Thursday, 8 July 2021

మోతలన్నీ ఎక్కడి దాకా... (telugu kavitha)

లేనివాడికి ఎంతిచ్చినా తక్కువే 

దేవుడు వాడికి ఏమిచ్చాడని ?

ఉన్నవాడికి దేవుడు అన్ని ఇచ్చాడు

ఉండి లేనివాడికి ఇవ్వడం మరచాడేమో మరి ?

ఇక నా బ్రతుకు ఇంతేలే అనుకుంటాడు 

ఇంకేమి కోరడు ఏమి లేనివాడు ! 

మరి ఉన్నవాడు?

అన్నీ ఉన్నా ఇంకా ఇంకా కావాలంటాడు 

అమ్మో హించడమే ?

హించడమే పెద్ద పని !

అన్నీ భరించాలంటే 

ఎంత ఓపిక కావాలి ?

మనసు భారం కాదా ?

మోతలన్నీ ఎక్కడి దాకా

మూత పెట్టి కప్పే వరకేగా !!  


January Calendar | Telugu Almanac | Telugu Calendar Festivals | Panchang...

Monday, 5 July 2021

8th class hindi text home work hand written script notes presentation

తొమ్మిది సంఖ్య ప్రత్యేకతలు

మనకున్న సంఖ్యల్లో చివరిదైన తొమ్మిది సంఖ్యకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. 

తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు.

తొమ్మిది సంఖ్యకు అధిపతి కుజుడుగా చెబుతారు .

తొమ్మిదవ అంకెకు 'బ్రహ్మసంఖ్య' , దైవసంఖ్య, వృద్ధిసంఖ్య, పురాణ సంఖ్య అనే పేర్లున్నాయి 


నవరసాలు

నవనాడులు

నవనిధులు

నవరత్నాలు

నవధాన్యాలు

నవమాసాలు

నవరంధ్రాలు

నవధాన్యాలు

నవచక్రాలు

నవజాతులు

నవరాత్రులు

నవారాధనలు  (శ్రవణం, కీర్తనం, మననం, పదసేవ, అర్చన, మంత్రం, సేవ, మైత్రి, శరణం)


జ్ఞాపకాల తెరలు


జీవితంలో ఒక తోడు

నీ పరిచయం .....

నాకొక నీడ

మరువలేని తీపి జ్ఞాపకం

నువ్వు అందని 

ఆకాశానివని అయినా 

అలుపెరగని అలను

నేనవుతున్నా!

వలచి గెలిచి మనసు నిండి 

కలలు పండిన జంట 

ఉంటుందా యిలలో

కులము మతము 

ధనము బలము 

అదుమునా తుదిలో

మనసుల సయ్యాట 

నిను చేరనీయక 

విధి అడ్డగిస్తే 

నీ జ్ఞాపకాలను

కదిలిస్తున్నా !

నీ ఊహల చంద్రోదయంతో

విరిసే తలపుల కలువలను

ఎంత సేపని  చూడను ?

ఇలలో పరిచయాలు మాని 

కలలో నీతో కలియబడుతున్నా  !

నువ్వే కొలువు దీరిన మనోగుడిలో

పరవశించి పాడుతున్నా

నువ్వు తలపుకొచ్చిన ప్రతిసారీ 

మళ్ళీ మళ్ళీ తలచుకుంటున్నా 

విరహాన్ని భరించే ఏది ?

నీ పేరే పలవరిస్తూ 

నా ఆణువణువూ పొదిగిస్తూ .. 

10th biology model paper II | X class exam papers | Biology test papers ...

Sunday, 4 July 2021

చేదు అనుభవం

జ్ఞాపకాలు ఎన్నున్నా 

అనుభూతులు రాసులుగా మిగులుతాయి...

అచ్చం నీ పరిచయం మాదిరి 

ప్రీతి నన్ను వదలక 

నా మనసు చెదిరి 

ఏమని తెలిపెద 

నా మనసున వ్యధ?

నా చెంత నీవుంటే 

ఈ కన్నీళ్లు కొబ్బరి నీళ్ళే 

ఆనంద భాష్పాలు

ఆవిరి పట్టేవి 

ప్రపంచానికి ఒక మనిషివి 

ఒకరికి మాత్రం నువ్వే ప్రపంచం...

కనుమరుగైనావని  అంటున్నారు 

కలవై నావని నా కన్నీరు అంది 

నాలో శ్వాస వున్నంత వరకు 

నీ ఆలాపనే నాలో నడయాడు ....

నీ జ్ఞాపకాలే నా ప్రాణం...

వాటితోనే నా జీవనం 

చేజారి పోయిన కలల జ్ణాపకం 

ఏమని చెప్పను?

ఎన్నని చెప్పను ?

యదలోని తీపి అలల గురించా..

మల్లీ ఎగసిపడే రోజు రాకుందా !

ఆ తీపి  జ్ఞాపకం 

ఓ చేదు అనుభవం 

ఎక్కడున్నాం మనం ?

ప్రజాస్వామ్యంలోనే  ఉన్నామా !

ప్రతిసారీ ఓట్లేస్తున్నాం

మనం ఓడి ఎవరినో గెలిపిస్తున్నాం 

మరి ఎక్కడైనా చోటున్నదా ?

రాజ్యంలో స్థానమున్నదా?

ఎన్నాళ్ళీ నిర్లిప్తత? 

ఎన్నాళ్ళీ అనైక్యత? 

ఎన్నాళ్ళీ ఆకలి మంటలు !

ఎన్నాళ్ళు అప్పుల బతుకులు ?

ఉన్నోడికేనా అన్నీను !

లేనోడికెక్కడ 

చోటు మిగిలేను ?

శ్రమజీవులారా! 

పనిమంతులారా !

శిల్పులారా! 

వాస్తు శిల్పులారా!

కార్మికులారా !

కర్షకులారా !

గుడిసె వాసులారా !

గుడి బిక్షకుల్లారా 

కళ్ళు తెరవండి 

ప్రపంచం రంగస్థలం అందరిదీ 

ప్రతివాడికీ ఒక పాత్ర ఉంటుంది 

నవ సమాజ నిర్మాణంలో మనం 

నడుము బిగించి నడవాలి

సంకుచిత భావాలను దునుమాడ  

మనం సమర్మోనుఖులం కావాలి


-------------------------------------------------------

Hindi Model Papers | 9th class question papers | 80 Marks hindi exam pap...