పుష్కరాల సమయంలో ఏం చేయాలి ?
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడానికి నదిలో దిగినప్పుడు నదిని , వినాయకుణ్ణి సూర్యభగవానుణ్ణి, బ్రహ్మసరస్వతులను, లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, పుష్కరుడిని, బృహస్పతిని, ఇంద్రుడ్ని సప్తరుషులను, పంచభూతాలను, మీరు స్నానం చేస్తున్న క్షేత్రదైవాన్ని మీ ఇంి ఇలవేల్పును, మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా స్మరించి, అర్థ్యాలను సమర్పించి, కృష్ణానదికి పసుపుకుంకుమలు అర్పించాలి. దీపనీరాజనాలు సమర్పించాలి. సంకల్పపూర్వకంగా పుణ్యస్నానం ఆచరించాలి.
పుష్కరాల సమయంలో పుణ్యస్నానం ఆచరించడం అంటే భక్తిశ్రద్ధలతో సకలపాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ మూడు మునకలు వేయడం.
భార్యభర్తలైతే వేణీస్నానం చేయాలి. అంటే భార్య కొంగును భర్త కండువాకు కట్టుకుని ఇద్దరూ ఒకేసారి మునకలు వేయాలి.
భార్యాభర్తలు ఒకేసారి పుష్కరస్నానాలకు వెళ్లలేకపోయిన పక్షంలో స్త్రీలు మంగళసూత్రంపై పురుషులు హృదయంపై చేయి పెట్టుకుని స్నానం చేయాలి. ఇప్పుడు భార్యభర్తలు ఒకేసారి పుణ్యస్నానం చేసిన ఫలితం లభిస్తుంది.
సూతకం ఉన్నవారు సైతం పుష్కరస్నానం చేయవచ్చు. పుష్కరస్నానం తర్వాత నదీమతల్లిని అష్ణోత్తర శతనామాలతో అర్చించాలి.
వీలైతే బ్రాహ్మణుడి చేత పూజాక్రతువు నిర్వహించుకోవచ్చు. మీ శక్త్యానుసారం దానాదికాలు చేయాలి.
పితృదేవతలకు పిండప్రదానం చేసినటైతే పుణ్యస్నానం చేయాలి. నదీ తీరాన ఉన్న క్షేత్రదర్శనం చేయాలి.
పుష్కరాలకు రాలేకపోయిన బంధుమిత్రుల కోసం నదీజలాన్ని ఇంటికి తీసుకెళ్లాలి.
No comments:
Post a Comment