Tuesday, 11 May 2021

కఠోపనిషత్తు - ప్రథమవల్లి

ప్రథమాధ్యాయం ` ప్రథమవల్లి

1. శ్లో:` ‘ఓం ఉశన్‌ హవై వాజస్రవస: సర్వవేదసం దదౌ

తస్యహ నచికేతా నామపుత్ర: అస’

తా:` స్వర్గ ఫలాను కోరిన వాజస్రవసుడు విశ్వజిత్‌యాగంలో తన ఆస్తినంతటినీ దానం చేశాడు. అతనికి నచికేతుడను పేరుగ ఒక పుత్రుడు గడు!

వాజస్రవుని పుత్రుడైన ‘వాజస్రవసుడు’ అనగా...ఆహారం దానం చేయటం ద్వారా కీర్తిని పొందినవాడని అర్థం! ‘విశ్వజిత్‌ యాగం’ అనగా... ఒక్క రోజులో పూర్తి చేయాల్సివున్న ఈ యాగంలో యజమాని తన యావదాస్తినీ దానం చేయవసియుండును. అట్టి యాగం సంపూర్ణం చేసే ప్రయత్నంలో నున్నాడు వాజస్రవసుడు.

2. శ్లో:` ‘తం హ కుమారం సంతం దక్షిణాసు

నీయ మానాసు శ్రద్ధా2వివేశ: సో2మన్యత’

తా:` ఋత్విజుకు దక్షిణగా (ఆవు మొదలైనవి) ఇవ్వడానికి కానుకు తీసుకురాబడుతుండగా వాజస్రవసుని పుత్రుడైన (పసివాడైన) నచికేతుడిలో శ్రద్ధ ఆవహించింది!

శ్రద్ధ అనగా ఏ సంశయాూ లేని కార్యదీక్ష, శాస్త్రాదు పట్ల దృఢ విశ్వాసము, వినయగౌరవాదు ఆస్తికబుద్ధి కల్గి, ఆధ్యాత్మిక విద్యను సాధించగల్గే ముఖ్యసాధనం అని! అట్టి శ్రద్ధయే అంత చిన్న వయసులో నచికేతునిలో కూడా కల్గినదని అర్థం!

3. శ్లో:` పీతోదకా జగతృణా దుగ్ధదోహా నిరింద్రియా:

అనందా నమతే లోకాస్తాన్‌ స గచ్ఛతి తాదదత్‌’

తా:` గడ్డి తినటానికీ నీళ్లు త్రాగటానికి కూడా శక్తిలేనివి ఈనే వయసుదాటి పోయి వట్టి పోయినవి, ఎందుకూ పనికిరాని గోవును దానం చేసేవాడు చేరుకునే లోకాు బొత్తిగా నిస్సారమైనవి! ఆనంద రహితమైనవి! తండ్రి అలాంటి పనికిమాలిన ఆవును దానం చేస్తుండటం చూసిన నచికేతుడు, తండ్రి యజ్ఞవిధును నిష్ఠతో పాటించి నిష్కళ్మషంగా తన సర్వస్వాన్ని దానం చేసే వుద్దేశం లేదని గ్రహించి...తండ్రినీ దోషాన్నుండి తప్పించటం తనయుడిగా తన బాధ్యత అని భావిస్తాడు. పుత్రుడు కూడా తండ్రి ఆస్తిలో భాగమే కనుక తనను కూడా ఎవ్వరికో ఒకరికి దానం చేయవసియేయుండును. అది తన తండ్రి యజ్ఞవిధి! అని సత్యసంధతో యోచించెను.

4. శ్లో:` ‘సహోవాచపితరం తతకస్మైమం దాన్యసీతి

ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యువేత్వాదదామీతి’

తా:` ‘తండ్రీ...మరి నన్నెవ్వరికివ్వ బోతున్నావు?’ అని నచికేతు ప్రశ్నించగా... ఆ మాట నచ్చని తండ్రి బదులివ్వక పోవడంతో...రెండోసారి కూడా అదే ప్రశ్న అడగ్గా....అందుకూ సమాధానం చెప్పని తండ్రిని..., మూడోసారి కూడా అలాగే నచికేతుడు ప్రశ్నించడంతో..., ‘నిన్ను మృత్యువుకిస్తాను’ అని ఆవేశంతో, అనాలోచితంగా తండ్రి బదులివ్వడం జరిగింది.

సర్వసాధారణంగా ప్లి పొరపాట్లను సరిదిద్దడానికి తల్లిదండ్రు సర్వవిధా ప్రయత్నిస్తారు. అందులోని కష్టనిష్ఠురాన్నీ బాధ్యతగా భరిస్తారు....కానీ....ఇక్కడ మాత్రం ఒక పుత్రుడే ఆ విధంగా దోషనివారణగావించి తండ్రినుద్ధరించటానికి ఉద్యమించటం అనేది ....అందునా బ్యాదశలోనే అన్నది అద్భుతమైన అంశం! అదే ఆదర్శప్రాయమైన పుత్రధర్మ సారాంశం!

5 శ్లో:` ‘బహూనామేమి ప్రథమో బహూనామేమి ప్రథమో బహూనామేని మధ్యమ:

కిం స్విత్‌ యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి’

తా:` తండ్రి అలా అనటంతో నచికేతుడు తనలో తానిలా తపోశాడు. ‘జననీ జనకు పట్ల విధును నెరవేర్చేవారిలో చాలామంది శిష్యులో నేను ప్రథముడిగా నున్నాను! బుద్ధి సూక్ష్మతలో సుగుణాలో ఇంకొందరిలో నేను మధ్యముడిగా వున్నానుగానీ చివరివాడిగా ఎన్నడూ లేదు! అటువంటపుడు మాతండ్రి నన్నెందుకు మృత్యువు కిస్తానన్నాడు? అలా చేయటం వ్ల ఆయన కార్యమేది సిద్ధించగదు?

అన్ని విధా అనుకూుడైన కొడుకును వదుకోవటం  ఏ తండ్రికీ ఇష్టం వుండదు! కానీ తన పనిలోని లోపాన్ని కొడుకు సరిచేయబూనటం అనేది భరించలేని ఆయనలోని అహం అనేది ఆవేశంగా... ఆ ఆవేశం అనేది అనాలోచితంగా అలా అనేలా చేసింది!

6శ్లో:` ‘అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తథాపరే

సస్యవివ మర్త్య: పశ్యతే సస్యమివా2జాయతేపున:’

తా:` (తండ్రి తనను మృత్యువు కివ్వాని అనుకోవడంలో అర్థమే లేదని... కేవం కోపంలోనే అలా అని వుంటాడని ....అయినా తండ్రిమాట మీర కూడదనే నిర్ణయించుకున్నాడు.) ప్రాచీను ఎలా ప్రవర్తించారో ....ఎన్ని కష్టాు వచ్చినాసరే పితృ పితామహు పితృవాక్యపానతో సత్యవ్రతాన్నెలా కాపాడుకున్నారో జ్ఞాపకం తెచ్చుకొనుడు!

ధాన్యం ఎలా మొలిచి పెరిగి పండి రాలిపోతుందో అలాగే మానవుడు కూడా జననమరణ చక్రాన్ని అనుసరిస్తాడు.

మానవుడి జన్మయే మృత్యువును సూచిస్తుంది. ఆ మృత్యువే అతడి పునర్జన్మను సూచిస్తుంది. అందుచేత చావును గూర్చి శోకించతగదు. జన్మను గురించి ఆనందించాల్సిన అవసరమే లేదు. కాగతిలో ఎలాగూ నశించిపోయే ఈ క్షణిక జీవితం గురించి సత్యపాననుండి తొగరాదని, అన్నమాట ప్రకారం తనను మృత్యువు వద్దకు నిజంగానే పంపవసిందనీ... తండ్రికి కర్మసిద్ధాంతాన్ని, పునర్జన్మ ఆద్యంతాన్నీ బోధించి మరీ పదేపదే తండ్రిని ప్రార్థించాడు.

సత్యమహిమ నెరిగిన వాడైన వాజస్రవసుడు చివరకు మనసు చిక్కబట్టుకుని పుత్రుడైన నచికేతుని యముని దగ్గరకు పంపించడానికి అనుమతించాడు.

7శ్లో:` ‘వైశ్వానర: ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్‌

తస్వైతాం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకమ్‌’

తా:` ‘అగ్ని దేవుడిలాగ బ్రాహ్మణ అతిథి ప్రవేశించాడు. మూడు రోజ్నుండీ మంచి నీళ్లు కూడా తాగలేదు. ఈ అతిధిని సత్కరించు! ఓ యమదేవా...నువ్వే స్వయంగా నీళ్లు తీసుకురా’

(నచికేతుడు తన సంక్పబంచేత, పితృవాక్యపరిపానా మహిమచేత, దైవానుగ్రహకారణంగా భేచరీ గమనం ద్వారా యమపురికి చేరుకుంటాడు. కానీ అక్కడ యమ ధర్మరాజు లేని కారణంగా ద్వారం దగ్గరే మూడునాళ్లు నిరాహారిjైు యముని కొరకు వేచి వుండవసి వచ్చింది. యముడు తిరిగి వచ్చింతర్వాత....అతనితో అతని అనుచరున్న అమ్యూ సహా వాక్కువి...)

బ్రాహ్మణుడైన అతిధి అగ్నిలాగా ఇంట్లో ప్రవేశిస్తాడు. అతనిని  సద్‌గృహస్తు సంప్రీతి నొందించి శాంతింపజేస్తారు. అనాదికాం నుండీ ‘అతిధి దేవోభవ’ అనుకుంటూ...అతిధిని భగవత్‌ స్వరూపుడిగా పూజించి ఆదరించటం గృహస్థుధర్మం. అతిధికి మొదట కాళ్లకు నీళ్లిచ్చి, ఆపై ఆసనాన్నిచ్చి, ఆర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత అన్నపానాదుతో ఆనందపర్చాలి! అలా జరగని పక్షంలో....క్ష్యపెట్టక నిర్లక్ష్యపర్చిన అగ్ని ఎలా ఇంటినంతా కాల్చివేస్తుందో...అలాగే సత్కరింపబడని బ్రాహ్మణఅతిధికోపం గృహస్థుని శాంతినీ ఆనందాన్నీ పూర్తిగా అంతరింపజేస్తుంది! అతిధి బ్రాహ్మణుడు కనుక.... ఓ వైవస్వతుడా... (యముడా) అతిధి బాుడి ఆనా పానా బాధ్యతను ఆస్యం చేయక స్వయంగా నీవే స్వీకరించు’ అని

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే సేవకుగానీ అనురచుగానీ తమ యజమానికి గుడ్డిగా అడుగు మడుగులొత్తుతూ, పొగడ్తతో ముంచెత్తుతూ తీయని అబద్ధాతో స్వలాభం పొందే స్వార్థపరుల్లాగాక...యజమాని మేుగోరి చేదునిజాతోనైనా సరే హితబోద గావించి అతడి బాధను తొగించేవారైవుండాని సూచిస్తుందీ సన్నివేశం!

8శ్లో:` ‘అశాప్రతీక్షే సంగతం సూనృతాం

చేష్టాంగ పూర్తే పుత్ర పశూంశ్చ సర్వాన్‌

ఏతద్‌ వృంక్తే పురుషస్య్పా మేధసో

యస్యానశ్నన్‌ వసతి బ్రాహ్మణో గృహే’

తా:` బ్రాహ్మణుడు అతిధిగా ఏ ఇంట్లో నిరాహారుడిగా వుంటాడో, ఆ ఇంటివాడి ఆశూ, ఆకాంక్షూ, సత్యాంగత్య ఫమూ, సత్య మధుర భాషణ వాచిక తపమూ, సక పుణ్యకర్మ ఫమున్నియు నశించి శోకతప్తుడగును.’

‘బ్రాహ్మణుడు’ అనగా ..బ్రహ్మతత్త్వజ్ఞానంతో......పరబ్రహ్మ ముందు చరించే నియమనిష్టు గవాడు...అనివార్యంగా తన ధర్మంగా భగవత్‌ జ్ఞానాన్ని బోధిస్తూ...ప్రజను పరమాత్మ (మంచి) వైపునకు మరలించగ వైదిక స్వరూపుడు అని అర్థం. అట్టి బ్రాహ్మణ అతిధి నాదరించటం గృహస్థు యొక్క ధర్మమని అటు బ్రాహ్మణ ధర్మాన్నీ, ఇట గృహస్థు ధర్మాన్ని ప్రధానంగా ప్రబోధిస్తుందీ శ్లోకం!

9శ్లో:` ‘తిస్రోరాత్రీర్యద వాత్సీర్గృహే

మే2నశ్నన్‌ బ్రహ్మన్నతిథిర్నమస్య:

నమస్తే2స్తు బ్రహ్మన్‌ స్వస్తిమే2స్తు

తస్మాత్‌ ప్రతిత్రీన్‌ వరాన్‌ వృణీష్వ’

తా:` ‘ఓ బ్రాహ్మణుడా...నీకు నమస్కారం! పూజ్యుడవైన నీవు అతిథివై వచ్చినా ఇంట్లో నిరాహారంగా మూడురాత్రు గడిపావు! కనుక నన్ను మన్నించి వాటికి పరిహారంగా మూడు వరాు కోరుకో! అలా నాకు శుభం క్గుతుంది!

నచికేతుని చెంతకు చేరిన యముడు....ఆ బ్రాహ్మణ బాుని బాధను బాపి సంతుష్టిపర్చు సదుద్దేశంతో వరాననుగ్రహిస్తాననటంలో...తన అపరాధ పరిహార ప్రయత్నం కన్పిస్తుంది! దీన్నిబట్టి...తెలిసిగానీ, తెలీకగానీ మనవ్ల జరిగే పొరపాట్లను తప్పనిసరిగా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాని సున్నితంగా సూచిస్తుందీ శ్లోకార్ధం!

10శ్లో:` ‘శాంత సంక్ప: సుమనా యథాస్యాద్‌

వీతమన్యుర్‌ గౌతమౌ మా2భిమృత్యో

త్వత్‌ ప్రసృష్టమ్‌ మాభివదేద్‌ ప్రతీత:

ఏతత్‌ త్రయాణాం ప్రథమం వరం వృణే’

తా:` ‘ఓ మృత్యు దేవతా.....నా తండ్రిjైున గౌతముడు నా గురించిన చింత తీరినవాడై, కోపముపశమించినవాడై సంతోషము నిండిన మనస్సు గవాడై...నీచే తిరిగి మాలోకమునకు పంపబడిన నన్ను గుర్తించినవాడై, నన్నాదరించువాడై వుండవలెనని..మూడు వరాలో నా మొదటి వరం ఇదే....అనుగ్రహించగదే!’’

మృత్యువిచ్చే మూడు వరాలో ఒకదానిని తండ్రి చింత తీర్చి సంతోషాన్ని కూర్చి...మృత్యుముఖానబడిబయటబడిన తన నాదరించడానికై వినియోగింపజేసుకుంటూ...తండ్రి యొక్క ఆవశ్యకతను గుర్తించి...తండ్రి గురించి యోచించి...తండ్రి పట్ల భక్తి శ్రద్ధల్ని వ్యక్తపర్చిన పుత్రధర్మం నచికేతుడిలో ప్రస్ఫుటమవుతుంది.

11శ్లో:` ‘యథాపురస్తాద్‌ భవితా ప్రతీత

ఔద్దాకిరారుణిర్మత్‌ ప్రసృష్ట:

సుఖం రాత్రీ: శయితౌ వీతమన్యు:

త్వాంద దృశివాన్‌ మృత్యుముఖాత్‌ ప్రముక్తమ్‌’

తా:` ‘నాయనా నచికేతా... నా యాజ్ఞచేత ఔద్దాకి, ఆరుణిjైున నీ తండ్రి నిన్ను గుర్తిస్తాడు. ఆదరిస్తాడు. మృత్యుముఖం నుండి ముక్తుడవై వచ్చిన నిన్నుగాంచి ముగ్ధుడైపోయి, కోపముపోయి రాత్రుందు సుఖంగా నిద్రించగడు’

ఉద్దాకుని దత్తపుత్రుడైన ఔద్దాక...అరుణిడి కుమారుడైన ఆరుణి అనబడు నచికేతుని తండ్రి....యముని మహిమచేత మృత్యుముఖం నుండి తిరిగొచ్చిన కొడుకును చూసి సంతోషిస్తాడని, ఏ చింతాలేక హాయిగా కాం గడుపుతాడని నచికేతుడికి నమ్మకం కల్గించి, తండ్రి గురించిన చింతను తొగించి ఆ బాున్ని కూడా ఆనందపరుస్తాడు యముడు!

12శ్లో:` ‘స్వర్గలోకే నభయం కించనాస్తి

నతత్రత్వం న జరయాబిభేతి

ఉభేతీర్త్వాశనాయా పిపాసే

శోకాతిగో మోదతే స్వర్గలోకే’

తా:` స్వర్గలోకంలో ఎటువంటి భయం లేదు. ఎందుకంటే నీవక్కడ వుండవుగనుక! ఆకలి దప్పునూ, వద్ధాప్యాన్నీ, సక దు:ఖానూ అతిక్రమించి మానవుడు స్వర్గంలో సుఖిస్తాడు!’

స్వర్గంలో దేవతకు జన్మ, బ్యా, యవ్వనం అనే మూడు దశు మాత్రమే వుంటాయని, వార్ధక్యం, మరణం లేని దేవతకు త్రిదశున్న పేరున్న వారి చెంతకు యముడు వెళ్లడని...., మానవు చేసే యజ్ఞయాగాదు నాస్వాదించి స్వాధిష్టవుతారని...నచికేతుడు యముడితో (స్వర్గాన్ని గురిచిన కుతూహలాన్ని) వ్యక్తం చేశాడని అనుకోవాలి!

13శ్లో:` ‘సత్వమగ్నిం స్వర్యమద్యేషి మృత్యో

ప్రభ్రూహితం శ్రద్ధనాయమహ్యమ్‌

స్వర్గలోకా అమృతత్వం భజన్త

ఏతత్‌ ద్వితీయేన వృణేవరేణ’

తా:` ‘యమరాజా...స్వర్గానికి తీసుకుపోయే ఆ యజ్ఞం నీకు తొసు! నేను శ్రద్ధావంతుడను గనుక...ఆ ఉపదేశానికర్హుడను! నాకా యజ్ఞవిద్యనుపదేశించు! ఇదే నేను రెండవ వరంగా కోరుకుంటున్నాను!’

కల్పాంతం వరకూ దేవతు జీవించి అనుభవించే పదవుూ, దీర్ఘ జీవితాు మొదగునవి. యజ్ఞఫలాుగా మానవుడు పొందగ ఆ స్వర్గసుఖాకు కూడా తానర్హుడు కావాన్న అభిలాషతో...యజ్ఞయాగాదుపట్ల సహజంగా శ్రద్ధాసక్తుడైన తనకా యోగ్యత కదన్న ఆత్మ విశ్వాసంతో అడిగాడు నచికేతుడు తన రెండోవరాన్ని ఆ మత్యుదేవుణ్ణి!

14శ్లో:` ‘ప్రతే బ్రవీమి తదుమే నిజోధ

స్వర్గమగ్నిం నచికేత: ప్రజానన్‌

అనంత లోకాప్తి మథోప్రతిష్ఠాం

విద్దిత్వమేతం నిహితం గుహాయాం’

తా:` ‘నచికేతా స్వర్గానికి తీసుకుపోయే ఆ అగ్ని, ఆ యజ్ఞం నాకు బాగా తొసు! నీకు చెబుతాను నేర్చుకో! ఆ విద్య శాశ్వత స్వర్గాన్ని పొందడానికి సాధనమనీ, సక జగత్తుకూ ఆధారమనీ, విద్వాంసు హృదయం దానికి నియమనీ త్సొకో’

సర్వ జగత్తుకూ మూమైన విరాట్‌ స్వరూపమైన ఆ యజ్ఞవిద్య విద్వాంసు ప్రజ్ఞలోనే ప్రకాశిస్తుందని...ప్రభావం చూపెడుతుందని క్ష్యసిద్ధి కల్గిస్తుందనీ యముడు నచికేతుడికి వివరిస్తాడు.

15శ్లో:` ‘లోకాదిమగ్నిం తమువాచ తస్మై

యా ఇష్టకా: యావతీర్వా యథావా

సచాపితత్‌ ప్రత్యవదత్‌ యథోక్తం

అథాస్య మృత్యు: పునరేవాహతుష:’

తా:` నచికేతునికి యముడు జగత్తుకు మూమైన ఆ అగ్నిని గురించి, ఆ యజ్ఞానికి కావల్సిన ఇటుకలెన్నో, ఎలాంటివి కావాలో, హోమవిధిని యెలా నిర్వర్తించాలో అంతా సాక్యంగా వివరించాడు!

ఈ సృష్టిలోని అగ్ని (వేడి) యొక్క ఆవశ్యకతనూ, యజ్ఞయాగాదుయందు ఆయా దేవతకు హవిస్సు నందించే అగ్నియొక్క ప్రముఖ పాత్రను గురించి యముడు నచికేతుడికి త్పెగా...శ్రద్ధగా ఆకించిన ఆ నచికేతుడు ప్లొు పోకుండా అంతా మళ్లీ ఆ యముని కప్పజెప్పగా...ఎంతో సంతోషించాడు యమదేవుడు...ప్రజ్ఞావంతుడైన శిష్యునిగాంచిన గురుదేవుడిలా!

16శ్లో:` ‘తమబ్రవీత్‌ ప్రీయమాణో మహాత్మా

వరంతవే హాద్య దదామి భూయ:

తవైవనామ్నా భవితా2యమగ్ని:

సృంకాం చేమామనేక రూపాం గృహాణ’

తా:` మహాత్ముడైన యముడు నచికేతునితో ఇలా అన్నాడు. వత్సా నచికేతా... నీకు మరో వరం కూడా ఇస్తున్నాను. ఇక మీద ఈ అగ్ని నీ పేరిటనే ‘నచికేతాగ్ని’ గా ప్రసిద్ధమౌతుంది. ఇంతేగాక...ఇదిగో ఎన్నో రంగుగ ఈ మాను కూడా అనుగ్రహిస్తున్నాను. గ్రహించు! అని

ఈ రంగుమా అనేది ఆది శంకరు అభిప్రాయంలో అనేక రూపాం సృంకాం అనగా సత్ఫలితానిచ్చే కర్మమార్గమని అర్థం! అప్పుడు దీని అంతరార్థం..... యముడు నచికేతుడికి మరికొన్ని సత్ఫలితానిచ్చే యజ్ఞకర్మ రహస్యాను కూడా బోధించాడని భావించాలి!

యోగ్యుడైన శిష్యుడివ్ల సంతుష్టుడైన గురువు అడిగినవేగాక (ఆవశ్యకతనుబట్టి) అడగనివికూడా అనుగ్రహిస్తాడని గ్రహించి గురువును త్రిమూర్తి స్వరూపంలా ప్రతి శిష్యుడూ భావించి, సేవించి క్ష్యసిద్ధిని సాధించాన్న పరమార్థాన్ని త్పొతుందీ శ్లోకార్థం!

17శ్లో:` ‘త్రిణాచికేతస్త్రిభిరేత్యసంధిం

త్రికర్మకృత్‌ తరతి జన్మమృత్యూ

బ్రహ్మజజ్ఞం దేవమీఢ్యం విదిత్వా

నిచాయ్యేయమాం శాంతి మత్యంతమేతి’

తా:` ఈ నాచికేత యజా ్ఞన్ని మూడు మార్లు చేసి, ఉపదేశం కోసం ముగ్గురిని ఆశ్రయించి, మూడు రకా విధును నిర్వర్తించినవాడు జన్మమృత్యువును అతిక్రమిస్తాడు! బ్రహ్మమునుండి జన్మించినవాడూ, దేదీప్యమానుడూ, సర్వజ్ఞుడూ, ఆరాధ్యుడూ అయిన అగ్నిని గూర్చి త్సొకొని సాక్షాత్కరింపజేసుకొని పరమశాంతిని పొందుతాడు!

ఈ యజ్ఞాన్ని ‘మూడుసార్లు చేస’ి...అనగా...త్రిణాచికేత అనే పదానికి ఈ నాచికేత యజ్ఞాన్ని గూర్చి విని అధ్యయనం చేసి నిర్వర్తించినవాడు...అని అర్థం చేసుకోవచ్చును. ముగ్గురిని ఆశ్రయించి...అనగా తల్లి, తండ్రి గురువు ద్వారా గానీ...లేదా...వేదాూ, స్మృతుూ, ఋషునుండి గానీ...లేదా..ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ అనే ప్రమాణా ద్వారా గానీ....జ్ఞానాన్ని ఆర్జించినవాడు అని గ్రహించవచ్చును. మూడు రకా విధు అనగా వేదాధ్యయనమూ, యజ్ఞనిర్వహణమూ, దానమూ అనేవి అని అనుకోవచ్చును.

18శ్లో:` ‘త్రిణాచికేతస్త్రయమేతద్‌ విదిత్వా

య ఏవం విద్వాంశ్చినుతే నాచికేతమ్‌

సమృత్యుపాశాన్‌ పురత: ప్రణోద్య

శోకాతిగో మోదతే స్వర్గలోకే’

తా:` నాచికేత యజ్ఞాన్ని గురించి త్సొకొని మూడుసార్లు నిర్వర్తించిన ఆ ధీశాలి శరీర పతనానికి ముందే మృత్యుపాశాను ఛేదించి శోకాన్నతిక్రమించి, స్వర్గం చేరి ఆనందిస్తాడు.

ఈ నాచికేత యాగం మూడుసార్లు చేసినవాడు....‘తల్లి, తండ్రి, గురువు’...ఈ ముగ్గురూ చూపిన మార్గంలో ఉదాత్తమైన జీవన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి!

దుర్నడత, లోభమూ, ఆసక్తి, అజ్ఞానమూ, ద్వేషము మొదగు అంశాలోనున్న మృత్యుపాశాను జయించి, శోకాన్నధిగమించి...(బ్రహ్మజ్ఞానాన్నెరిగిన విజ్ఞుడు గనుక) పరమాత్మ పథంలో పరమశాంతినొందుతాడని, నాచికేత యజ్ఞ ప్రాముఖ్యతను గ్రహించి దీక్షగా నిర్వహించటంవ్ల కలిగే మహత్తర ఫలితానూ...మానవుడి శోకం తీరి ఆనందలోకం చేరే విధాన్నీ వివరిస్తుందీ మివైన శ్లోకం!

19శ్లో:` ‘ఏషతే2గ్నిర్నచికేత: స్వర్గ్యో

యమ వృణీథా ద్వితీయేన వరేణ

ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాస:

తృతీయం వరం నచికేతోవృణీష్వ’

తా:` ‘ఓ నచికేతా...రెండవ వరంగా నీవు కోరుకున్న (స్వర్గానికి తీసుకుపోయే ఈ అగ్ని) యజ్ఞం ఇక మీదట నీ పేరిటనే జనుచేత పిువబడుతుంది! ఇక నీ మూడో వరాన్ని కూడా కోరుకో!’ అన్నాడు యముడు.

అందుకు నచికేతుడిలా అడిగాడు.

20శ్లో:` ‘ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే

అస్తీత్యేకే నాయమస్తీతి చైకే

ఏతద్‌ విద్యామను శిష్టత్వ యాహం

వరాణా మేష వరస్తృతీయ:’

తా:` ‘మానవుడు మరణించాక ఏం జరుగుతుంది? మత్యువు తర్వాత కూడా అతడుంటాడని కొందరు వుండరని ఇంకొందరు అంటూ ఉంటారు. ఈ సందేహం స్వయం మృత్యుదేవతవైన నీ ద్వారానే త్సొకోవాని నా కోరిక! ఇదే నా మూడవ వరంగా అనుగ్రహించు యమదేవా!’

ఎంత వయసొచ్చినా మృత్యువు గురించే గుర్తుకురాక, ముముక్షువు కాలేక జన్మను వ్యర్థపర్చుకునే పెద్దలెందరో వున్న లోకంలో...‘పిట్ట కొంచెం...కూత ఘనం’ అన్నట్టు ఏకంగా మృత్యువు గురించిన రహస్యాన్ని...అదీ...మృత్యుదేవతనే అడగటం అనేది...‘బాుడు కాదు నచికేతుడు...జ్ఞానపాుడు’ అన్పించేలా....జ్ఞానానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించేలా శ్లాఘనీయశ్లోకం ఇది!

21శ్లో:` ‘దేవైరత్రాపి విచికిత్సితం పురా

నహిసుజ్ఞేయ మణురేష ధర్మ:

అన్యం వరం నచికేతో వృణీష్వ

మామోపరోత్సీరతి మా సృజైనమ్‌’

తా:` (నచికేతుడి ప్రశ్నతో ఆశ్చర్యంగా ఆ బాుడి వేపు చూస్తూ ఇలా అన్నాడు యముడు)

‘నాయనా నచికేతా...ఈ విషయంలో మునుపు దేవతకు సైతం సందేహం వచ్చింది. ఇది చాలా సూక్ష్మమైన అంశం! అర్థం కావటం ఎంతో కష్టం! అందుచేత మరొక వరం ఏదైనా కోరుకో! ఇది మాత్రం అడగొద్దు.

అంతటి నిగూఢమైన మరణ రహస్యాన్ని బాుడైన వాడికెలా బోధించాలి అన్న మీమాంస కన్నా...ఆ విషయంపై బాుడి పట్టుదను పరీక్షించి మరింత గట్టి పర్చాన్న గట్టి సంక్పమే యమధర్మరాజుదని గ్రహించవచ్చును!

22శ్లో:` ‘దేవైరత్రాపి విచికిత్సితం కి

త్వం చమృత్యోయన్న సుజేయమాత

వక్తాచాస్యత్వా దృగన్యోనభ్యో

నాన్యోవరస్త్యు ఏతస్యకశ్చిత్‌’

తా:` ‘ఓ యమ దేవా....ఈ విషయంలో మునుపు దేవతక్కూడా సందేహం కల్గింది కదా! పైగా ఇది అంత సుభంగా అర్థమయ్యేది కాదని నీవు కూడా చెబుతున్నావ్‌!

ఇంతటి నిగూఢ రహస్య విషయాన్ని వివరించడానికి మృత్యుడైన నిన్ను మించిన ఆచార్యుడెక్కడా భ్యం కాడు నాకు!

అందుచేత... ఈ వరంతో సమానమైన వరమేదీ లేదను కుంటున్నాను! దయచేసి కాదనవదు!’

అంటున్న నచికేతుని మనసు మళ్లించే ధోరణిలో తన ప్రయత్నం నుండి విరమించకుండా మళ్లీ యముడిలా అన్నాడు.

23శ్లో:` ‘శతాయుష: పుత్ర పౌత్రాన్‌ వృణీష్వ

బహూన్‌ పశూన్‌ హస్తి హిరణ్యమశ్వాన్‌

భూమేర్మహదాయతనం వృణీష్వ

స్వయం చ జీవ శరదోయా వదిచ్ఛసి’

తా:` ‘నాయనా నచికేతా...నూరేండ్లు జీవించే కొడుకునూ మనుమనూ కోరుకో! భువిపైన సువిశా సామ్రాజ్యాన్ని వరించు! బంగారాన్నీ, పశుసంపత్తినీ, ఏనుగుూ, గుర్రాూ మొదగునవి ఎన్నైనా వాంచించు! నీ కిష్టమైనంత కాం నీవు జీవించు..’

అంటూ ఇంకా ఇలా అన్నాడు యమదేవుడు.

24శ్లో:` ‘ఏతత్త్యుం యదిమన్యసేవరం

వృణీష్వ విత్తం చిరజీవికాం చ

మహా భూమౌ నచికేతస్త్వమేధి

కామానాం త్వా కామభాజం కరోమి’

తా:` ఓ నచికేతా....దీనితో సమానమైన వరమింకేదైనా నీకు తోస్తే అదే అడుగు! ధనమూ, దీర్ఘ జీవనమూ, సువిశా రాజ్యసామ్రాజ్యాధిపత్యమూ...ఇలా యేవి కోరినా ప్రసాదిస్తాను.’ అన్నా చలించలేదు నచికేతుడు. దాంతో ఇంకా ఇలా నచికేతునికి నచ్చ జెప్ప జూశాడు యముడు.’

25శ్లో:` ‘యేయే కామా దుర్లభా మర్త్యలోకే

సర్వాన్‌ కామాన్‌ ఛందత: ప్రార్థయస్వ

ఇమారామా: సరథా: సతూర్యా

నహీదృశాంభ నీయా మనుష్యై:

ఆభిర్మత్ప్రత్తాభి: పరిచారయస్వ

నచికేతో మరణం మా2నుప్రాక్షీ:’

తా:` ‘నచికేతా....మానవలోకంలో ఏఏ కోరికలో దుర్లభాలో అవన్నీ నీ ఇష్ట ప్రకారం అడుగు! మానవ మాతృకు భ్యంకాని వారిని....సంగీత వాద్యాతో విహార రథాతో వున్న అపురూప సుందరులైన కన్యను నీ కనుగ్రహిస్తాను! గ్రహించి ఆనందించు! అంతేగానీ మరణాన్ని గురించి మాత్రం నన్ను అడగొద్దు!’

అన్నాడు యముడు. అందుకు నచికేతుడు యమునికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.

26శ్లో:` ‘శ్వో భావా మర్త్యస్య యదంత కైతత్‌

సర్వేంద్రియాణాం జరయంతి తేజ:

అపి సర్వం జీవితమ్పమేవ

తవైవ వాహాస్తవ నృత్యగీతే’

తా:` ‘ఓ యమరాజా....నీవు చెప్పే ఇవన్నీ కూడా క్షణికాలే! మానవుడి ఇంద్రియా శక్తిని క్షీణింపజేసేవే! ఎంత పొడిగించినా, ఎంత అనుభవించినా...మానవ జీవితం అ్పమే! అవన్నీ నీ దగ్గరే వుండనీ!’

అన్నాడు అసలైన మృత్యు రహస్యాన్ని త్సొకోగోరిన నచికేతుడు!

27శ్లో:` ‘న విత్తేన తర్పణీయో మానుష్యో

ప్స్యామహే విత్తమద్రాక్ష్మచేత్త్వా

జీవిష్యామో యావదీశిష్యసిత్వం

వరస్తుమే వరణీయ: సయేవ’

తా:` (యముడెన్ని చెప్పినా ఏ మాత్రం చెవి యొగ్గని నచికేతుడు మళ్లీ ఇలా అన్నాడు)

‘ఓ యమ దేవతా....మానవుడేనాటికీ ధనంతోనే తృప్తినొందడు! అంతేగాక నిన్ను దర్శించాక, నీ అనుగ్రహం అందింతర్వాత మాకెలాగూ సంపద భిస్తుంది! నీవు పాలించినంత కామూ ఎలాగూ జీవిస్తాము! అవన్నీ సహజసిద్ధములే...అశాశ్వతములే!....కోరదగినవికావు! నేను కోరిన మరణానంతరం మానవుని స్థితిని గూర్చి ఉపదేశించమని ప్రార్థిస్తున్నాను!’ అంటూ చేతు జోడిరచాడు!

మృత్యుదేవత అనుగ్రహాన్ని పొందిం తర్వాత, ఇంకా (అకా) మరణభయం ఎందుకుంటుంది? ఆయుష్షున్నంతకాం హాయిగా జీవించవచ్చును! కోరినా, కోరకపోయినా...అవన్నీ అందరికీ సహజమైన జీవన విధానములే....ఏవీ స్థిరమైనవి కావని తెల్సిన నచికేతుడు....ప్రతి మనిషీ ప్రయత్నించి త్సొకొనిమరీ సాధించాల్సిన శాశ్వత సత్యాన్ని గురించిన జిజ్ఞాసవున్న ప్రజ్ఞావంతుడు!

28శ్లో:` ‘అజీర్యతామమృతానాముపేత్య

జీర్యన్‌ మర్త్య: క్వధస్థ: ప్రజానన్‌

అభిద్యాయన్‌ వర్ణరతి ప్రమోదా

నతిదీర్ఘే జీవితే కోరమేత?’

తా:` ‘యమరాజా....అక్షముూ, అమయీ అయినవారి వద్దకు చేరుకుని కూడా...వారినుండి పొందగ శ్రేష్టమైన వరాను తెలిసికూడా....అనివార్యమై మృత్యువు పాబడే అశాశ్వతమైన వాటిని తెలివైన ఏ మానవుడు కోరుకుంటాడు?’ అన్నాడు నచికేతుడు.

ఇదంతా నచికేతుడి సూక్ష్మగ్రాహ్యతనూ, గాఢ వైరాగ్యాన్ని సూచిస్తున్నాయి. భౌతిక సుఖాన్నీ క్షణభంగురాని, ఎన్నేళ్లు బ్రతికినా మృత్యువు తప్పదని....అర్హతగ ఆచార్యుడి (యముడి) ద్వారా అమరత్వం పొందటానికి ఆత్రపడుతున్న అతడి ప్రగాఢ వాంఛ, పటిష్ఠ సంక్పం గోచరిస్తున్నాయి.

29శ్లో:` ‘యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో

యత్‌ సాంపరాయే మహతి బ్రూహినస్తత్‌

యో2యంవరో గూఢమను ప్రవిష్టో

నాన్యం తస్మాన్నచికేతా వృణీతే...’

తా:` ‘ఓ యమరాజా...మరణానంతరం ఆ మహత్తర జీవితాన్ని గురించి చెప్పుము. దాని గురించేకదా అందరికీ సందేహం! గ్రహించనవికాని దీన్ని గ్రహించానే వరం తప్ప ఈ నచికేతుడు మరోటి కోరడు! దయచేసి నా అభీష్టాన్ననుగ్రహించవసిందిగా అభిషిస్తున్నాను!’ అన్నాడు అత్యంతాసక్తితో....భక్తి శ్రద్ధతో నచికేతుడు కష్టమైన దాన్ని సాధించాంటే గట్టి పట్టుద వుండాని, ఏ ప్రలోభాకూ లొంగని క్ష్యసిద్ధి కావాని...సాధకుకు నచికేతుని ద్వారా అర్థమౌతుంది!

అతీంద్రియమైన దాన్ని అర్థం చేసుకోవడానికి స్వచ్ఛమైన, నిశ్చమైన, సుశిక్షితమైన, పరిపుష్టమైన మనసు అవసరం!

No comments:

Post a Comment