Tuesday, 4 May 2021

చాణక్య నీతి దర్పణము - తృతీయాధ్యాయము

చాణక్య నీతి దర్పణము - తృతీయాధ్యాయము


శ్లో || కస్య దోషః కులే నాస్తి వ్యాధినా కో న పీడితః |

 వ్యసనం కేన న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరమ్‌ || 1

 అర్థము :- కస్య = ఎవని యొక్క, కులే = కులమునందు, దోషః = దోషము, నాస్తి = లేదు? వ్యాధినా = వ్యాధిచేత, కః = ఎవడు, పీడితః = పీడింపబడినవాడు, న = కాదు, వ్యసనం = కష్టము, కేన = ఎవనిచేత, న ప్రాప్తమ్‌ = పొందబడదు? కస్య = ఎవనికి, నిరంతరం = ఎల్లపుడు, సౌఖ్యం = సౌఖ్యముండును?

 తాత్పర్యము :- ఎవని కులములో దోషము లేదు? వ్యాధిచే పీడింపబడని వాడెవడు? కష్టము నెవడు పొందుటలేదు? ఎవని కెల్లపుడు సుఖమున్నది?

 వివరణము :- ఎల్లపుడు నెవనికి సుఖముండును? మేఘదూతము 2.49 లో-

 కస్యాత్యన్తం సుఖముపనతం దుఃఖమేకాన్తతో వా |

 నీచైర్గచ్ఛత్యుపరి చ థా చక్రనేమి క్రమేణ ||

 తాత్పర్యము :- నియమముగా సుఖముకాని దుఃఖముకాని యెవని కెల్లపుడుండును? చక్రమునకు పై భాగమున చుట్టబడియున్న యినుప ప్టాయొకసారి పైకి యొకసారి క్రిందికి నెట్లు చక్రభ్రమణమునుబ్టి యుండునో యట్లే మానవజీవితములో కష్ట సుఖములుండును.

 చక్రవత్పరివర్తన్తే దుఃఖాని చ సుఖాని చ |

 చక్రమువలె సుఖదుఃఖములు పరిభ్రమించుచుండును.

 చక్రార పంక్తిరిన గచ్ఛతి భాగ్యపంక్తిః 

 (స్వప్న నాటకము)

 చక్రములోని ఆకుల వరుసవలె మనుష్యుని భాగ్యము మాఱుచుండును.

 సుఖస్యానస్తరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖమ్‌ |

 సుఖదుఃఖం మనుష్యాణాం చక్రవత్పరివర్తతః || 

(మ. భా. అను. 174-19)

 తాత్పర్యము:- సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము మనుష్యులకు సుఖదుఃఖములు చక్రమువలె నొకదాని తర్వాత నొకి మాఱుచు వచ్చుచుండును.

శ్లో || ఆచారః కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణమ్‌ |

 సంభ్రమః స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనమ్‌ || 2

 అర్థము:- ఆచారః = మనుష్యుని యొక్క యాచారము, కులం = కులమును - శీలమును, అఖ్యాతి = ప్రకించును, భాషణం = మ్లాడుట, దేశం = అతని దేశమును, అఖ్యాతి = చెప్పుచున్నది, పరిభ్రమః = సమ్మానము, స్నేహం = ప్రేమను, అఖ్యాతి = చెప్పుచున్నది, వపుః = శరీరము, భోజనం = అతని యాహారమును, అఖ్యాతి = వెల్లడించుచున్నది.

 తాత్పర్యము :- ఆచారము అతని కులము (శీలము)ను దెలుపును, మాటలు అతని దేశమును దెలుపును. గౌరవాదులు స్నేహమును (ప్రేమను) దెలుపును. శరీరము యొక్క బల హీణములు అతని అన్నాదుల దెల్పును.

 వివరణము :- శరీరము శుష్కించుటను బ్టి యతని యాహారమును దెలిసికొవచ్చును. ఇది యొక పూట భుజించు వారి విషయములో గాదు. ఒక పూడ తినువారి భోజనము మంచిదో చెడ్డదో వారి శరీరము ద్వారా తెలియబడదు. మనుష్యుని యాహారము సాత్వికముగాను స్నిగ్ధము చమురు) కలదిగాను, రుచికరముగాను, అన్ని గుణములు సమపాళ్లలో నున్నది యైనచో శరీరము బలిష్ఠముగా నుండును. భోజనము సరియైనది కానిచో చిక్కిపోవును. కావున మనుష్యుని శరీరస్థితిని గమనించి యాతని యాహారమును దెలిసికొవచ్చును.

శ్లో || సుకులేయోజయేత్కన్యాంపుత్రంవిద్యాసుయోజయేత్‌ |

 వ్యసనే యోజయేచ్ఛత్రుంమిత్రం ధర్మేనియోజయేత్‌ || 3

 అర్థము :- కన్యాం = పుత్రికను, సుకునే = మంచి సంప్రదాయముగల కుటుంబమున, యోజయేత్‌ = చేర్చవలెను. (పెండ్లి చేయవలెను), పుత్రం = కుమారుని, విద్యాసు = విద్యలయందు, యోజయేత్‌ = అభ్యసించు వానినిగా చేయవలెను, శత్రుం = శత్రువును, వ్యసనే = దుఃఖమునందు (కష్టమనుభవించునట్లు), యోజయేత్‌ = చిక్కుకొనునట్లు చేయవలెను, మిత్రం = స్నేహితుని, ధర్మే = ధర్మమునందు ప్రవర్తించు వానినిగా, నియోజయేత్‌ = నియుక్తుని చేయవలెను.

 తాత్పర్యము :- కన్యను ఉత్తమవంశములోని వానికిచ్చి పుత్రుని విద్యలయందాసక్తిగలవానివిగా జేయవలెను. శత్రువును కష్టములు, దుఃఖములు పొందువానినిగా చేయవలెను. మిత్రుని ధర్మమార్గమున నడుచువానినిగా జేయవలెను.

శ్లో || దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః |

 సర్పోదంశతి కాలేన దుర్జనస్తు పదే పదే || 4

 అర్థము :- దుర్జనస్య = దుర్జనుని యొక్కయు, చ = మఱియు, సర్పస్య = సర్పముయొక్కయు మధ్య (ఆ రిెంలో), సర్పః = పాము, పరం = శ్రేష్టమైనది, దుర్జనః = దుర్జనుడు, న = కాదు, కారణమేమనగా, సర్పః = పాము, కాలేన = కఱచుటకు దగిన కాలముననే, దంశతి = కాటు వేయును, దుర్జనస్తు = దుర్జనుడైనచో, పదే పదే = అడుగడుగునను హాని కలిగించును.

 తాత్పర్యము : - దుర్జనుని సర్పమును పోల్చిచూచినచో సర్పమే శ్రేష్టమైనది. సర్పము దానిని జూచి కాని చూడక కాని త్రొక్కినచో యొత్తిడి చేసిన్టి సమయముననో తప్ప తక్కిన సమయములలో కాటు వేయదు. దుర్జనుడట్లు కాక యడుగడుగునను చెడును గలిగించు ప్రయత్నము చేయుచుండును.

 వివరణము :- దుర్జనుని గుణమ్టెిదో చూడుడు-చాణక్య రాజనీతి శాస్త్రము 3-32 లో-

 దుర్జనస్య ముఖే ప్రీతి ర్వాణీ చందనశీతలా |

 హృదయే తన్య దుర్భుద్ధేః కులిశాదపి కర్కశమ్‌ ||

 తాత్పర్యము :- దుర్మార్గుని నోిలో ప్రియమైన్టియు, గంధమువలె చల్లనైన్టియు మాటలుండును. ఆ దుష్టుని హృదయములో వజ్రాయుధమునకు మించిన కాఠిన్యముండును.

శ్లో || ఏతధర్మం కులీనానాం సృపాః కుర్వన్తి సంగ్రహమ్‌ |

 ఆదిమధ్యా-వ సానేషు న త్యజన్తి చ తే నృపమ్‌ || 5

 అర్థము :- నృపాః = రాజులు, కులీనానాం = సత్కులమున ప్టుిన వారి యొక్క, సంగ్రహం = సంగ్రహమును (సమకూర్చుటను) ఏతధర్మం = ఇందుకొఱకే, కుర్వన్తి = చేయుచున్నారు, తే = అి్టవారు, నృపం = రాజును, ఆదిమధ్యా2వసానేషు = మొదటకాని, మధ్యకాని చివరకాని, చ = కూడ, నత్యజన్తి = విడిచిపెట్టరు.

 తాత్పర్యము :- రాజులు మంచివశమువారికి తమదగ్గఱకు చేర్చుకొందురు. అి్ట మంచివంశమువారు ఆ రాజును మొదటకాని, మధ్యలోకాని, చివరకు కాని, యే స్థితిలోను విడువక యింపెట్టుకొని యుందురు.

 వివరణము :- మంచివంశము వారి(కులీనుల) సంబంధము నాశనము నుండి రక్షించును-

 కులీనుః సహ సమ్పర్కం పండితైః సహ మిత్రతామ్‌ |

 జ్ఞారిభిశ్చ సమం మేలం కుర్వాణో న వినశ్యతి ||

(చాణక్య నీతిశాస్త్రము-56)

 మంచివంశమువారితో సంబంధము, పండితులతో మైత్రి, బంధువులతో కలసి మెలసి యుండుటయు కలిగిన మనుజు డున్నడు నష్టము పొందడు.

శ్లో || ప్రలయే భిన్న మర్యాదా భవన్తి కిల సాగరాః |

 సాగరా భేదమిచ్ఛన్తి ప్రలయే-పి న సాధవ || 6

 అర్థము :- సాగరాః = సముద్రములు, ప్రలయే = ప్రలయకాలమున, కిల = నిశ్చయముగా, భిన్నమర్యాదాః = హద్దును దాటునని, భవన్తి = అగుచున్నవి, సాగరాః = సముద్రములు, భేదం = ఒడ్డును వేఱుచేయుటను, ఇచ్ఛన్తి = కోరుచున్నవి(చేయుచున్నవి), సాధవః = సాధువులు(సజ్జనులు), ప్రలయే-పి = ప్రలయకాలమందుకూడ, న = తమ మర్యాదను అతిక్రమింపరు.

 తాత్పర్యము :- ప్రలయకాలమందు సముద్రములు తమ చెలియలికట్ట నతిక్రమించును. సముద్రములు తమ స్థానమునుండి వేఱుగునవియగును. కాని సాధువులు ప్రలయము సంభవించినను(గొప్ప ఆపదలు) తాము మర్యాదను విడువరు.

 వివరణము:- సజ్జనుల శీలము చూడుడు-

 దుర్జన వచనాంగారైర్ఘగ్ధో-పి న విప్రియం పదత్యార్యః |

 అగరు రపి దహ్యమానః స్వభావగంధం పరిత్యజతి కిం ను ||

 దుర్జనుల యొక్క మాటలు రూపాగ్నితో కాల్చబడినను ఆర్యుడు తప్పుడు మాటలాడడు. అగరువత్తి అగ్నిచే కాల్చబడుచున్నను తన స్వాభావిక సుగంధమును విడిచిపెట్టదు గదా! అట్లే ఆర్యుడును.

శ్లో || మూర్ఖస్తు పరిహర్తవ్యః ప్రత్యక్షో ద్విపదః పశుః |

 భినత్తి వాక్శల్యేన అదృష్టః కంటకో యథా || 7

 అర్థము :- మూర్ఖస్తు = మూర్ఖుడైతే, పరిహర్తవ్యః = విడిచిపెట్టదగినవాడు, అతడు, ప్రత్యక్షః = ప్రత్యక్షమైన, ద్విపదః = రెండుకాళ్లును, పశుః = పశువు, వాడు, వాక్శల్యేన = బాణములవిం మాటలతో, భినత్తి = బాధించును, అదృష్టః = కనబడకుండున్టి, కంటకః = ముల్లు, యథా = ఎట్లు బాధించునో వాడట్లు బాధించును.

 తాత్పర్యము :- మూర్ఖుడు ద్విపాదవశుడగుటచే నతనిని దూరముగా నుంచవలెను. కనబడని ముల్లు ఎట్లు బాధించునో యా మూర్ఖుడు వాగ్రూప బాణములతో నటుల బాధించును.

శ్లో || రూపయౌవన సంపన్నాః విశాలకుల సమ్భవాః |

 విద్యాహీనా న శోభన్తే నిర్గన్ధా ఇవ కింశుకాః || 8

 అర్థము :- రూపయౌవన సంపన్నాః = రూపము, యౌవనము, కులము అను సంపదలు కలవారైనను, విశాల కులసంభవాః = గొప్ప కుటుంబములో ప్టుినవారైనను, విద్యాహీనాః = విద్యలేనివారు, నిర్గంధాః = సువాసనలేని, కింశుకాః = మోదుగు పుష్పములవలె, న శోభన్తే = ప్రకాశింపరు, రాణించరు.

 తాత్పర్యము :- అందమైన శరీరరము యౌవనము కలిగి గొప్ప కులములో బ్టుినవారైనను విద్యలేనివారైనచో వారు(సుగంధము) మంచివాసనలేని మోదుగు పుష్పమువలె రాణింపరు.

శ్లో || కోకిలానాం స్వరోరూపం స్త్రీణాం రూపం పతివ్రతమ్‌ |

 విద్యా రూపం కురూపాణాం క్షమా రూపం తపస్వినామ్‌ || 9

 అర్థము :- కోకిలానాం = కోయిలలకు, స్వరం = కంఠధ్వని, రూపం = రూపము, స్త్రీణాం = స్త్రీలకు, పతివ్రతం = పాతివ్రత్యము, రూపం = రూపము, కురూపాణాం = అందవిహీనులకు విద్యా = విద్య, రూపం = రూపము, తపస్వినాం = తపోవంతులకు, క్షమా = ఓర్పు(సహనము), రూపమ్‌ = రూపము.

 తాత్పర్యము :- కోకిలలకు వాని స్వరమే అందమైన రూపము. స్త్రీలకు పాతివ్రత్యమే మంచియందము. శారీరకముగా నందములేనివారికి విద్యయే రూపము. తపోవంతులకు క్షమయే రూపము.(అందుము)

శ్లో || త్యజేదేకం కులస్యా-ర్థే గ్రామస్యా-ర్థే కులం త్యజేత్‌ |

 గ్రామం జనపదస్యా-ర్థే ఆత్మా-ర్థే పృథివీం త్యజేత్‌ || 10

 అర్థము :- కులస్యార్థే = కులముయొక్క రక్షణకు, ఉన్నతికి, వృద్ధికి, సుఖశాంతుల కొఱకు, ఏకం = పురుషు నొకనిని, త్యజేత్‌ = విడువవలెను, గ్రామస్యార్థే = గ్రామము కొఱకు, కులం = కులమును, త్యజేత్‌ = విడువలెను, జనపదస్యార్థే = జనులుండు ప్రదేశము యొక్క మేలు కొఱకు, గ్రామం = గ్రామమును విడువలెను, ఆత్మా-ర్థే = ఆత్మోన్నతి కొఱకు, పృథివీం = భూమండలము నంతిని, త్యజేత్‌ = విడువలెను.

 తాత్పర్యము :- కులముయొక్క రక్షణ, యభివృద్ధి మొదలగువాని కొఱకు నొకనిని విడిచిపెట్టుటకు సిద్ధపడవలెను. గ్రామాభివృద్ధి కొఱకు కులమును విడువలెను. దేశాభివృద్ధి కొఱకు గ్రామమును విడువవలెను ఆత్మరక్షణ కొఱకు నభివృద్ధి కొఱకు సంపూర్ణ భూమండలమును విడిచిపెట్టుటకు సిద్ధపడవలెను. సందేహింపరాదు.

 వివరణము :- ఈ శ్లోకములో కులము, గ్రామము, దేశము, ఆత్మ మొదలగునవి యొకదానికంటె నొకి శ్రేష్టమని చూపుటకు స్వర్ణసిద్ధాన్తమును ప్రతిపాదించెను. (లోహములలో నొకదానికంటె మఱియొకి గొప్పదై చివరికి బంగారము గొప్పదియైనట్లు) అన్నింకంటె ఆత్మ గొప్పదని వివరించెను.

శ్లో || ఉద్యోగే నాస్తి దారిద్య్రం జపతో నాస్తి పాతకమ్‌ | 

 మౌనే చ కలహోనాస్తి నాస్తి జాగరితే భయమ్‌ || 11

 అర్థము :- ఉద్యోగే = ప్రయత్నమునందు (అనగా ప్రయత్నము చేయువానికి), దారిద్య్రం = దారిద్య్రము, నాస్తి = లేదు, జపతః = ఈశ్వరుని ఓ3మ్‌ నామము జపించుటవలన, పాతకం = పాపము నాస్తి = ఉండదు, చ = మఱియు, మౌనే = మౌనమునందు (అనగా మౌనముగా నున్నచో), కలహః = కలహము, నిరోధము, నాస్తి = కలుగదు, జాగరితే = మేల్కొనిన వానియందు, భయం = భయము, నాస్తి = ఉండదు.

 తాత్పర్యము : - పురుషుడు ప్రయత్నము చేయుచున్నచో నాతనికి దారిద్య్రము లేదు. ఈశ్వరుని ముఖ్యనామమగు ఓ3మ్‌ను అర్థసహితముగ జపించుచున్నచో నితరులతో కలహమురాదు. మేల్కొనియున్నచో నెవనివలనను భయముండదు.

 వివరణము :- పురుష ప్రయత్నమున్నచో దారిద్య్రముండదు-

 ఉద్యోగః ఖలు కర్తవ్యః ఫలం మార్జారవద్భవేత్‌ |

 జన్మప్రభృతి గౌర్నాస్తి పయః పిబతి నిత్యశః ||

 నిత్యము ప్రయత్నము చేయుచున్నచో తప్పక ఫలము లభించును. పిల్లికి చిన్నప్పి నుండియు దగ్గఱ తనకు ఆవు లేకున్నను నిత్యము ప్రయత్నము చేసి పాలు త్రాగుచునే యున్నది.

 జపించువానికి పాపమంటదు-

 జకారో జన్మవిచ్చేదః పకారః పాపనాశకః |

 తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మ పాపవినాశకః ||

 జకారము జన్మ కలుగకుండజేయును. పకారము పాపమును నశింపజేయును. జన్మము, పాపము రిెంని నాశము చేయునది కావున జపమందురు. పరమాత్ముని నామము లన్నింలో మూగవాడు కూడ పలుకదగిననామము 'ఓ3మ్‌' అనునది శ్రేష్ఠమైనది. అందుచేత 'ఓ3మ్‌' నే జపింపవలెను. చాణక్యుడు-

 ఓంకార శబ్దో విప్రాణాం యస్య రాష్ట్రే ప్రవర్తతే |

 న రాజా హి భవే ద్యోగీ వ్యాధిభిశ్చన పీడ్యతే ||

(చాణక్య రాజనీతి శాస్త్రము 4-9)

 ఏ రాజు యొక్క రాజ్యములో బ్రాహ్మణులు ఓంకార శబ్దమును ప్రతిధ్వనింపజేయుదురో ఆ రాజు యోగి యగును. వ్యాధులచే పీడింపబడని వాడగును.

శ్లో || అతిరూపేణ వై సీతా అతి గర్వేణ రావణః |

 అతిదానం జలిర్ద త్వా అతి సర్వత్ర వర్జయేత్‌ || 12

 అర్థము :- అతిరూపేణ = మిక్కిలి సౌందర్యముచేత సీతయు, అతిగర్వేణ = మిక్కిలి గర్వము చేత, రావణః = రావణుడును, బలిః = బలిచక్రవర్తి, దానం = దానమును, అతి = అధికముగా, దత్త్వా = ఇచ్చియు, బంధనము పొందిరి. ఇందువలన, సర్వత్ర = అంతటను, అతి = అతిని(అనగా శక్తికి మించిన దానిని) వర్జయేత్‌ = విడిచిపెట్టవలెను.

 తాత్పర్యము:- అతి సౌందర్య కారణముచేత సీత అపహరింపబడెను. గర్వాతిశయముచే రావణుడు చంపబడెను. అధికముగా దానముచేయుటచే బలిచక్రవర్తి బంధనములో బడెను. ఈ దృష్టాంతమువలన అతిగా ప్రవర్తించుట కూడదని నిర్ధారణ యగుచున్నది.

శ్లో ||  కో హి భారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినామ్‌ |

 కో విదేశః సవిద్యానాం కః పరః ప్రియవాదినామ్‌ || 13

 అర్థము:- సమర్థానాం = శక్తిమంతులకు, కోహి = ఏ పని, భారః = కఠినమగును, వ్యవసాయినాం = వ్యాపారము చేయువారికి, కిం = ఏ స్థానము, దూరం = దూరమగును?సవిద్యానాం = విద్వాంసులకు, విదేశః = పరదేశము, కః = ఏది యగును? ప్రియవాదినామ్‌ = మధురముగా మ్లాడువారికి, పరః = ఇతరుడు, కః = ఎవడు?

 తాత్పర్యము :- శక్తిసంపన్నులకు నే పనియు భారము కాదు. వ్యాపారము చేయువారికి దూరమేయుండదు. విద్వాంసులకు స్వదేశమనియు పరదేశమనియు భేదముండదు. మధురముగా మ్లాడువారి యెడల తన పరభేదముండదు.

శ్లో || ఏకేనా-పి సువృక్షేణ పుష్పితేన సుగన్ధినా |

 వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా || 14

 అర్థము :- పుష్పి తేన = పుష్పించిన్టియు, సుగంధినా = సువాసన గలిగిన్టియు, సువృక్షేణ = మంచి వృక్షముతో, ఏకేనాపి = ఒక్కదానితోనైనను, తద్వనం = ఆ వనము, సర్వం = సమస్తము, వాసితం = సువాసగలదియగును, తథా = అట్లే, సుపుత్రేణ = మంచి పుత్రునితో, కులం = కులమంతయు నలంకరింపబడును.

 తాత్పర్యము:-  సుపుత్రు డొక్కడైనను తన వంశమునకు ప్రతిష్ఠాదులు కలిగించునట్లు సువాసనగల పూలతో గూడిన వృక్షమొక్కియైనను ఆ వనము నంతిని సువాసన కలదానినిగా జేయును.

శ్లో || ఏ కేన శుష్కవృక్షేణ దహ్యమానేన వహ్నినా |

 దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం తథా || 15

 అర్థము :- వహ్నినా = అగ్నిచేత, దహ్యమానేన = కాల్చబడుచున్న, ఏకేన = ఒక్కటైన, శుష్కవృక్షేణ = ఎండిన చెట్టుచేత, తద్వనం = ఆ వనము, సర్వం = అంతయు, దహ్యతే = కాల్చబడుచున్నది, తథా = అట్లే, కుపుత్రేణ = చెడ్డపుత్రునిచేత, కులం = కులమంతయు న ప్రతిష్ఠపాలగును.

 తాత్పర్యము :- అడవిలోనున్న యెండుచెట్టుకాలి యా యడవినంతిని నెట్లు దహించునో యట్లే వంశములో నొక్క దుష్టపుత్రుడున్నచో నాతని వలన ఆ వంశమంతయు దుష్టమైనదిగా మాఱిపోవును.

శ్లో || ఏకేనా-పి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధునా ||

 ఆహ్లాదితం కులం సర్వం యథా చంద్రేణ శర్వరీ || 16

 అర్థము :- విద్యాయుక్తేన = విద్యచే నలంకరింపబడిన్టియు, సాధునా = సజ్జనుడైన్టియు, ఏకేనాపి = ఒక్కడైనను, సుపుత్రేణ = సుపుత్రునిచేత, సర్వంకులం = కులమంతయు, యథా = ఎట్లు, శర్వరీ = రాత్రి, చంద్రేణ = చంద్రునివలన ప్రకాశింపబడుచున్నదో యట్లే, ఆహ్లాదితం = సంతోషపెట్టబడును.

 తాత్పర్యము:- విద్యాయుక్తుడైన సాధువగు నొక్క కుమారుడున్నను ఆ వంశము సంతోష సముద్రములో నోలలాడును. చంద్రోదయముచేత రాత్రి యెట్లు ప్రకాశించునో ఆ సుపుత్రునితో ఆ వంశము ప్రసిద్ధమగును.

శ్లో || కిం జాతైః బహుభిః పుత్రైః శోకసంతాపకారకైః || 

 పరమేకః కులా--లంబీ యత్ర విశ్రామ్యతే కులమ్‌ || 17

 అర్థము :- శోకసంతాపకారకైః = దుఃఖముచేత బాధించున్టి, బహుభిః = అనేకులగు, పుత్రైః = పుత్రులు, జాతైః = ప్టుినవారితో, కిమ్‌ = ఏమి ప్రయోజనము? యత్ర = ఎవని యాశ్రమమున, కులం = కులమంతయు, విశ్రామ్యతే = విశ్రాంతిని, సుఖమును పొందునో, అి్టవాడు, కులాలంబీ = కులమునంతికి నాధారమైనవాడు, వరం = శ్రేష్ఠమైనవాడు, ఏకః = ఒక్కడే చాలును.

 తాత్పర్యము: - శోకమును, సంతాపమును, హృదయక్షోభను గలిగించున్టి పుత్రు లెందఱుండి ప్రయోజనమేమి? వంశమున కాధారభూతుడగు నొక్కపుత్రుడు శ్రేష్ఠుడుచాలు. అతని యాశ్రమమువలన వంశమంతయు విశ్రాంతిగ సుఖము ననుభవించును.

 వివరణము :- స్త్రీలు శ్రేష్ఠులైన పుత్రుల గనవలెను. పిఱికివారిని గనరాదు-

 నిరుత్సాహం నిరానందం నిర్వీర్యమరినందనమ్‌ |

 మా న్మ సీమన్తినో కాచిజ్జనయే త్పుత్రమీదృశమ్‌ ||

 ఏ స్త్రీ కూడ ఉత్సాహ శూన్యుని, ఆనందము లేనివానిని, శక్తి విహీనుని, శత్రువుల కానందము కలిగించు పుత్రుని కనరాదు.

శ్లో || లాలయేత్‌ పంచవర్షాణి థవర్షాణి తాడయేత్‌ |

 ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరేత్‌ || 18

 అర్థము :- పుత్రం = కుమారుని, పంచవర్షాణి = అయిదేండ్లు, లాలయేత్‌ = బుజ్జగించుచు లాలించవలెను, థవర్షాణి = పదేండ్లు వచ్చువఱకు, తాడయేత్‌ = దండింపవలెను, షోడశేవర్షే = పదునాఱవ సంవత్సరము, ప్రాప్తేతు = ప్రాప్తించగా, మిత్రవత్‌ = స్నేహితునివలె, ఆచరేత్‌ = వ్యవహరింపవలెను.

 తాత్పర్యము:- అయిదు సంవత్సరముల వయస్సు వఱకు పుత్రుని లాలించి ముద్దుపెట్టుకొనవలెను. పది సంవత్సరముల వయస్సు వచ్చువఱకు మంచివార్గమున నడిపించుటకై భయపెట్టుటకు కొట్టవలెను. పదునాఱవ సంవత్సరము వచ్చిన తరువాత పుత్రుని మిత్రునివలె సమానముగ చూడవలెను.

శ్లో || ఉపసర్గే-న్య చక్రే చ దుర్భిక్షే చ భయావహే |

 అసాధుజన సంపర్కే యః పలాయేత్‌ స జీవతి || 19

 అర్థము:- ఉపసర్గే = ఆధిదైవికములైన - అతివృష్టి అనావృష్టి మొదలైనవి, ఆధిభౌతికములైన యుద్ధాదులు సంభవించినపుడు, చ = మఱియు రోగాదులు కలిగినపుడు, అన్యచక్రే = శత్రువులు దురాక్రమణ చేసినపుడు, చ = అట్లే, భయావహే = భయానకములగు, దుర్భిక్షే = కఱువు మొదలైనవి సంభవించినపుడు, అసాధుజన సంపర్కే = దుష్టుల సంబంధమేర్పడినపుడు, యః = ఎవడు, పలాయేత్‌ = పాఱిపోవునో (వాని యందు చిక్కువడడో) నః = అి్టవాడు, జీవతి = జీవించుచున్నాడు.

 తాత్పర్యము :- అతివృష్టి అనావృష్టి మొదలగు ఆధిదైవికములగు కష్టములు, యుద్ధాదులైన ఆదిభౌతికములగు కష్టములు, కలరా, మశూచి మొదలగు నంటువ్యాధులు, శత్రువుల దురాక్రమణము, భయమును గలిగించు కఱువుకాటకములు, దుష్టుల సంపర్కము కలిగినపు డెవరు పాఱిపోవుదురో వారు జీవింతురు.

శ్లో || ధర్మార్థ కామమోక్షాణాం యస్యైకో-పి న విద్యతే |

 జన్మజన్మని మర్త్యేషు మరణం తస్య కేవలమ్‌ || 20

 అర్థము :- యస్య = ఎవనికి, ధర్మార్థ కామ మోక్షాణాం = ధర్మము, అర్థము, కామము, మోక్షము అను నాలుగు పురుషార్థములలో, ఏకో-పి = ఒక్కి కూడ, న విద్యతే = తెలియబడదో, తస్య = అి్టవానికి, జన్మ జన్మని = ప్రతిజన్మయందును, మర్త్యేషు = మరణశీలురగు మానవులలో, మరణం = మరణము, కేవలం = ఒక్కియే యుండును (లభించును).

 తాత్పర్యము :- ధర్మార్థ కామమోక్షములను నాల్గింలో నొక్కదానిని గూడ నెవ్వడెఱుగడో వాడు మనుష్యులలో మాిమాికి ప్టుివచ్చుచుండును. అతనికిసుఖముకాని ఆనందము కాని కలుగదు.

శ్లో || మూర్ఖా యత్ర న పూజ్యన్తే ధాన్యం యత్ర సుసంచితమ్‌ |

 దంపత్యోః కలహోనా-స్తితత్రశ్రీః స్వయమాగతా || 21

 అర్థము :- యత్ర = ఎక్కడ, మూర్ఖాః = మూర్ఖులు, న పూజ్యన్తే = పూజింపబడరో, యత్ర = అక్కడ, ధాన్యం = ఆహారాది ధాన్యము, సుసంచితమ్‌ = ఎక్కువగా ప్రోగుచేయబడినదో, యత్ర = ఎచ్చట, దంపత్యోః = దంపతులకు, కలహః = కలహము, నాస్తి = లేదో, తత్ర = అచ్చట, శ్రీః = సంపద, లక్ష్మి, స్వయం = తనంతటతాను, అగతా = వచ్చి నివసించును.

 తాత్పర్యము :- ఎచ్చట మూర్ఖులు పూజింపబడరో, ఎక్కడ పుష్కలముగా ధాన్యము పండునో, ఎచ్చట దంపతులకు కలహముండదో యచటకు లక్ష్మి స్వయముగా వచ్చును(ఉండును)

 వివరణము :- మూర్ఖులను పూజించుచోికి లక్ష్మిరాదు. అక్కడ వినాశము తాండవమాడును-

 అపూజ్యా యత్ర పూజ్యన్తే పూజనీయో న పూజ్యతే |

 త్రీణి తత్ర ప్రవర్తనే దుర్భిక్షం మరణం భయమ్‌ ||

(స్కంధ పురాణము-మాహేశ్వర ఖండము 3-45)

 పూజింపదగనివారిని పూజించుచు, పూజింపదగినవారిని పూజింపకుండుటయు జరుగునో యచట కఱువు, అకాలమృత్యువు, భయము స్థిరపడును. లక్ష్మి యెచ్చట నుండు ననగా పతి పత్నులు తగవులాడని చోట లక్ష్మి చెప్పినదట- 'వసామి వారీషు పతివ్రతాను' - (మహా.భార.అనుశా. 11-14) నేను పతివ్రతలగు స్త్రీలలో నుందునని

 'దంపత్యోః నమతావాస్తి యత్ర యత్ర హి మందిరే'

 అలస్మీ స్తత్ర తత్రైవ విఫలం జీవనం తయో || (బ్రహ్మపురాణ కృష్ణ - 69-64) ఏ యిిింలో దంపతులలో కలయిక యుండదో యచట దార్రిద్య్రముండి వారి జీవనము వ్యర్థమగును.

తృతీయాధ్యాయము సమాప్తము

No comments:

Post a Comment