మనసుకు నచ్చిందే చెయ్యి
కాని....
మంచి మాత్రమె చెయ్యి !
ఎప్పుడూ ...
ఎప్పటికీ ...
ఎవరితోనూ పోట్లాటకు దిగకు !
ఏదైనా...
తెలియకపోతే అడిగి తెలుసుకో
ఎప్పుడైనా....
నాకు తెలియలేదే అని సిగ్గుపడకు !
ఎవరినైనా....
ఎవరినైనా....
ఆదరించే సమయాన
అందరిని ఒకే గాటిన పెట్టు !
అన్నా ....
అన్నా ....
ధన మదం ఉన్న వాడి కన్నా
ఏమి లేని దరిద్రుడే మిన్న !
నిజంగా ....
నీ కన్నా గొప్ప వాడెవడూ లేదు
ఒకవేళ ....
మంచితనమే నీ ఆయుధ మయితే !
రోజు రోజుకూ నిన్ను నీవు
మెరుగు పరచుకో
ఎదో రూపంలో .....
మరొకరికి మేలు చేస్తూ !
No comments:
Post a Comment