శ్రీవిష్వక్సేనపూజ
ఆదౌ నిర్విఘ్నేన పరిసమావ్యాప్త్యర్థం విష్వక్సేన ఆరాధనం కరిష్యే
సర్వ విఘ్నాలను తొలగించమనీ, శ్రీగోవింద కల్యాణాన్ని సుసంపన్నంగా, శుభప్రదంగా జరిగేలా అనుగ్రహించమనీ ప్రార్థిస్తున్నారు.
విష్వక్సేనం సకల విబుధప్రాఢ సైన్యాధినాధం
ముద్రాచక్రే కరతల యుగే శంఖ దండౌ దధానమ్ |
మేఘశ్యామం సుఫణి మకుటం పీతవస్త్రం శుభాంగం
ధ్యాయేద్దేవం విజిత దనుజం సూతవత్యా సమేతమ్ ||
విష్వక్సేనులవారు శ్రీమన్నారాయణుని సకలసైనిక దళాలకు అధిపతి. వారి నిర్వాహకంలో ఏనుగు ముఖాలు గుర్రం ముఖాలుగల (గజాశ్వదళాలు) దళాలు ఎన్నో ఉన్నాయి.
వీరు మహా వేదవేదాంగ తత్వజ్ఞులు. నిత్యయవ్వనులు. వీరి భార్యలు సూత్రవతి. జయ. స్వామీ! సమేతంగా విచ్చేయండి అని ప్రార్థిస్తున్నారు.
ఆసనం-ప్రణామం-స్నానం-ప్లోతవస్త్రం-గంధం-పుష్పం-ధూపం-దీపం-అర్ఘ్యం- ఆచమనం- ఫలం-పానీయం-తాంబూలం-ఉద్వాసనం-శోభనార్థం క్షేమాయ పునరాగమనాయచ-శుద్ధికోసం- వృద్ధికోసం-శాంతికోసం-అభ్యుదయంకోసం.
సకుటుంబ సపరివారంగా మన ఇంటపెళ్ళికి రమ్మని మనం ఆహ్వానిస్తాం.
వచ్చినవారిని సాదరంగా ఆదరిస్తాం. ఆరాధిస్తాం. ఆశీర్వదించమని అర్థిస్తాం.
వారి ఆశీర్వాదాలే నూత్న దంపతులకు శ్రీరామరక్ష.
ఇది సనాతన వైదిక సంప్రదాయం.
No comments:
Post a Comment