చాణక్య నీతి దర్పణము - చతుర్థాధ్యాయము
శ్లో || ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ ||
పంచై తాని హి సృజ్యన్తే గర్భస్థస్యైవ దేహిన || 1
అర్థము :- ఆయుః= గర్భము మొదలు మరణము వఱకు నున్న స్థితి ఆయువు, చ = అట్లే, కర్మ = కర్మయు, విత్తం = ధనము, చ = మఱియు, విద్యా = విద్యయు, చ = మఱియు, నిధనమేవ = మరణము అను, ఏతాని పంచ = ఈ అయిదును, దేహినః = దేహధారియైన జీవునకు, గర్భస్థస్యైవ = గర్భమునందున్నవానికే, సృజ్యన్తే హి = సృజింపబడునుగదా! నిశ్చయింపబడియుండును.
తాత్పర్యము :- ఆయుస్సు అనగా గర్భధారణ లేక జన్మ మొదలు మృత్యుపర్యంతమున్న సమయము, అట్లే కర్మయు, ధనము, విద్యయు, మృత్యువు - ఈ అయిదును శరీరధారియగు జీవునకు గర్భములో నుండగానే నిశ్చయింపబడును.
వివరణము :- పూర్వజన్మ కర్మఫలము నిశ్చిత పద్ధతిలో సంభవించును. మహర్షి పతంజలి-
సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః |
(యోగ దర్శనము 2-13)
అవిద్య మున్నగు పంచక్లేశ రూపమూల మున్నంతవఱకు దానిఫలమగు జాతి అనగా పశు పక్షి మనుష్య మొదలగు పుట్టుకః ఆయువు అనగా జీవిత పరమావధిః భోగమనగా సుఖ దుఃఖముల చక్రభ్రమణము అను మూడింలో జాతి నిశ్చయముగా కనబడుచునే యుండును. దీనిని మార్చలేము. మిగిలిన ఆయుస్సును భోగమును పురుష ప్రయత్నముచే మార్చబడుచున్నవి.
ఆయుస్సు- కాలమృత్యువు; అకాలమృత్యువు కూడ కలుగును.
ఏకోత్తరం మృత్యుశత మథర్వాణ ప్రచక్షతే |
తత్రైకః కాలసంజ్ఞస్తు శేషా అగన్తవాః స్మృతాః || (సుశ్రుతము)
అథర్వవేద వేత్తలు మనుష్యునకు జీవనములో 101 సార్లు మృత్యువగుననిరి. వానిలో నొకి కాలమృత్యువగు ననిరి. వానిలో నొకి మాత్రము కాలమృత్యువు, మఱియు మిగిలినవి అకాలమృత్యువులు.
వైద్యకశాస్త్రము అపమృత్యువు = అకాలమృత్యువును సిద్ధింపజేయుచున్నది. అపమృత్యువు లేనిచో వైద్యకశాస్త్రము యొక్క యావశ్యకతయే యుండదు. శుద్ధమైన అన్నపానాదులు, సదాచారమువలన ఆయుస్సు పెరుగును. అశుద్ధమగు అన్నపానాదుల వలనను దురాచారాదుల వలనను ఆయుస్సు క్షీణించును.
కర్మము :- మానవునకు కర్మలు స్వతః సిద్ధముగానే నిశ్చితములై యీ కర్మ యీ వ్యక్తి చేయవలయును అని యున్నచో శాస్త్రోపదేశము వ్యర్థమగును. కర్మలు నిశ్చితములేయైనచో జీవునకు పాపపుణ్య కర్మల ఫలము అంటరాదు. కారణము జీవుడు తన యిష్టానుసారము చేయక పరవశుడై పూర్వనిశ్చితములనే చేసెను. కావున నతడు బాధ్యుడు కాక పోవలసివచ్చును.
ధనము:- ధనప్రాప్తియు నిశ్చితమైయున్నచో ధనము కొఱకు వ్యాపారము, నౌకరి, వ్యవసాయము మొదలగు పురుష ప్రయత్నములు వ్యర్థము. ఎవనికెట్లు జరుగవలెనో యట్లే జరుగునని ప్రయత్నములు మానవలెను.
విద్యా :- ఎవని కెంత విద్య కలుగవలెనో నిశ్చితమైయున్నచో విద్యాలయములు, మహావిద్యాలయములు, విశ్వవిద్యాలయములు మూసివేయవలెను. చదువుట, వ్రాయుటయు నావశ్యకములు కావు. మనుష్యుడు జ్ఞానిగా తనంతట తానేయగును.
మృత్యు విచక్షణ ఆయువునుగూర్చి వ్రాసిన దానితోనే నది సరిపోవును.
మనుష్యుడు తన భాగ్యమునకు స్వయముగానే నిర్మాతయగును. తన పురుష ప్రయత్నముతోనే ధనము, విద్య మొదలగు వానిని పొందును.
శ్లో || సాధుభ్యన్తే నివర్తన్తే పుత్రా మిత్రాణి బాంధవాః |
యే చతైైః సహ గన్తార స్తద్ధర్మా త్సుకృతం కులమ్ || 2
అర్థము :- పుత్రాః = పుత్రులు, మిత్రాణి = మిత్రులు, బాంధవాః = బంధువులు, తే = అనువారందఱు, సాధుభ్యః = మంచివారినుండి, నివర్తన్తే = విముఖములుగా నుందురు, చ = మఱియు, యే = ఎవరు, తైః సహ = ఆ సాధువులతో గూడ, గన్తారః = అనుసరించుచుందురో వారు, తద్ధర్మాత్ = ఆ పుణ్యము వలన, కులమ్ = కులము, కుటుంబము, సుకృతమ్ = ధన్యమైనదగును, పుణ్యవంతమగును.
తాత్పర్యము :- ఎవరు సాధువుల ననుసరించుచు వారితో సత్సంగము జేయుదురో వారికి ననుకూలముగా నాచరింతురో యా పుణ్యమున వారి పరివారము (కుటుంబము) పుణ్యము కలది యగును. అటులకాని వారి పుత్రులు, మిత్రులు, బంధు బాంధవులు సాధువులనుండి దూరముగా నుందురు.
శ్లో || దర్శన ధ్యాన సంస్సర్శైర్మతీసకూర్మీ చ పక్షిణీ |
శిశుం పాలయతే నిత్యం తథా సజ్జన సంగతిః || 3
అర్థము :- మత్సీ = చేప, కూర్మీ = తాబేలు, చ = మఱియు, పక్షిణీ = పక్షియు, దర్శన = చేప చూపుతోను, ధ్యాన = తాబేలు ధ్యానముతోను, సంస్సర్శైః = పక్షి స్పృశించుటతోను, నిత్యం = ఎల్లప్పుడు, శిశుం = సంతానమును, పాలయతే = పోషించుచున్నది. తథా = అట్లే, సజ్జన సంగతిః = శ్రేష్ఠుల సాంగత్యము కూడ మనుష్యులను పోషించుచు మేలు చేయుచుండును.
తాత్పర్యము :- చేప చూపుతోను, తాబేలు ధ్యానముతోను, పక్షిస్పర్శతోను(తాకుట) తమ తమ సంతానమును నిత్యము రక్షించుచుండును. అట్లే శ్రేష్ఠపురుషుల సంబంధము మనుష్యులను పోషించును, రక్షించును.
వివరణము :- సత్సంగ మహిమను గూర్చి భర్తృహరి-
జాడ్యం ధియో హరితి సించతి వాచి సత్యం,
మానోన్నతిం దిశతి పాపమపాకరోతిః |
చేతః ప్రసాదయతి దికక్షు తనోతి కీర్తిం,
నత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్ || (భర్తృ. నీతి. 22)
సత్సంగతి బుద్ధిమాంద్యమును బోగొట్టును. వాక్కు నందు సత్యమును నిల్పును. గౌరవమును చెందును. గొప్ప గౌరవమును గలిగించును. పాపమును బోగొట్టును. దిక్కులందంతట యశస్సును వ్యాపింపజేయును. మానవులకు సత్సంగతివలన యేమి కలుగదో చెప్పును.
శ్లో || యావత్స్వస్థో హ్యయం దేహో యావన్మృత్యుచ్చ దూరతః |
తావదాత్మహితం కుర్యాత్ ప్రాణాన్తే కిం కరిష్యతి || 4
అర్థము :- యావత్ హి = ఎంతవఱకైతే, అయం = ఈ, దేహః = దేహము, స్వస్థః = రోగములేనిదై యుండునో, చ = మఱియు, యావత్ = ఎంతకాలము, మృత్యుః = మరణము, దూరతః = దూరముగా నుండునో, తావత్ = అంతవఱకు, ఆత్మహితం = తనకు మేలును గలిగించు ధర్మాచరణము, పుణ్యకర్మలను, కుర్యాత్ = చేయుచుండవలెను, ప్రాణాన్తే = ప్రాణములు పోయిన తరువాత, కిం కరిష్యతి = ఏమి చేయగలడు?
తాత్పర్యము :- ఈ శరీరమెంతకాలము రోగము లేనిదై సాస్థ్యము కలదై యుండునో, యంతవఱకు తనకు మేలు కలిగించు శుభకర్మలను, ధర్మాచరణము, పుణ్యకర్మలు చేయవలెను. మరణించిన తరువాత నేమి చేయగలరు?
వివరణము :- ఈ విషయమే భర్తృహరి-
యావత్సస్థ మిదం శరీర మరుజం యావజ్జరా దూరతో,
యావచ్చేన్దిృయ శక్తిరప్రతిహతా యావర్షయో నాయుషః |
ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్,
పన్దీస్తే భవనే తు కూపఖననం ప్రత్యుద్యమః కీదృశః ||
(భర్తృ.వైరా.79)
శరీరము రోగము లేకుండ స్వస్థతగా నున్నప్పుడు, ముసలితనము రాకముందే, ఇంద్రియ శక్తి పటుత్వము కలిగియున్నప్పుడు, ఆయుస్సు క్షీణింపనపుడు బుద్దిమంతుడు తన శ్రేయస్సు కొఱకు మిక్కిలి ప్రయత్నింపవలెను. అటులకాక అన్నియు క్షీణించిన తరువాత ప్రయత్నించుట కొంప తగులబడుచుండ బావి త్రవ్వుటకు ప్రయత్నించుటవలె వ్యర్థమగును.
ఆత్మకల్యాణము కొఱకు నేమి చేయవలెనో జవాబు-
కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్యం మహేశ్వరమ్ |
త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమమ్ ||
రాత్రింబవళ్లు పుణ్యకర్మలు చేయుము. పరమేశ్వరుని నిత్యము స్మరింపుము. దుర్జన సాంగత్యము విడువుము. సజ్జన సాంగత్యము చేయుము. కాని క్రింది పరిస్థితి యుండును.
వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయన్తీ,
రోమాశ్చ శత్రవ ఇవ ప్రహరన్తి గాత్రమ్ |
ఆయుః పరిస్రవతి భిన్నఘాదివామ్చో,
లోకో న చాత్మహిత మాచరతీతి చిత్రమ్ ||
(చాణక్య రాజనీతి శాస్త్రము 4-24)
భయంకరమైన పెద్దపులి వలె వృద్ధావస్థ భయభీతుని చేయుచుండును. రోగములు శత్రువులవలె శరీరమును ఆక్రమించుచుండును. పగిలినకుండనుండి నీరు స్రవించునట్లు ఆయుస్సు క్షీణించుచుండును. అయినను మనుష్యుడు తన కల్యాణము (మేలు) కొఱకు ప్రయత్నము చేయడు. ఇది మహా విచిత్రము.
శ్లో || కామధేను గుణ విద్యాహ్యకాలే ఫలదాయినీ |
ప్రవాసే మాతృసదృశీ విద్యాగుప్తంధనం స్కృతమ్ || 5
అర్థము: - విద్యా = విద్య, కామధేను గుణా = కామధేనువువలె సాయపడున్టి గుణము గలది, హి = ఎట్లనగా, అకాలే = సమయముకాని సమయమందుగూడ, ఫలదాయినీ = ఫలములనిచ్చును, ఉపయోగపడును, ప్రవాసే = విదేశములందున్నప్పుడు, మాతృసదృశీ = తల్లివలె హితమును రక్షణచేయును, అందువలన, విద్యా = విద్య, గుప్తం = దాచబడిన, ధనం = ధనముగా, స్పృతమ్ = చెప్పబడుచున్నది.
తాత్పర్యము :- విద్యయు, కామధేనువు సమాన గుణములు గలవి. కామధేనువు సమయ వివక్షత లేకుండనే ఫలముల నిచ్చును. విద్య గృహమునకు వెలుపల ప్రదేశములో నున్నను, విదేశములలో నున్నను తల్లివలె మేలును రక్షణను కలిగించును. విద్య దాచిన ధనమువిందిగా తలంపబడుచున్నది.
వివరణము :- విద్య నిజముగా కామధేనువే-
మా తేవ రక్షతి పితేవ హితే నియం క్తే,
కాంతేవ చాభిరమయత్యపనీయ ఖేదమ్ |
కీర్తిం చ దికక్షు నితనోతి దదాతి లక్ష్మీం,
కిం కిం న సాధయతి కల్పల తేవ విద్యా ||
విద్య తల్లి వలె రక్షించును, తండ్రివలె మేలు కలుగు కార్యములందు నియోగించును. దుఃఖములను పోగొట్టు భార్యవలె ఆనందమును గలిగించును. నాల్గుదిక్కులందు కీర్తిని వ్యాపింపజేయును. ధనప్రాప్తి కలిగించును. కల్పవృక్షమువలె విద్యయేమి యీయదు? సమస్తమును ప్రాప్తింపజేయును.
అపూర్వః కో-పి కోశో-యం విద్యతే తవ భారతి |
వ్యయతో వృద్ధి మాయాతి క్షయ మాయాతి నంచయాత్ ||
ఓ విద్యా దేవి! నీ కోశము చాలవిచిత్రమైనది. నిన్నింతె యితరలకు దానముచేయుదురో యంత పెరుగుచునే యుందువు. నిన్నితరులకు నీయక కూడబ్టినచో తగ్గిపోవును. విద్యాధనము సాధారణ ధనమునకు వ్యతిరేకము.
శ్లో || పరమేకో గుణీ పుత్రో నిర్గుణైశ్చ శతైరపి |
ఏకశ్చన్దృ స్తమోహన్యి న చ తారాః సహస్రశః || 6
అర్థము :- శతైః = వందలకొలది, నిర్గుణైః అపి = గుణహీనుల కంటె, గుణీ = గుణవంతుడైన, పుత్రః = పుత్రుడు, ఏకః = ఒక్కడు, వరం = శ్రేష్ఠుడు, చంద్రః = చంద్రుడు, ఏకః = ఒక్కడే, తమః = చీకిని, హన్తి = పోగొట్టుచున్నాడు, చ = కాని, సహస్రశః = వేలకొలది, తారాః = నక్షత్రములు, న = పోగొట్టలేవు గదా!
తాత్పర్యము :- గుణరహితుడైన మూర్ఖులగు వందలకొలది పుత్రులకంటె గుణవంతుడగు శ్రేష్ఠపుత్రుడొక్కడు చాలు. చంద్రు డొక్కడే చీకిని పోగొట్టగలడుగాని వేలకొలది నక్షత్రములు పోగొట్టజాలవు కదా!
వివరణము :- గుణవంతుడగు పుత్రుడొక్కడే నిజముగా చాలును-
ఏకేనా-పి సుపుత్రేణ సింహీ స్వపితి నిర్భయమ్ |
న హైవ థభిః పుత్రైర్భారం వహతి రాసభీ ||
మంచి పుత్రుడు కలిగిన ఆడసింహము అడవిలో సుఖముగా నిర్భయముగా నిద్రించును. కాని గాడిదకు పది సంతానమున్నను బరువు మోయక తప్పదు కదా!
శ్లో || మూర్ఖశ్చిరాయుర్జాతో-పి తస్మాజ్జాతమృతో పరః |
మృతః స చా-ల్పదుఃఖాయయావజ్జీవంజడోదహేత్ || 7
అర్థము:- చిరాయుః = చాలకాలము బ్రతుకున్టి, మూర్ఖః = మూర్ఖుడు, జాతో-పి = ప్టుినవాడైనను, తస్మాత్ = అతనికంటె, జాతమృతః = పుట్టగానే చచ్చినవాడు, వరః = శ్రేష్టుడు, మృతః = చచ్చిన్టి, నః = వాడు, అల్పదుఃఖాయ = చచ్చినపుడు మాత్రమే దుఃఖము కలిగించును, జడః = చివరకాలము జీవించిన మూర్ఖుడు, యావజ్జీవం = బ్రతికినన్నినాళ్లు, దహేత్ = దహింపజేయును, దుఃఖము కలిగించును.
తాత్పర్యము:- చిరాయువుగా మూర్ఖుడు పుట్టుటకంటె పుట్టగానే చచ్చుట మేలు. పుట్టగానే మరణించినచో దుఃఖము స్వల్పముగానే యుండును. మూర్ఖుడు జీవించినంతకాలం దుఃఖపెట్టును, దహించును గదా!
వివరణము :- ఈ భావమునే మఱొక కవి రచించెను-
అజాత మృత మూర్ఖాణాం పరమౌడ్యౌ న చాంతిమః |
సకృ ద్దుఃఖకరా వాద్యాపన్తిమస్తు పదే పదే ||
సంతానము లేకుండుటయు, సంతానము కలిగి నశించుటయు, మూర్ఖత్వము కలిగియుండుటయు అను మూిలో మూడవ దాని కంటె మొది రెండే శ్రేష్టములు. మొది రిెం నొక్కసారే దుఃఖము కలుగును. కాని మూడవది యగు మూర్ఖత్వము వలన బ్రతికినంతకాలము దుఃఖము సంభవించును.
శ్లో || కుగ్రామవాసః కులహీన సేవా కుభోజనం క్రోధముఖీచ భార్యా |
పుత్రశ్చ మూర్ఖో విధవా చ కన్యా
వినా-గ్నినా ష్ ప్రదహన్తి కాయమ్ || 8
అర్థము :- కుగ్రామవాసః = చెడ్డ గ్రామములో నుండుటయు, కులహీనసేవా = నీచ కులము వాని సేవయు, కుభోజనం = చెడ్డభోజనము, చ = మఱియు, క్రోధముఖీ = క్రోధ స్వభావముగల, భార్యా = భార్యయు, చ = అట్లే, మూర్ఖః = మూర్ఖుడైన, పుత్రః = పుత్రుడు, చ = మఱియు, విధవా = భర్త పోయిన, కన్యా = వయసురాని, బిడ్డలు లేని కూతురు, ష్ = ఈ యాఱుగురును, అగ్నినావినా = నిప్పులేకుండనే, కాయం = శరీరమును, దహన్తి = కాల్చుదురు.
తాత్పర్యము :- చెడుగ్రామ నివాసము, నీచకులమునందు ప్టుినవానిని సేవించుటయు, చెడ్డ భోజనము, క్రోధస్వభావముగల భార్యయు, మూర్ఖుడైన పుత్రుడు, విధవయైన కన్యయు అను నీ యాఱును అగ్ని లేకుండనే శరీరమును దహించును.
వివరణము :- కుగ్రామ మనగా- ధనికుడు,విద్వాంసుడు, రాజు, నది, వైద్యుడు అను వారలు లేని గ్రామము. కుభోజన మనగా- చల్ది పాచిపోయినది, సగము ఉడికినది, సగము నీళ్లున్నది, ఏహ్య భావమును గలిగించున్టి దోషములు కలిగి తినుట కసహ్యముగానండి జీర్ణముకాదో య్టి భోజనము. ఒక కవి యిట్లు చెప్పెను-
కుభోజ్యేన దినం నష్టం కుకలత్రేణ శర్వరీ?
కుపుత్రేణ కులం నష్టం తన్నష్టం యన్నదీయతే ||
చెడ్డ భోజనముచే ఆ రోజు, చెడ్డభార్యచే రాత్రియు, చెడ్డ పుత్రునిచే కులము నష్టపడును. ఇతరల కీయని ధనముకూడ నష్టమగును.
శ్లో || కిం తయా క్రియతే ధేన్వా న దోగ్ధ్రీ న చ గుర్విణీ |
కో-ర్థః పుత్రేణజాతేన యోన విద్వాన్ చ భక్తిమాన్ || 9
అర్థము :- యా = ఏ యావు, దోగ్ధ్రీ = పాలిచ్చునది, న = కాదో, చ = మఱియు, యా = ఏ యావు, గుర్విణీ = గర్భము దాల్చునది, న = కాదో, తయా = అి్ట ఆవుతో, కిం క్రియతే = ఏమి చేయబడును? యః = ఎవడు, విద్వాన్ = విద్వాంసుడు, భక్తిమాన్ = భక్తిగలవాడు, న = కాడో, అి్టవాడైన, జాతేన = ప్టుిన్టి, పుత్రేణ = పుత్రునితో, కః అర్థః = ఏమి ప్రయోజనము?
తాత్పర్యము :- ఏ యావు గర్భము ధరింపకయు పాలు ఈయకయుండునో (గొడ్డుావు) అి్టది యెందుకు పనికిరాదు. అట్లే పుత్రుడు విద్వాంసుడు, భక్తిమంతుడు కాకున్నచో నాతనికి నేమి ప్రయోజనము.
వివరణము :- పుత్రుడు గుణవంతుడు కావలెను-
యన్య పుత్రో స వై విద్వాన్న శూరో స చ ధార్మికః |
అప్రకాశం కులం తన్య నష్ట చంద్రేవ శర్వరీ ||
ఎవని పుత్రుడు విద్వాంసుడు, శూరవీరుడు, ధార్మికుడు కాడో య్టివాని వంశము చంద్రునిలేని రాత్రివలె ప్రకాశవిహీనమగును.
దానే తపసి శౌర్యే చ యస్య న ప్రథితం యశః |
విద్యయా మర్థలాధే చ మాతురుచ్ఛార ఏవ నః ||
దానము, తపస్సు, శౌర్యము, విద్యాప్రాప్తి, ధనలాభము, ప్రసిద్ధ కీర్తియు గలవాడు కేవలము పుత్రుడే కాక తల్లికి గొప్ప ఫలము వింవాడు.
శ్లో || సంసారతాప దగ్ధానా త్రయో విశ్రాన్తి హేతవః |
ఆపత్యం చ కలత్రం చ సతాం సంగతి రేవ || 10
అర్థము :- సంసారతాప దగ్ధానాం = ప్రపంచములోని ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆది దైవికములను మూడు తాపములతో తపించువారికి, త్రయః = మూడు, విశ్రాంతి హేతవః = శాంతి సాధనములు, ఆపత్యం = విద్వాంసుడు, ధార్మికుడునైన పుత్రుడు, కలత్రం = సాధ్వియు, పతివ్రతయునగు భార్యయు, చ = మఱియు, సతాం = సత్పురుషుల యొక్క సంగతిః = సాంగత్యము అనునవి.
తాత్పర్యము :- ప్రపంచములో ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆదిదైవికములను త్రివిధభావములతో తపింపబడువారికి మూడు శాంతిసాధనములు గలవు. విద్వాంసుడు, ధార్మికుడునైన పుత్రుడు, సాధ్వియు, పతివ్రతయునగు భార్యయు, శ్రేష్ఠపురుషుల సహవాసమునను మూడును శాంతిసాధనములు.
వివరణము :- వస్తుతః ఈ మూడే గృహస్థునకు శాంతిదాయకములు - పుత్రుని వచనము లెంత శాంతిప్రదములో చూడుడు-
కిం మిష్టం సుతవచనం మిష్టతరం కిం త దేవ సుతవచనమ్ |
మిష్టాన్మిష్టతమం కిం శ్రుతి పరిపక్వం తదేవ సుతవచనమ్ ||
తియ్యనిదేది? పుత్రవచనము. దానికంటె తియ్యనిదేది? అదియు పుత్రుని ప్రియవచనమే. తీపికంటె తీపికలదేది? చెవులు వినుటకలవాటుపడిన పుత్రుని వచనములే తియ్యనివి.
స్త్రీ సంబంధములో వేదవాక్యము-
జాయేదస్తం మఘవన్త్సేదు యోనిః || (ఋ. 3-53-4)
ఓ ఐశ్వర్యశాలీ! స్త్రీయే గృహము. ఆమెయే విశ్రామస్థలము-మఱియు చూడుడు-
న గృహం గృహమిత్యాహూర్ గృహిణీ గృహనుచ్యతే |
గృహం తు గృహిణీం హీనం కాన్తారావత్ రిచ్యతే ||
(పంచతంత్రము 3-152)
గృహమనగా నాలుగు గోడలతో నిర్మింపబడినదికాదు. గృహిణి (స్తీ) యే గృహము. గృహిణిలేని యిల్లు అరణ్యముకంటె భయంకరమైనది.
పతివ్రతా పతిప్రాణా పత్యుః ప్రియహితే రతా |
యన్య స్యా దీదృశీ భార్యా ధన్యః న పురుషో భువి ||
(పంచతంత్రము 3-151)
భర్తను తన ప్రాణముకంటె మిన్నగా భావించుచు నాతని ప్రియమైన దానినే కోరుచు దానియందే యాసక్తికలదియైయుండునో య్టి పతివ్రత భార్యగాగల పురుషుడు పృథ్విలో ధన్యుడు.
సాధు సంగతి:- సత్సంగము కూడ శాంతిదాయకమే-
చందనం శీతలం లోకే చందనాదపి చన్ద్రమాః |
చంద్ర చందనయోర్మధ్యే శీతలా సాధు సంగతిః ||
ప్రపంచములో మంచిగంధము చల్లనైనది. చందనముకంటె చంద్రుడు మిక్కిలి చల్లగానుండును. చందనము చంద్రులకంటె గూడ సాధుసంగమము మిక్కిలి చల్లనైనది.
శ్లో || సకృజ్జల్పన్తి రాజానః సకృజ్జల్పన్తి పండితాః |
సకృత్కన్యాః ప్రదీయన్తే త్రీణ్యేతాని సకృత్సకృత్ || 11
అర్థము:- రాజానః = రాజులు, సకృత్ = ఒక్కసారే, జల్పన్తి = ఆజ్ఞయిత్తురు, పండితాః = విద్వాంసులు, సకృత్ = ఒక్కసారే, జల్పన్తి = బోధింతురు, కన్యాః = కన్యలు, సకృత్ = ఒక్కసారే, ప్రదీయన్తే = ఈ బడుదురు, అనగా కన్యాదానము ఒక్కసారే యగును, ఏతాని త్రీణి = ఈ మూడును సకృత్ సకృత్ = ఒక్కొక్కసారే.
తాత్పర్యము :- రాజు లొక్కసారే ఆజ్ఞాపింతురు. పండితు లొక్కసారే చెప్పుదురు. కన్యాదాన మొక్కసారే చేయబడును. ఈ మూడు నొక్కక్కసారే చేయబడును. పలుసార్లు కాదు.
శ్లో || ఏకాకినా తపో ద్వాభ్యాం పఠనం గాయనం త్రిభిః |
చతుర్భి ర్గమనం క్షేత్రం పంచభిర్బహుభీ రణః || 12
అర్థము :- తపః = తపస్సు, ఏకాకినా = ఒంటరితనము, పఠనం = చదువుట, ద్వాభ్యాం = ఇద్దఱితోను, గాయనం = పాడుట, త్రిభిః = ముగ్గురితోను, గమనం = యాత్ర, చతుర్భిః = నలుగురితోను, క్షేత్రం = వ్యవసాయము (పొలము పని), పంచభిః = అయిదుగురితోను, రణః = యుద్ధము, బహుభిః = చాలమందితోను చేసినచో బాగుగానుండును.
తాత్పర్యము:- తపస్సు ఒంటరిగా చేయవలెను. పాఠమిద్దఱు కలిసి చదువవలెను. గానము ముగ్గురు చేయవలెను. యాత్ర నల్వురు చేయవలెను. కృషి (వ్యవసాయము) అయిదుగురు చేయవలెను. చాలమంది కలిసి యుద్ధము చేయవలెను.
శ్లో || సా బార్యా యా శుచిర్దక్షా సా భార్యాయా పతివ్రతా |
సాభార్య యా పతిప్రీతా సా భార్యాసత్యవాదినీ || 13
అర్థము :- యా = ఎవతె (ఎవరు), శుచిః = అంతశ్శుద్ధి బాహిశ్శుద్ధి కలిగి పవిత్రముగా నుండునో, దక్షా = పని నిర్వహించుటలో నేర్పుశక్తికలదై యుండునో యామె, భార్యా = భార్య, మఱియు, యా = ఎవతె, పతివ్రతా = పవిత్రయైయుండునో, సా = అమెయే, భార్య, యా = ఎవతె, పతిప్రీతా = పతియందు ప్రీతికలదై యుండునో, సా = ఆమె, భార్యా = భార్య మఱియు, సత్యవాదినీ = సత్యము పలుకున్టి, సా = ఆమె, భార్యా = భార్య.
వివరణము :- స్త్రీ గుణములతోనే గౌరవము పొందుచున్నది. సరియైన భార్యయే పోషింపదగినది-
పుత్రసూః పాకకుశలా పవిత్రా చ పతివ్రతా |
పద్మాక్షీ పంచపైర్నారీ భువి సంయాతి గౌరవమ్ ||
వీరపుత్రుల కను న్టిదియు, వంటచేయుటలో నేర్పుకలదియు, పవిత్రయు, పతివ్రతయు, పద్మాక్షియునను అయిదుకారములతో స్త్రీ ప్రపంచములో గౌరవము పొందును (పుత్రపతి, పాకకుశల, పవిత్ర, పతివ్రత, పద్మాక్షి అను నైదు పదములలో ముందుపకారమున్నది)
శ్లో || అపుత్రస్య గృహం శూన్యం దిశఃశూన్యాస్త్వ బాంధవాః |
మూర్ఖస్యహృదయం శూన్యం సర్వశూన్యా దరిద్రతా || 14
అర్థము :- అపుత్రస్య = బిడ్డలులేనివానియొక్క, గృహం = గృహము, శూన్యమ్ = సున్న, అబాంధవాః = బంధువులులేని, దిశః = దిక్కులు చోట్లు, శూన్యాః = సున్నాలే, మూర్ఖస్య = మూర్ఖునియొక్క, హృదయం = హృదయము, శూన్యం = శూన్యము, దరిద్రతా = దారిద్య్రము, సర్వశూన్యా = సర్వము శూన్యముగా నుండును.
తాత్పర్యము :- పుత్రులు లేని యిల్లు శూన్యము. బంధువులులేని మనుష్యునకు దిక్కులు శూన్యము. మూర్ఖునియొక్క హృదయము శూన్యము. దరిద్రునకు సర్వము శూన్యమే.
వివరణము :- దారిద్య్రము విషయములో నందఱు వినదగినది-
'సర్వకష్టా దరిద్రతా' - (చాణక్య శతకము)
దారిద్య్రము అన్నివిధముల కష్టముల నిచ్చునదే.
'దారిద్య్రా స్మరణం వరమ్' - (వైరాగ్య శతకమ్)
దరిద్రుడుగా బ్రతుకుట కంటె చచ్చుట మేలు.
'దారిద్య్ర మేకం గుణకోి నాశీ'
దారిద్య్ర మొక్కటే సర్వగుణముల నశింపజేయును.
అయినను దారిద్య్రము వలన లాభమున్నది-
హే దారిద్య్ర! నమస్తుభ్యం సిద్ధో-హం త్వత్ప్రసాదతః |
పశ్యాన్యుహం జగత్పర్వం న మాం పశ్యతి కశ్చన ||
ఓ దారిద్య్రమా! నీకు నమస్కారము. నీ దయవలన నేను సిద్ధుడనైతిని. ఈ జగత్తునంతను నేను చూచుచున్నాను. నేను దరిద్రుడనగుటచే నన్నెవరు చూడటం లేదు.
శ్లో || అనభ్యాసే విషం శాస్త్రమజీర్ణే భోజనం విషమ్ |
దరిద్రస్యం విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషమ్ || 15
అర్థము :- అనభ్యాసే = అభ్యసించనివానికి, శాస్త్రం = శాస్త్రము, విషం = విషము, అజీర్ణే = జీర్ణము కాని వానికి, భోజనం = భోజనము, విషయం = విషము, దరిద్రస్య = దరిద్రునకు, గోష్ఠి = సభ, విషం = విషము, వృద్ధస్య = ముసలివానికి, తరుణీ = యువతి, విషం = విషము.
తాత్పర్యము :- అభ్యసింపనివానికి శాస్త్రము విషతుల్యము. జీర్ణించుకోలేని అజీర్ణరోగికి భోజనము విషతుల్యము. పలు విషయములు చర్చించు సభ దరిద్రునకు విషతుల్యము. ముసలివానికి పడుచు స్త్రీ విషతుల్యము.
శ్లో || త్యజేద్ధర్మం దయాహీనం విద్యాహీనం గురుం త్యజేత్ |
త్యజే త్క్రోధముఖీం భార్యాం నిః స్నేహాన్ బాంధవాసీ త్యజేత్ || 16
అర్థము :- దయాహీనం = దయలేన్టి, ధర్మం = ధర్మమును, త్యజేత్ = విడువవలెను, విద్యాహీనం = విద్యలేని, గురుం = గురువును, త్యజేత్ = విడువలెను, క్రోధముఖీం = క్రోధముతో కూడిన ముఖముగల, భార్యాం = భార్యను, త్యజేత్ = విడువవలెను, నిః స్నేహాన్ = స్నేహరహితులగు, బాంధవాన్ = బంధువులను, త్యజేత్ = విడువవలెను.
తాత్పర్యము :- మనుష్యుడు దయాహీనమైన ధర్మమును విడువలెను. విద్యలేని గురువును, క్రోధముతో గూడిన ముఖముగల భార్యను, స్నేహరహితులైన బంధుభాందవులను విడిచిపెట్టవలెను.
శ్లో || అధ్వాజరా మనుష్యాణాం వాజినాం బంధనం జరా |
అమైథుననం జరా స్త్రీణాం వస్త్రాణా మాతపో జరా || 17
అర్థము :- మనుష్యాణాం = మనుష్యులకు, అధ్వా = ఎక్కువ దూరము నడచుట, జరా = ముసలితనము, వాజినాం = గుఱ్ఱములకు, బంధనం = క్టివేయుట, జరా = ముసలితనము, స్త్రీణాం = స్త్రీలకు, అమైథునం = సంభోగము చేయకుండుట, జరా = ముసలితనము, స్త్రాణాం = గుడ్డలకు, ఆతపః = ఎండ, జరా = ముసలితనమగును.
తాత్పర్యము :- మనుష్యులు అత్యధికముగా నడచినచో ముసలితనము వచ్చును. గుఱ్ఱములను క్టివేసి యుంచినచో వానికి ముసలితనము వచ్చును. స్త్రీలకు సంభోగము లేకున్నచో త్వరగా ములితనము వచ్చును. గుడ్డలు ఎక్కువగా ఎండలో నున్నచో త్వరగా చిరిగిపోవును.
వివరణము :- ఆరోగ్యము కొఱకు నడక మంచిదేకాని అధికముగా నెక్కువకాలము నడచిన అలసిపోయి ముసలితనము చిహ్నములు కనబడును. గుఱ్ఱమును క్టివేసినచో ముసలితనము వచ్చును. మఱియు హఠము చేయును. త్రిప్పకున్నచో గుఱ్ఱము హఠము చేయును. తమలపాకు క్రుళ్లిపోవును. రొట్టెమాడిపోవును. అందుచే వానిని త్రిప్పుచుండవలెను.
వస్త్రములు ఎల్లపుడు నెండలో నెండినచో రంగుపోవును. త్వరగా చిరిగిపోవును.
ఒక గ్రంథకర్త వృద్ధావస్థకు అయిదు కారణములు చెప్పెను. అందులో నధికముగా మార్గమున నడచుట యొకి-
శీత మధ్వా కదన్నం చ పయో-తీతాశ్చ యోషితః |
మననః ప్రాతికూల్యం చ జరాయాః పంచహేతవః ||
1. మిక్కిలి చల్లదనము, 2. మార్గమున నధికముగా నడచుట, 3. చెడ్డయన్నమును దినుట, 4. వృద్ధస్త్రీతో సహవాసము, 5. మనస్సునకు వ్యతిరేకత.
మనస్సున కనుకూలమైనచో మనస్సున కుత్సాహము కలిగి ఆయుస్సు వృద్ధియగును. మనస్సునకు ప్రతికూలమైనచో నలసిపోయి ఆయుస్సు తగ్గుచు ముసలితన మావరించును.
శ్లో || కః కాలః కాని మిత్రాణి కోదేశః కౌ వ్యయాగమౌః
కశ్చా-హం కాచమేశక్తిరితిచిన్త్యం ముహూర్ముహుః 18
అర్థము :- కః = ఏది, కాలః = కాలము? మిత్రాణి = మిత్రులు, కాని = ఎవరు?, దేవః = దేశము, కః = ఏది? వ్యయాగమౌ = ఆదాయ వ్యయములు, కౌ = ఏవి? అహంచ = నేను గూడ, కః = ఎవ్వడను? మే = నా యొక్క, శక్తిః = శక్తి, కా = ఏది? ఇతి = అని, ముహుర్ముహుః = మాిమాికి, చిన్త్యం = చింతింపదగియున్నది.
తాత్పర్యము :- ఏది కాలము? ఎవరు మిత్రులు? ఏది స్థానము? ఆదాయ వ్యయములేవి? నేనెవడను? నా శక్తి యేమి? అని మాిమాికి ఆలోచించుచుండవలెను.
వివరణము :- ఈ శ్లోకములో ఆత్మచింతన విషయము చెప్పబడినది. ఆత్మచింతనవలన మనుష్యుడు ఉన్నతిని పొందును. జీవితములో ముందుకు సాగగలడు.
నా ఆదాయ వ్యయములేవి? వ్యయమెప్పుడను ఆదాయముకంటె తక్కువగా నుండవలెను. నే నెవడను? నేనెక్కడినుండి వచ్చితిని? వెళ్లునపుడు నా వెంట నేమి వచ్చును? అనునిత్యము వీనిని గూర్చి ఆలోచింపవలెను. నా శక్తియేమి? - 'అహమిన్ద్రో న పరాజిగ్య ఇద్ధనమ్' (ఋ. 10-48-5) నే నింద్రుడను. ఇన్ద్రియముల శక్తికలవాడను - నేను ధన్యుడనగుటకు నెన్నడు నోడిపోను.
శ్లో || జనితా చోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్ఛతి |
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః || 19
అర్థము :- జనితా = జన్మనిచ్చువాడును, ఉపనేతా = యజ్ఞోపవీతధారణ చేయించువాడును, చ = మఱియు, యస్తు = ఎవడైతే, విద్యాం = విద్యను, ప్రదుచ్ఛతి = ఇచ్చుచున్నాడో (బోధించుచున్నాడో), అన్నదాతా = అన్నము పెట్టువాడు, భయత్రాతా = భయము నుండి రక్షించువాడును, ఏతే = ఈ, పంచ = అయిదుగురు, పితరః = పితరులుగ, స్మృతాః = తలంపబడుచున్నారు.
తాత్పర్యము :- జన్మనిచ్చువాడును, యజ్ఞోపవీత ధారణచేయించువాడును, విద్యనేర్పువాడును, అన్నదాతయు, భయమునుండి రక్షించువాడు - ఈ అయిదుగురును పితరులని చెప్పబడుదురు.
వివరణము :- ఈ శ్లోకము వలన పితరులు జీవించిన వారే యని తెలియుచున్నది. మరణించినవారు పితరులు కారు. పారక్షణే అను ధాతువుతో పితర శబ్దము తయారగును. కాని యర్థము రక్షించువాడు. జీవించియున్నవాడు రక్షింపగలడు. కాని మరణించినవాడు కాడు గదా! మరణించినవాడు తన్ను రక్షించుకొనలేడు. ఇతరుల రక్షింపలేడు. పాండవ కౌరవులకు యుద్ధము జరుగునపుడు సేన లెదురెదురుగా నున్నపుడు శ్రీకృష్ణుడర్జునుని ప్రార్థన వలన నాతని రథమును రెండు సేనల మధ్యనిలిపి-
'తత్రాపశ్య త్థ్పితాన్ పార్థః పిత్రూనథ పితామహాన్' | (గీత. 1-22)
అర్జును డక్కడ నిలబడి తండ్రులను తాతలను మొదలైన వారిని చూచెను. ఇచ్చట పితర అను దానికి చనిపోయిన తాత ముత్తాతలైనచో అర్జునుడు చనిపోయిన వారి నెట్లు చూచును? ఏల భయపడును? ఆ శస్త్రధారులందఱు చనిపోయినట్లేనా? తేలిన సారాంశము పితరులనగా బ్రతికినవారే.
శ్లో || రాజపత్నీ గురోః పత్నీ మిత్రపత్నీ త థైైవ చ |
పత్నీ మాతా స్వమాతా చ పంచైతా మాతరః స్మృతాః || 20
అర్థము : - రాజపత్నీ = రాజుగారి భార్య, గురోః = గురువుయొక్క, పత్నీ = భార్యయు, తదైవచ = అట్లే మఱియు, మిత్రపత్నీ = స్నేహితుని భార్యయు, పత్నీమాతా = అత్తగారును, స్వమాతా చ = తన తల్లియు, ఏతాః పంచ = ఈ యైదుగురు, మాతరః = తల్లులుగా, స్పృతాః = తలంపబడుదురు?
తాత్పర్యము :- రాజు భార్యయు, గురువు భార్యయు, మిత్రుని భార్యయు, భార్య తల్లియు, తన తల్లియు - ఈ అయిదుగురు తల్లులుగా తలంపబడుదురు.
శ్లో || అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృదిదైవతమ్ |
ప్రతిమా స్వల్పబుద్ధ్దీనాం సర్వత్ర సమదర్శినః || 21
అర్థము :- ద్విజాతీనాం = బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను, ద్విజులకు, దేవః = దేవుడు, అగ్నిః = అగ్నిహోత్రము, యజ్ఞమే, మునీనాం = మునులకు, హృది = హృదయమందు, దైవతమ్ = దేవత నివసించును, స్వల్పబుద్ధీనాం = అల్పబుద్ధులకు, మూర్ఖులకు, ప్రతిమా = మూర్తియందును, సమదర్శినః = సమదృష్టిగలవారికి, సర్వత్ర = అంతటను, దేవతా = పరమేశ్వరుడుండును.
తాత్పర్యము :- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజాతులవారికి అగ్ని హోత్రమే (యజ్ఞము) దేవుడు, మునులకు దైవము హృదయమందుండును. స్వల్పబుద్ధులుగలవారికి విగ్రహమునందును, అంతిని సమానముగా జూచు సమదర్శులకు దైవమంతటనుండును.
వివరణము :- మూర్తిపూజ అధమము-
ఉత్తమా సహజావస్థా మధ్యమా ధ్యాన ధారణా |
అధమా మూర్తిపూజా చ తీర్థయాత్రా-ధమా-ధమా ||
సహజావస్థ ఉత్తమము, ధ్యానధారణము మధ్యమము, మూర్తిపూజ అధమము, తీర్థయాత్రలు చేయుట అధమాధమము.
మఱియు నింకొకి చూడుడు-
యస్యాత్మబుద్ధిః కుణపే త్రిధాతుకే
స్వధీః కలత్రాదిషు భౌమ ఇజ్యధీ ||
యత్తీర్థబుద్ధిః సలిలేన కర్హి చిత్
జనేష్వభితిజ్ఞేషు న ఏవ గోఖరః || (భాగ. పురా. 10-84-13)
ఎవడు వాత, పిత్త, కఫములను త్రిధాతువుతో గూడిన శరీరము ఆత్మయనుకొనునో, మఱియు స్త్రీ పుత్రాదులందు సమత్వబుద్ధి కలిగియుండునో, ఎవరు మూర్తియందు(విగ్రహము) పూజ్యబుద్ధిగలిగియుండునో, ఎవడు నీియందు తీర్థబుద్ధిగలిగియుండునో వాడు విద్వాంసుల దృష్టిలో ఆవుల కొఱకు మేత మోయు ఎద్దో, గాడదయో యగును.
చతుర్థాధ్యాయము సమాప్తము
No comments:
Post a Comment