లేనివాడికి ఎంతిచ్చినా తక్కువే
దేవుడు వాడికి ఏమిచ్చాడని ?ఉన్నవాడికి దేవుడు అన్ని ఇచ్చాడు
ఉండి లేనివాడికి ఇవ్వడం మరచాడేమో మరి ?
ఇక నా బ్రతుకు ఇంతేలే అనుకుంటాడు
ఇంకేమి కోరడు ఏమి లేనివాడు !
మరి ఉన్నవాడు?
అన్నీ ఉన్నా ఇంకా ఇంకా కావాలంటాడు
అమ్మో ఊహించడమే ?
ఊహించడమే పెద్ద పని !
అన్నీ భరించాలంటే
అన్నీ భరించాలంటే
ఎంత ఓపిక కావాలి ?
మనసు భారం కాదా ?
మోతలన్నీ ఎక్కడి దాకా
మూత పెట్టి కప్పే వరకేగా !!
No comments:
Post a Comment