదేశం చేసి జగద్గురువయినాడు. 'త్రీన్ లోకాన్ పాలయామ్యహం' అన్నారు స్వామి. అయినా 'లోకసంగ్రహమేవాపి' అన్నట్టు సాందీపులవారి సన్నిధిలో విద్యాభ్యాసం చేశారు. 'జగద్గురుర్జగన్నాథో వేణునాద విశారద' 'శ్రీకైవల్యపదంబు చేరుటకునై' 'కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తిః' 'అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదధిః'.
24. మా అమ్మాయి రుక్మిణి దివ్య శోభనగాత్రి బ్రహ్మాండ జనయిత్రి. భవ్యగాత్రి. కిసలయ మృదుపాణి. కీరమధురవాణి. పాలితశర్వాణి. నీలవేణి. సజ్జనావనహేల, శాంతలీల, మంజులాధరబింబ, మహితదీప్తికదంబ.
శ్లో|| రాఘవత్వే7భవత్సీతా రుక్మిణీ కృష్ణ జన్మని |
అన్యేషుచావతారేషు విష్ణోరేపా నపాయినీ ||
ఈమే సీత. ఈమే రుక్మిణి. ఈమే అలర్మేలుమంగ.
25. మీ అమ్మాయిగారు వ్రాసిన ప్రేమలేఖాంశాలు బయికి చెప్పరానివే. అయినా పరమాత్మ దివ్యగుణానుసంధానం సర్వపాపహరం కనుక విన్నవిస్తాం.
సీ|| ఏ నీ గుణంబులు కర్ణేంద్రియములు సోక
దేహతాపంబులు దీరిపోవు.
ఏ నీ శుభాకార మీక్షింప గన్నుల
కఖిలార్ధలాభంబు గలుగుచుండు.
ఏ నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన
భువనోన్నతత్త్వంబు బొందగలుగు
ఏ నీలసన్నామమే ప్రొద్దు భక్తితో
దడపిన బంధసంతతులు వాయు
తే|| న్టి నీ యందు నాచిత్తమనవరతము నచ్చియున్నది నీ యాన నొనలేదు.
కరుణ జూడుము కంసారి! ఖలవిదారి! శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
ఇంకా ఏమేమి రాసిందో మీ అమ్మాయిగారు.
వినండి స్వామీ! నిన్ను ఏ ఆడపిల్లలు మోహించరు, కనుక నన్ను తప్పు పట్టడానికి అంటున్నది!
శా|| ఛన్యున్ లోకమనోభిరాము గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బలదానశౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్ గోరరు? కోరదే మును రమాకాంతాలలామంబు రా
జన్యానే కస సింహ! నావలననే జన్నించెనే మోహముల్.
ఉ|| శ్రీయుతమూర్తి! యో పురుష సింహమ! సింహము పొలి సొమ్ముగో
మాయువుగోరు చందమున, మత్తుడు, చైద్యుడు, నీపదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిదా గొనిపోటెద నంచునున్న వా
డా యుధమాధముండెఙుగ ఉద్భుతమైన భవత్ప్రతాపముల్ ||
26. అయ్యా! మా బంధువులంతా మీ కల్యాణానికి ఆమోదప్రమోదాలు తెలుపుతున్నారు. 'బంధూనాం ఇచ్ఛతా దాతుం కృష్ణాయ' అంతే కాదు లోకంలోని వారందరు కూడా అదే కోరుతున్నారు. మా రుక్మిణిది అదే నిశ్చయం. 'తుల్య శీలవయో వృత్తాం తుల్యాభిజనలక్షణాం' అన్నట్లు శీలము, వయస్సు, వృత్తులు, జననము, వంశము పరస్పరము సమానములుగా భాసిస్తున్నాయి. ఇంత చక్కని వధూవరసారూప్యాన్ని, శుక్షలక్షణ సంపత్తిని బ్రహ్మ ఈ రుక్మిణీకృష్ణుల దాంపత్యంలో పొదిగినందుకు బ్రహ్మగారి సృష్టి కళా నైపుణ్యాన్ని లోకమంతా ప్రశంసిస్తున్నది.
శ్లో|| అస్యైవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతినా7పరా |
అసావప్యనవద్యాత్మా భైమ్యాః సముచితః పతిః ||
శ్రీకృష్ణునికి తగిన భార్య మన రుక్మిణి ఒక్కతే. మరొకరు కాలేరు. విలక్షణ లక్షితుడైన శ్రీకృష్ణుడే ఈమెకు తగిన భర్త కాదగినవాడు. 'ధర్మస్థే వృద్ధసమ్మతః' అన్నట్లు పెద్దలంతా ఆమెదించిన ఈ వధూవరుల దాంపత్యం లోకకల్యాణ సంధాయకం ! కనుక
మ|| తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్ దధ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ యిద్దఱిం
దిగులం గ్టిన బ్రహ్మ నేర్పరి గదా! దర్పాహతారాతియై
మగడౌ గావుత జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్ ||
27. తననెలా తీసుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోవాలో మీ అమ్మాయే చెప్పింది. 'శిశుపాల జరాసుతులన్ జయించి, నా వంకకు వచ్చి, రాక్షసవివాహము' చేసుకోమంది. దానికి ఉపాయమట - నగరానికి వెలుపల ఉన్న నగజాతకు మ్రొక్కడానికి తాను వస్తుందట. ఆ సమయంలో మా స్వామివచ్చి కాచుకొని కూర్చొని, ఆమెను రాక్షసరీతిలో తీసుకొని వెళ్ళి పెళ్ళి చేసుకోమన్నది. లేకపోతే .... 'నూరు జన్మంబులన్ నిను చింతించుచు బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా! - అంటున్నది. మరి మీరేమాంరు?
చతుస్సాగర పర్యంతం గోబ్రహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరసశైన్య గార్గ్యేయ త్రయార్షేయ ప్రవరాన్విత
గార్గ్యేయస గోత్రోద్భవస్య ద్వేమీఢ మహారుజ వర్మణో నప్త్రే
శూరమహారాజ వర్మణః పౌత్రాయ వసుదేవ మహారాజవర్మణః పుత్రాయ
గార్గ్యేయసగోత్రోద్భవాయ శ్రీకృష్ణపరబ్రహ్మ వర్మణే వరాయ ||
28. మీ మువ్వగోపాలునికి, మా అమ్మాయి రుక్మిణి సర్వవిధాల సరైన జోడి. మేము సంతోషముగా మా అమ్మాయిని మీ అబ్బాయికి సమర్పించడాన్ని అంగీకరిస్తున్నాం. ఇక్కడున్న మహా భగవద్భాగవతాచార్యులందరు, ముత్తైదువులందరు మంగళాశీస్సులను కాక్షించండి.
శ్లో|| లక్ష్మీ విలోల భువనస్తుత భవ్యలీల |
సత్సాధుశీల సరిదాత్మ భవానుకూల |
కల్యాణజాల! కలికల్మష తూలకీల |
శ్రీవాసుదేవ రమాప్రియ మంగళం తే ||
No comments:
Post a Comment