చాణక్య నీతి దర్పణము - అథపంచమోధ్యాయః
శ్లో || గురు రగ్ని ర్ద్విజాతీనాం వర్ణనాం బ్రాహ్మయో గురుః |
పతి రేవ గురుః స్త్రీణాం సర్వస్యా-భ్యాగతో గురుః ||
(బ్రహ్మపురాణము 80-70)
అర్థము :- ద్విజాతీనాం = బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు, అగ్నిః = అగ్ని, గురుః = గురువు, వర్ణానాం = బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర అను వర్ణములవారికి, బ్రాహ్మణః = బ్రాహ్మణుడు, గురుః = గురువు, స్త్రీణాం = స్త్రీలకు, పతిరేవ, భర్తయే, గురుః = గురువు, సర్వస్య = అందఱకు, అభ్యాగతః = అతిధి, గురుః = గురువు.
తాత్పర్యము :- బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులకు గురువు అగ్ని. బ్రాహ్మణాది నాలుగు వర్ణముల వారికి బ్రాహ్మణుడు గురువు. పతియే స్త్రీలకు గురువు. అందఱకు నతిథియే గురువు.
వివరణము :- వేలాది శాస్త్రములందు గురుమహిమ గానము చేయబడినది-
యో నో అగ్నే అరరివా అఘాయురరాతివా మర్చయతి ద్వయేన |
మన్త్రోగురుః పునరస్తు సో అస్మా అను మృక్షీష్ట తన్వం దురుక్తైః ||
(ఋ. 1-147-4)
ఓ జ్ఞాన స్వరూప ప్రభూ! ఇతరులు చేయు దానాది సత్కార్యముల నెవడు విఘ్నము చేయునో, స్వయముగా దానాది సత్కర్మలు చేయడో, పాపమందు నిమగ్నుడై మనస్సులో నొకి తలచి బయి కొకి చెప్పుచు మోసగించునో య్టి వానిని ఆలోచనాపరుడగు గురువు దయదలచి చెడుమార్గమునుండి మరలించి మంచి మార్గమునకు దీసికొనవలెను. అి్ట గురువుయొక్క కఠోరవచనములతో శిష్యులు తమ శరీరమును ఆత్మను ఆయన కనుకూలముగా ఆచరింపజేసి శుద్ధులు పవిత్రులు కావలెను.
తద్విజ్ఞానార్థం స గురుమేనాభి గచ్ఛేత్ |
సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మ నిష్టమ్ || (ముండక. 1-2-12)
ఆ అద్వితీయ బ్రహ్మను దెలిసికొనుటకు ముముకక్షువైనవాడు (మోక్షమును కోరువాడు) శ్రద్ధతో చేతిలో సమిధలు పట్టుకొని వేలాది సకల శాస్త్రములు తెలిసినవాడును, శాస్త్రరహ్యములను యుక్తియుక్తముగా దృష్టాంతపూర్వకముగా ప్రవచించువాడును, పరమాత్మయందు నిష్టకలవాడునగు సద్గురువును చేరవలెను.
మహర్షి దయానంద సరస్వతి తన యోగగురువుల విషయములోవ్రాసినది -నేను అహమ్మదాబాద్ దగ్గఱ దుగ్దేశ్వర మందిరములో జ్వాలానందపురి శివానందగిరి యను వారి దగ్గఱ యోగవిద్యలోని రహస్యతత్త్వముల నేర్చితిని. యోగము విషయములోనే నా యిద్దఱు సాధువులకు మిక్కిలి ఋణపడియున్నాను (ఆత్మచరిత్ర)
తన విద్యాగురువైన స్వామి నిరజానంద దండిని గూర్చి తఱచుగా తన గ్రంథములలో వ్రాసినది - 'శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యాణాం మహావిదుషాం శ్రీయుత విరజానంద సరస్వతీస్వామినాం శిష్యేణ' - ఈ శబ్దములలో గురువును గూర్చి ఆయనకున్న శ్రద్ధ వెల్లడియగుచున్నది.
సర్వస్యాభ్యాగతో గురుః :- పరివ్రాజకుడు, యతి, సంన్యాసి అను వారందరికి స్వతః సిద్ధముగా గురువులు, ఇక్కడ దరిద్రుడు, బీదవాడు, బిచ్చగాడు అను వారలు గురువులు కారు. పాపము వారు దయచూపదగినవారు. కాని అభ్యాగతుడైన సంన్యాసి దయచూపదగినవాడు కాదు. శ్రద్ధతో ఆదరింపదగినవాడు.
ఆచారహీనుడు, గుణహీనుడు, శాస్త్రజ్ఞానశూన్యుడు, మూర్ఖుడునైన వాడు గురువు పదవాచ్యుడుకాదు.
కో నా గురుర్యోహి హితోపదేష్టా (శంకరాచార్య - ప్రశ్నోత్త 87)
గురువెవడు? పరమాత్మ తత్త్వోపదేష్టయు, స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందినవాడు గురువు.
గుకారస్త్వన్థ కారః స్యాత్ రేపస్తన్య వివర్తకః |
అజ్ఞాన నివర్తకత్వాత్ గురు రిత్యభిధీయతే ||
'గు' అనగా అంధకారరూప అజ్ఞానమును 'రు' తొలగించువాడు-అజ్ఞానమును పోగొట్టువాడు గురువని చెప్పబడును.
శ్లో || యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే,
నిఘర్షణ చ్ఛేదన తాపతాడనైః |
తథా చతుర్భిః పురుషః పరీక్ష్యతే
త్యాగేన శీలేన గుణేన కర్మణాః || 2
అర్థము :- యథా = ఎట్లు, నిఘర్షణచ్ఛేదన తాపతాడనైః = ఒరవడి చేయుట, తెగగొట్టుట, కాల్చుట, సుత్తితో కొట్టుటయను, చతుర్భిః = నాలుగు క్రియలతో, కనకం = బంగారము, పరీక్ష్యతే = పరీక్షచేయుడునో, తథా = అట్లే, త్యాగేన = త్యాగము చేతను, శీలేన = శీలముతోను, గుణేన = గుణముతోను, కర్మణా = కర్మతోను అను, చతుర్భిః = నాల్గింతో, పురుషః = పురుషుడు, పరీక్ష్యతే = పరీక్షింపబడుచున్నాడు.
తాత్పర్యము :- ఒరిపిడి చేయుట, చేధించుట, కాల్చుట, సుత్తితో కొట్టు యను నాల్గువిధములుగా నెట్లు బంగారమును పరీక్షింతురో యట్లే త్యాగము (దానము) శీలము, గుణము, కర్మ అను నాల్గింతో పురుషుని పరీక్షింపవలెను.
వివరణము :- మనుష్యుడనగా దానముచేయువాడు, శీలసంపన్నుడు, శుభగుణవిభూషితుడు, శ్రేష్టమైన యాచారములు కలవాడని చాణుక్యుడనుచుండెను.
మహర్షి దయానంద సరస్వతి మనుష్యు డనగా - మననశీలుడు, తన వలె నితరుల కష్టసుఖములను, హానిలాభములను తెలిసికొనువాడు, అన్యాయకారులనుండి బలవంతుల నుండియు భయపడనివాడు, ధర్మాత్ముడైన నిర్భలుని నుండియు భయపడువాడును మనుష్యుడనెను. అంతేకాదు మఱియు సర్వసామర్థ్యముగల ధర్మాత్ములు, అనాథలు, నిర్భలులు, గుణరహితులుగా నున్న వారిని రక్షించి యున్నతి పొందువారికిగాను, ప్రియాచరుణులుగాను చేయవలెననెను. చక్రవర్తి, సనాతులు, మహాబలవంతులు, గుణవంతులైౖనను వారు అధర్మవర్తనులైనచో వారిని వశింపజేయుట తలవంపు గలుగునట్లుచేయుట, అప్రియము గలుగునట్లు చేయుటయు నావశ్యమనెను. అనగా నన్యాయకారులకు హానియు న్యాయకారులకు న్నుతి కలుగునట్లు అన్ని విధముల ప్రయత్నింపవలెను. ఈ ప్రయత్నములో దారుణమైన దుఃఖము ప్రాప్తించినను, ప్రాణహాని కలిగినను, మానవత్వరూప ధర్మము నుండి వేఱుకారాదు. (సత్యార్థ ప్రకాశము - స్వమంతన్యామంతవ్యము)
అన్ని దానములలో ప్రాణదానము మిన్న. ధర్మము, సత్యము, న్యాయము కొఱకు ప్రాణములు విడుచువాడే నిజమైన మనుష్యుడు.
'శీలం పరం భూషణమ్' మనుష్యున కన్నింకంటె గొప్ప భూషణము శీలము, శీలము లేని పురుషుడు పశువే. భర్తృహరి-
యేషాం న విద్యా న తపో న దానం
జ్ఞానం న శీలం న గుణో న ధర్మః |
తే మర్త్యలోకే భువి భారమాతాః
మనుష్య భూషేణ మృగాశ్చరన్తి || (భర్తృ. నీతి. 12)
మనుష్యులలో విద్యయు, తపస్సు, దానమునిచ్చు భావన, జ్ఞానము, శీలము, జీవితములో నుత్తమగుణము, ధర్మమునుండవో అి్టవాడు భూమికి భారమైన పశువులే. వారు మనుష్యరూపముతో సంచరింతురు.
మనుష్యుని కర్మ ద్వారానే పరీక్షింపవలెను-వేదము-
'అకర్మా దస్యు' - (ఋ. 10-22-8)
కర్మచేయని మనుష్యుడు దస్యువు (నాశనము కలిగించువాడు) దీని ఫలితార్థ మేమనగా మంచికర్మ చేయవలెను. శుభకర్మలు చేయువాడు. ఆచారవంతుడునైన మనుష్యుడు - ఆర్యుడు - శ్రేష్టమనుష్యుడు.
గుణై రుత్తుంగతాం యాతి నోచ్చైరాసన సంస్థితః |
ప్రాసాద శిఖరస్థో-సి కాకః కిం గురుతాయతే ||
మనుష్యుడు గుణముతోనే యౌన్నత్యము పొందును. ఉన్నతమైన ఆసనము మీద కూర్చుండిన మాత్రము చేతకాదు. రాజభవనము యొక్క శిఖరము మీద కూర్చుండిన మాత్రముచేత కాకి గరుడపక్షియగునా? (హంసయగునా?) ఎన్నడును కాదు.
శ్లో || తావత్ భయేషు భేతవ్యం యావద్భయమనాగతమ్ |
ఆగతం తు భయం దృష్ట్యా ప్రహర్తవ్య మశంకయా || 3
అర్థము :- భయేషు = భయము విషయములో, యావత్ = ఎప్పివఱకు, భయం = భయము, అనాగతం = రాదో, తావత్ = అప్పివఱకు, భేతవ్యం = భయపడవలెను. ఆగతం = వచ్చిన్టి, భయం = భయమును, దృష్ట్యా = చూచి, అశంకయా = జంకులేకుండ, ప్రహర్తవ్యం = దానిని దూరముగా పోగొట్టుకొను నుపాయ మాలోచింపవలెను.
తాత్పర్యము :- భయము రానంత వఱకు భయమనిన భయపడవలెను. వచ్చిన భయమును జూచి శంక జంకు విడిచి యా భయమును దూరముగా పోగొట్టు నుపాయము నాలోచింపవలెను.
వివరణము :- భయము దూరముగా నున్నంతవఱకు భయమును గూర్చి భయపడవలెను. కాని భయమునకు కారణములైన ఆపద, కష్టము మొదలైనవి వచ్చి తలపై పడుటకు సిద్ధపడునపుడు భయపడుటకు బదులుగా ఆ భయకారణములను తొలగించుకొను నుపాయ మాలోచింపవలెను. భయము సంభవించినపుడు భయభీతుడు కారాదని వేదము చెప్పుచున్నది చూడుడు-
యథా ద్యౌశ్చ పృథివీ చ న భిభీతో న రిష్యతః
ఏవా మే ప్రాణ మా భిభేః |
యథా సూర్యశ్చ చన్ద్రశ్చ న బిభీతో న రిష్యతః
ఏవా మే ప్రాణ మాబిధేః || (అథర్వ. 2-15-1, 3)
ద్యుపృథివీ లోకములు భయపడకయు, హింసింపబడకయు నుండునో, అట్లే ఓ నా ప్రాణమా! నీవును భయపడకుము. సూర్యచంద్రులెట్లు భయపడకయు, హింసింపబడకయు నుందురో అట్లే నా ప్రాణమా! నీవును భయపడకుము.
శ్లో || ఏకోదర సముద్భూతా ఏక నక్షత్ర జాతకాః |
స భవన్తి సమాః శీలే యథా బదరకంటకాః || 4
అర్థము :- ఏకోదర సముద్భూతా = ఒకే తల్లి కడుపున ప్టుిన వాడును, ఏకనక్షత్ర జాతకాః = ఒకే నక్షత్రమున బ్టుినవారును, శీలే = శీలమందు, బదరకంటకాః = రేగుముల్లు, యథా = ఎట్లు, సమాః = సమానమైనవి, న భవన్తి = కానో, యట్లే వారును సమానులుగారు.
తాత్పర్యము :- ఒకే కడుపున బ్టుిన వారుగాని, ఒకే నక్షత్రమున బ్టుినవారుగాని శీలవిషయములో సమముగా నుండరు. రేగుముండ్లు సమముగా నొకే విధముగా నుండక వంకరింకరగా నుండునో యట్లే పై జెప్పబడినవారు సమానముగా నుండరు.
వివరణము :- అందఱు సమానముగా నుండరు. వేదవాక్యము-
సమౌ చిద్దస్తా న సమం వినిష్టః సమ్మాతరా చిన్న సమం దుహతే |
యమయో శ్చిన్న సమా వీర్యాణి జ్ఞాతీ చిత్సన్తౌ న సమం పృణీతః ||
(ఋ. 10-117-9)
రెండు చేతులు సమానముగా కర్మ చేయలేవు. ఒక తల్లి కడుపున ప్టుిన రెండు దూడలు సమానముగా పాలనీయవు. కవలపిల్ల లిద్దరు సమానమైన బలశక్తులు కలవారిగా నుండరు. చుట్టఱిక మున్న్టి యిద్దఱు మనుష్యులలో నొకరివలె రెండవవాడు దానాదులచే తృప్తిపఱపలేడు
మఱొక వేదమంత్రములో అసమానతను గూర్చి బాగుగా చెప్పబడినది-
అక్షణ్వస్తః కర్ణవస్తః సఖాయో మనోజవేష్వనమా బభూవుః |
ఆదఘ్నాన ఉపకక్షాన ఉ త్వా హృదా ఇవ స్నాత్వా ఉ త్వే దదృ శే ||
(ఋ. 10-71-7)
కళ్లు, చెవులు గలిగిన స్నేహితులు జ్ఞానమునకై ప్రయత్నించు వారియొక్క మనోవేగ మొక్కిగా నుండదు. ఒకడు పుక్కిలింతలగు నీరుగల చెఱువువలెను. మఱొకరు చంకలలోతు నీరుగల చెఱువువలెను, ఇంకొకడు మునిగి స్నానము చేయుటకు తగినంత నీరుగల చెఱువువలెను విభిన్నముగా నుందురు. వేదము స్పష్టశబ్దములతోను, ఉదాహరణములతోను మనుష్యులలోని యసమానతను వర్ణించెను. పై శ్లోకము వేదము యొక్క యొక యంగమునకు ఛాయానువాదము మాత్రమే.
శ్లో || నిఃస్పృహోనా-ధికారీ స్యా న్నా కామీ మండనప్రియః |
నా-విదగ్ధః ప్రియం బ్రూయాత్ స్ఫుటవక్తా న వంచకః || 5
అర్థము :- అధికారీ = అధికారియైనవాడు, నిఃస్ప్పహః = కోరికలు లేనివాడు, లోభికానివాడు, న స్యాత్ = కాలేడు, అనగా అధికారము కలవాడు లోభగుణము లేనివాడగుట కష్టము, మండవప్రియః = శృంగారమును ప్రేమించువాడు, అకామీ = కోరికలు లేనివాడు (కామము లేనివాడు) త = కాడు, అవిదగ్ధః = విద్వాంసుడు కానివాడు, ప్రియం = ప్రియమైన, మధురమైన వచనమును, న బ్రూయాత్ = పలుకలేడు, స్ఫుటవక్తా = స్పష్టముగా చెప్పువాడు, పంచకః = మోసగాడు, న = కాలేడు.
తాత్పర్యము :- అధికారము గలవాడు, కోరికలులేనివాడు, లోభిగుణము లేనివాడుగా నుండడు. అనగా అధికారము కలిగియున్నవాడు లోభములేనివాడుగా నుండుట కఠినము. శృంగారప్రియుడు కామము లేనివాడుగా నుండడు. చాతుర్యము (నేర్పు) లేనివాడు విద్వాంసుడు కానివాడు ప్రియము, మధురమునగు వచనముల మ్లాడలేడు. అట్లే స్పష్టముగా చెప్పువాడు మోసగాడు కాదు.
ఈ శ్లోకమున కర్థము క్రింది విధముగా కూడ చెప్పవచ్చును-
కోరికలు లేనివాడు, లోభగుణము లేని మనుష్యుడు అధికారిగా నుండదలపడు. కామము లేనివాడు శృంగారప్రియుడు కాలేడు. మూర్ఖుడు ప్రియముగా మ్లాడలేడు. వంచకుడు స్పష్టముగా మ్లాడలేడు.
శ్లో || మూర్ఖాణాం పండితా ద్వేష్యాః అధనానాః మహాధనాః |
వారా-జ్ఞనాః కులస్త్రీణాం సుభగానాం చ దుర్భగాః || 6
అర్థము :- మూర్ఖాణాం = మూర్ఖులకు, పండితాః = విద్వాంసులును, అధనానాం = ధనములేని దరిద్రులకు, మహాధనాః = మిక్కిలి ధనవంతులును, కులస్త్రీణాం = కాపురము చేయు మంచి కులముమందలి స్త్రీలకు, వారంగనాః = వేశ్యలును, సుభగానాం = సౌభాగ్యస్త్రీలకు (పతికలవారికి), దుర్భగాః = విధవలును లేక దుర్భగాః = అందవిహీనులు, సుభగానాం = సుందరపురుషులకును, ద్వేష్యాః = శత్రువులు (ద్వేషింపదగినవారు)
శ్లో || ఆలస్యోపహతా విద్యా పరహప్తగతాః స్త్రియః |
అల్పబీజం హతం క్షేత్రం హతంసైన్యమనాయకమ్ || 7
అర్థము :- విద్యా = విద్య, అలస్యోపహతా = సోమరితనముతో నష్టమగును, పరహస్తగతాః = ఇతరుల చేతులలో జిక్కిన, స్త్రియః = స్త్రీలును నష్టపోదురు, అల్పబీజం = కొంచెముగా విత్తనములు చల్లబడిన, క్షేత్రం = పొలము, హతం = నష్టమగును, అనాయకం = నాయకుడులేన్టి, సైన్యం = సైన్యము, హతం = నశించును.
తాత్పర్యము :- విద్య సోమరితనముచే నశించును. భర్తను విడిచి ఇతరుల చేతులలో బడిన స్త్రీలు చెడిపోవుదురు. తక్కువ విత్తనముగల పొలము నశించును. నాయకుడు లేని సైన్యము నశించును.
వివరణము :- ఇతరులను జేరిన స్త్రీ నష్టపోవును-
పరహస్తా గతా నారీ లేఖినీ చైవ పుస్తకమ్ |
నపున రాయాన్త్యాబిన్తి చేద్ భ్రష్టా ముష్టా చుంబితాః ||
ఇతరుల చేతిలో బిడ్డ స్త్రీ, కలము, పుస్తకము తిరిగిరావు. ఒకవేళ వచ్చినను కలము చెడిపోయి (విఱిగిపోయి - చ్లిపోయి) పుస్తకము చినిగిపోయి, స్త్రీ ముద్దులు వగైరాలు పొంది దూషితయైచేరును.
నాయకుడు లేని సేన మరణించును.
అనాయకా వినశ్యన్తి నశ్యన్తి బహునాయకాః |
స్త్రీ నాయకా వినశ్యన్తి నశ్యన్తి బాలనాయకాః ||
సేనాపతి లేని సేన నష్టమగును. నాయకులెక్కువున్నను నష్టపోవును. స్త్రీ నాయకురాలైనను బాలకుడు (మూర్ఖుడు) నాయకత్వము వహించినను నష్టము వాిల్లును.
శ్లో || అభ్యాసాద్ధార్యతే విద్యా కులం శీలేన ధార్యతే |
గుణేన జ్ఞాయతేత్వార్యః కోపో నేత్రేణ గమ్యతే || 8
అర్థము :- అభ్యాసాత్ = నిరంతరాభ్యాసమువలన, విద్యా = విద్య, భార్యతే = ప్రాప్తించును, కులం = కులము, శీలేన = ఉత్తమగుణకర్మ స్వభావముతో
, ధార్యతే = స్థిరముగా నుండును, ఆర్యఃతు = శ్రేష్టపురుషుడైతే, గుణేన = గుణముద్వారా, జ్ఞాయతే = తెలియబడుచున్నాడు, కోపః = కోపము, నేత్రేణ = కింద్వారా, గమ్యతే = తెలియబడుచున్నది.
తాత్పర్యము :- నిరంతరాభ్యాసమువలన విద్య ధారణచేయబడును. శీలము అనగా గుణకర్మ స్వభావముచే కులము స్థిరమైనదగును. మనుష్యుడు మంచిగుణముల ద్వారా ఆర్యుడగును. కోపము కింద్వారా తెలియబడును.
వివరణము :- అభ్యాస మననేమి? (చరకుడు)
భావాభ్యసన మఖ్యాసః శీలనం సతతక్రియా ||
ఏదైన భావము నెల్లపుడు సేవించుటయే అభ్యాసము. దీనినే శీలనము, సతతక్రియ యనియు నందురు.
సౌనః పున్యేన కరణమభ్యాస ఇతి కథ్యతే |
పురుషార్థం న ఏవేహ తేనాస్తిన వినాగతిః || (యో.నిర్యా.ఉ.67-43)
మాిమాికి నే కార్యము చేయుదురో యది యభ్యాసము. దాని పేరే పురుషార్థము. అది లేనిది నడక సాగదు.
ఆజ్ఞో-పి తజ్ఞతామేతి శనైః శైలో-పి చూర్ణ్యతే |
బాణో-ప్యేతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృమ్రితమ్ ||
(యోగవా.నిర్యా.ఉత్త.67-26)
అభ్యాసము యొక్క చమత్కారము చూడుడు. దీనివలన అజ్ఞాని జ్ఞానియగును. పర్వతము కూడ మెల్లమెల్లగా చూర్ణ్యమగును. బాణము కూడ అత్యంత సూక్ష్మమైన లక్ష్యమును భేదింపగలుగును.
దుఃసాధ్యాః సిద్ధిమాయాన్తి రిపవో యాన్తి మిత్రతామ్ |
విషాణ్యమృతతాం యాన్తి నన్తతాభ్యాస యోగతః ||
(యో.వా.ని.ఉ.67-33)
నిరంతరాభ్యాసముతో దుఃసాధ్యములుకూడ సాధ్యములగును. శత్రువులు మిత్రులగుదురు. విషము అమృతముగా పరిణమించును.
ఆర్యుడు గుణములచే గుర్తింపబడును. ఎవని నార్యుడందురు?-
న వైరముద్దీపయతి ప్రశాంతం న దర్పమారోహతి నాస్తమేతి |
న దుర్గతో-స్మీతి కరోత్యకార్యం తమార్యశీలం పరమాహు రార్యాః ||
(భార. ఉద్యో.33-117)
వైరమను నగ్నిని ప్రకోపింపజేయక శాంతముగా నుండువాడును, గర్వము (దురభిమానము) లేనివాడును, హీనత్వమును కనబఱపనివాడు, నేను ఆపదలో చిక్కుకొింనని నీచకార్యములు చేయనివాడును, ఇి్ట శ్రేష్ఠగుణములు గలవానిని ఆర్యుడందురు.
న స్వసుఖే వై కురుతే ప్రహర్షం చాన్యస్య దుఃఖే భవతి విషాదీ |
దత్త్వా న పశ్చాత్ కురుతే-నుతాపం స కథ్యతే సత్పురుషార్యశీలః ||
(భార. ఉ. 33-113)
తన సుఖముతోనే ప్రసన్నుడు కాకయు, ఇతరులు దుఃఖించుట జూచి దుఃఖపడువాడును, దానము చేసి తరువాత పశ్చాత్తాపము పొందనివాడును సజ్జనులలో ఆర్యుడనబడును.
శ్లో || విత్తేన రక్ష్యతే ధర్మో విద్యా యోగేన రక్ష్యతే |
మృదునా రక్ష్యతే భూపః సత్క్రియారక్ష్యతే గృహమ్ || 9
అర్థము :- ధర్మః = ధర్మము, విత్తేన = ధనముతో, రక్ష్యతే = రక్షింపబడుచున్నది, విద్యా = విద్య, యోగేన = యమనియమాది యోగముల ద్వారా, రక్ష్యతే = రక్షింపబడుచున్నది, భూపః = రాజు, మృదునా = కోమలత్వముతో మాధుర్యముతో, రక్ష్యతే = రక్షింపబడుచున్నాడు, గృహం = గృహము, సత్‌స్త్రియా = మంచి స్త్రీతో, రక్ష్యతే =రక్షింపబడుచున్నది.
తాత్పర్యము :- ధనముతో ధర్మము రక్షింపబడును, యమనియమాది యోగము ద్వారా విద్య రక్షింపబడును. కోమలతతో, మధురతతో రాజు రక్షింపబడును. సాధ్వియైన స్త్రీచేత గృహము రక్షింపబడును.
వివరణము :- ధనములేకుండ ధర్మకార్యము నిర్వహింపబడజాలదు. చాణక్యుడు మఱొకచోట-
సుఖస్య మూలం ధర్మః - ధర్మస్య మూలమర్థ ః |
(చాణక్య సూత్రములు - 1-2)
సుఖమునకు కారణము ధర్మము, ధర్మమునకు కారణము ధనము. ధర్మముచే ధనము ప్రాప్తించును. మఱొక రిట్లు చెప్పిరి-
ధర్మాదర్థః ప్రభవతి ధర్మాత్ప్రభవతే సుఖమ్ |
ధర్మేణ లభతే సర్వం ధర్మసార మిదం జగత్ ||
ధర్మముచే ధనము ప్రాప్తించును. ధర్మముచే సుఖము కలుగును. ధర్మముచే సమస్తము చేకూరును. ఈ ప్రపంచమంతయు ధర్మముయొక్క సారమే.
వ్యాసమహర్షి-
ఊర్ధ్వబాహు విరౌమ్యష న చ కశ్చి చ్ఛృణోతి మే |
ధర్మాదర్థశ్చ కామశ్చ న కిమర్థం న సేవ్యతే || (భార. స్వర్గా. 5-62)
నేను రెండు చేతులు పైకెత్తి పిలిచిపిలిచి చెప్పుచున్నాను. కాని నామాట నెవడును వినుటలేదు. ధర్మము వలన మోక్షము లభించును. అర్థము కామము సిద్ధించును. కాని లోకులు ధర్మమును సేవించుటలేదు.
సద్గుణవతియగు స్త్రీచే గృహము రక్షింపబడును-
భార్యామూలం గృహస్థన్య భార్యా మూలం సుఖన్య చ |
భార్యా ధర్మ ఫలవాప్త్యం భార్య సంతాన హేతవే ||
శ్రేష్ఠస్త్రీ గృహమునకు మూలము. భార్యయే సుఖమునకు కారణము. భార్య వలన ధర్మఫలము సంప్రాప్తించును. భార్యవలననే సంతానప్రాప్తియుకలుగును.
స్త్రీలే గృహమును రక్షించువారు. ఇందువలన మనుమహర్షి స్త్రీలకుపదేశించెను-
సదా ప్రహృష్టయా భావ్యం గృహకార్యేషు దక్షయా |
సుసంస్కృతో వస్కరయా వ్యయే చాముక్తహస్తయా || (మను.5-157)
స్త్రీ లెల్లపుడు సుప్రసన్నలుగా నుండవలెను. గృహకార్యములను చాకచక్యముతో నిర్వహించునదిగా నుండవలెను. ఇంిలోని వస్తువులను శుభ్రముగాజేసి, గృహపరిసర ప్రదేశముల పరిశుభ్రముగా నుంచవలెను. అనావశ్యకములగు ఖర్చులను చేయకుండ నుండవలెను.
శ్లో || అన్యథా వేదపాండిత్యం శాస్త్రమాచార మన్యథా |
అన్యథా కువచః శాన్తం లోకాః క్లిశ్యన్తి చాన్యథా || 10
అర్థము :- వేదపాండిత్యం = వేదమునందలి విద్వత్తును, అన్యథా = వ్యర్థముగా జెప్పువాడు, నిందించువాడును, శాస్త్రమాచారం = శాస్త్రమును శ్రేష్టమగు నాచారములను, అన్యథా = వ్యర్థముగా జెప్పి ఆ విషయములో వివాదము చేయువాడును, శాంతం = శాంతపురుషునిగూర్చి, అన్యథా = వ్యర్థముగానే, కువచః = చెడ్డమాటలు చెప్పువారిని, మోసపుమాటలు మూర్ఖవచనములు పలుకున్టి, లోకాః = ప్రజలు, అన్యథా చ = వ్యర్థముగానే, క్లీశ్యన్తి = కష్టములపాలై దుఃఖపడుదురు. అనగా న్టివారు ఆ వస్తువులనుగాని, ఆ మనుష్యులనుగాని కొంచెముకూడ చెడగొట్టలేరు.
తాత్పర్యము :- వేదపాండిత్యము వ్యర్థమని చెప్పువారు, శాస్త్రము, శ్రేష్టాచారములు పనికిరావని చెప్పుచు వివాదము చేయువారు, శాంతపురుషుని గూర్చి మోసగాడని, మూర్ఖుడని, చెడుగా మ్లాడువారు వ్యర్థముగానే కష్టముల పాలగుదురు. అనగా వస్తువులోని గుణమును, మనుష్యులలోని స్వభావమును కొంచెము కూడ చెడగొట్టలేరు. సరికదా తామే కష్టముల పాలగుదురు.
శ్లో || దారిద్య్ర నాశనం దానం శీలం దుర్గతినాశనమ్ |
అజ్ఞాన నాశినీ ప్రజ్ఞా భావనా భయనాశినీ || 11
అర్థము :- దానం = దానము, దారిద్య్రనాశనం = దారిద్య్రమును బోగొట్టును, శీలం = ఉత్తమగుణకర్మస్వభావము, దుర్గతి నాశనం = దౌర్భాగ్యమును నశింపజేయును, ప్రజ్ఞా = బుద్ధి, అజ్ఞాననాశినీ = అజ్ఞానమును నాశముచేయును, భావనా = నిష్ట, ఈశ్వరభక్తి., భయనాశినీ = భయమును పోగొట్టును.
తాత్పర్యము :- దానము దారిద్య్రమును పోగొట్టును. శీలము అనగా ఉత్తమ గుణకర్మ స్వభావములు దుర్గతిని కష్టములను, దౌర్భాగ్యమును పోగొట్టును. బుద్ధి అజ్ఞానమును బోగొట్టును. నిష్ట ఈశ్వరభక్తి భయమును నశింపజేయును.
వివరణము :- దానము వలన దారిద్య్రము పోవును.
ధనం లభతే దానేన మౌనే నాజ్ఞాం విశామ్పతే |
ఉపభోగాంశ్చ తపసా బ్రహ్మచర్యేణ జీవితమ్ || (భార. అను.7-14)
ఓ రాజా! దానముచేత ధనము, మౌనముతో ఇతరులను అజ్ఞను పరిపాలించువారినిగా జేయు శక్తి, తపస్సుచేత నానా ప్రకారములగు ఉపభోగములు, బ్రహ్మచర్యపాలనము వలన దీర్ఘాయువు ప్రాప్తించును. ఈశ్వరభక్తి భయమును నశింపజేయును. పరమాత్ముని యొడిలో నున్న వానికి భయమెక్కడిది?వేదము-
యన్య ఛాయా-మృతం యన్య మృత్యుః || (యజు.25-13)
పరమాత్ముని ఆశ్రయము పొందుట యన భక్తి కలిగియుండుటయే, అదియే అమృతమునకు (చావు లేమికి) కారణము.
దయానందమహర్షి ఉపాసనాఫలము నిట్లు చెప్పెను-
'ఉపాసన వలన ఆత్మబలము అధికమగును. ఉపాసకుడు పర్వతముతో సమానమైన దుఃఖము ప్రాప్తించినను గాభరాపడక యంతిని సహింపగలిగియుండును' (సత్యా. ప్ర. 7 సము)
శ్లో || నా-స్తి కామసమో వ్యాధి ర్నా-స్తి మోహ సమో రిపుః |
నా-స్తి కోపసమో వహ్నిర్నా-స్తి జ్ఞానాత్ పరం సుఖమ్ || 12
అర్థము :- కామ సమః = కామముతో సమానమైన, వ్యాధిః = వ్యాధి, న = లేదు, మోహనమః = మోహముతో సమానమైన, రిపుః = శత్రువు, నాస్తి = లేడు, కోపనమః = కోపముతో సమానమైన, వహ్నిః = అగ్ని, నాస్తి = లేదు, జ్ఞానాత్ = ఆత్మజ్ఞానము కంటె, పరం = మించిన, సుఖమ్ = సుఖము, నాస్తి = లేదు.
తాత్పర్యము :- కామముతో సమానమైన వ్యాధి మఱొకిలేదు. మోహముతో సమానుడైన శత్రువు మఱొకడు లేడు. కోపముతో సమానమైనది మఱొక యగ్ని లేదు. ఆత్మజ్ఞానమునకు మించిన సుఖ మింకొకి లేదు.
వివరణము :- కామముతో సమానమైన వ్యాధి మఱొకి లేదని యొక కవి-
దివా పశ్యతి నోలూకః కాకో నక్తం న పశ్యతి |
అపూర్వః కో-పి కామాన్ధో దివాసక్తం న పశ్యతి ||
గుడ్లగూబ పగలు చూడలేదు. కాకి రాత్రి చూడలేదు. కామాంధుడైనవాడు రాత్రింబవళ్లు చూడలేని యొక విచిత్రజంతువు.
అయం చ సురతజ్వాలః కామాగ్నిః ప్రణయేద్ధనః |
సరాణాం యత్ర హూయన్తే యౌవనాని ధనాని చ || (మృచ్ఛ - 4-11)
ప్రేమ దేనికి ఇంధనమో (కట్టె), సంభోగము దేనికి జ్వాల (మంట) యో అి్ట కామరూపాగ్ని మండుచుండును. ఆ అగ్నిలో మనుష్యుడు తన యౌవనమును ఆహుతిగా నొనర్చును.
మమ మాతా మమ పితా మమేయం గృహిణీ గృహమ్ |
ఏతదన్యం మమత్వం యత్ స మోహ ఇతి కీర్తితః || (పద్మ.పు)
నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా యిల్లు - ఇట్లే యన్నియు నావి నావి యనుకొనుటయే మోహము. మోహ మనగా బుద్ధినాశమే. ఈ మోహము ధర్మమును, అర్థమును రిెంని నష్టపఱచును. ఇందువలన మనుష్యునిలో నాస్తిక్యము కలిగి దురాచారపరుడగుచున్నాడు.
క్రోధో నాశయతే ధైర్యం క్రోధో నాశయతే శ్రుతమ్ |
క్రోధో నాశయతే సర్వం వాస్తి క్రోధ నమో రిపుః ||
క్రోధము, ధైర్యమును, శాస్త్రజ్ఞానమును, సర్వమును నశింపజేయును. కావున క్రోధముతో సమానుడైన శత్రువు లేడు.
ఆత్మజ్ఞానమునకు మించిన సుఖము లేదు-
ఆత్మజ్ఞానం పరం జ్ఞానమ్ (భార.శాం.392-12)
ఆత్మజ్ఞాన మన్నికంటె గొప్ప జ్ఞానము.
వేద మిట్లు చెప్పుచున్నది-
యస్మిన్ సర్వాణి భూతా న్యాత్మైవా భూ ద్విజానతః |
తత్ర కో మోహః కః శోకః ఏకత్వమను పశ్యతః || (యజు. 40-7)
సమస్త పదార్థములందు ఓతప్రోత (విడదీయుటకు వీలు లేని పడుగు పేకవలె) మై లోపల బయట వ్యాపకుడైయున్న పరమాత్మను దర్శించు ఆత్మజ్ఞానియైన యుపాసకునకు మోహ శోకములుండవు.
శ్లో || జన్మ మృత్యూహియాత్యేకోభునక్త్యేకః శుభా-శుభమ్ |
నరకేషుః పతత్యేక ఏకో యాతి పరాం గతిమ్ || 13
అర్థము :- మనుష్యుడు - ఏకః హి = ఒక్కడే (ఒంటరిగానే) జన్మమృత్యూ = జన్మమును, మృత్యువును, యాతి = పొందుచున్నాడు, ఏకః = ఒక్కడే, శుభాశుభం = శుభాశుభములను (పాపపుణ్యములను) భునక్తి = అనుభవించుచున్నాడు, ఏకః = ఒక్కడే, పరాంగతిమ్ = మోక్షమునకు, యాతి = వెళ్లుచున్నాడు, పొందుచున్నాడు.
తాత్పర్యము :- మనుష్యులలో నొకడు జన్మమరణములను, మఱొకడు పాపపుణ్యములను, ఇంకొకడు కష్టపరంపరలను (దుఃఖములను) మఱియొకడు మోక్షమును అను వానిని ఎవరికి వారే యనుభవింతురు కాని వారి కెవ్వరును తోడుండరు.
వివరణము :- మనుష్యుడు కర్మఫల మనుభవించి తీఱవలెను. వేదము-
న కిల్బిషమత్ర నాధారో అస్తి న యన్మిత్రైః సమనుమాన ఏతి |
అనూనం పాత్రం నిహితం న ఏతత్ పక్తారం పక్వః పునరావిశాతి
(అథర్వం. 12-3-48)
న్యాయకారియైన పరమేశ్వరుని న్యా వ్యవస్థలో నే దోషమునుండదు. ఏ యాధారమునుండదు. ఏ గురుబోధ యుండదు. ఏ మిత్రుల సాయమునుండదు. మనము చేసిన కర్మలకు తగిన ఫలము సంభవించును. దానిని తగ్గించుటకు హెచ్చించుటకు నెవ్వరికిని సాధ్యముకాదు. మనము పాత్రలలో తయారుచేసికొనిన యన్న మెట్లు భోగింపనగునో యట్లే చేసిన కర్మఫలము లనుభవింపబడుటకు సిద్ధముగా నుండును.
శ్లో || తృణం బ్రహ్మవిదః స్వర్గస్తృణం శూరస్య జీవితమ్ |
జితా-క్షస్య తృణం నారీనిఃస్పృహస్య తృణం జగత్ || 14
అర్థము :- బ్రహ్మవిదః = బ్రహ్మజ్ఞానికి, స్వర్గః = స్వర్గము, తృణం = గడ్డిపఱకతో సమానము, శూరస్య = శౌర్యవంతునకు, జీవితం = జీవనము, తృణం = గడ్డిపఱకతో సమానము, జితాక్షస్య = ఇంద్రియములు జయించినవారికి, నారీ = స్త్రీ, తృణం = తృణప్రాయము, నిఃస్పృహస్య = కోరికలు లేనివానికి, జగత్ = ప్రపంచము, తృణం = గడ్డితో సమానము.
తాత్పర్యము :- బ్రహ్మజ్ఞానులకు స్వర్గము (సుఖము), శూరవీరునకు జీవితము, జితేంద్రియునకు స్త్రీ, కోరికలు లేని వానికి ప్రపంచము, తృణప్రాయముగా నుండును. అనగా తుచ్ఛముగా భావింతురు.
శ్లో || విద్యా మిత్రం ప్రవానేషు భార్య మిత్రం గృహేషు చ |
వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ || 15
అర్థము :- ప్రవాసేషు = విదేశములందు, విద్యా = విద్య, మిత్రం = స్నేహితుడు, చ = మఱియు, గృహేషు = గృహములందు, భార్యా = భార్య, మిత్రం = స్నేహితురాలు, వ్యాధితస్య = రోగము వచ్చినవానికి, ఔషధం = ఔషధము, మిత్రం = స్నేహితుడు, చ = మఱియు, మృతస్య = చచ్చినవానికి, ధర్మః = ధర్మము, మిత్రం = మిత్రము.
తాత్పర్యము :- విదేశములో నున్నపుడు విద్యయు, గృహములందున్నపుడు భార్యయు, రోగికి ఔషధము, మరణించినవానికి ధర్మము మనుషునకు మిత్రముగా నుండును.
వివరణము :- ప్రవాసములో నున్నపుడు మనుష్యునకు విద్యసత్యమైన మిత్రము-
కామధేనుగుణా విద్యా హ్యకాలే ఫలదాయినీ |
ప్రవాసే మాతృ సదృశీ విద్యా గుప్తం ధనం స్మృతమ్ ||
విద్య కామధేనువుతో సమానమైన గుణములు గలది. సమయము కాని సమయమందును ఫలము నిచ్చును. ప్రవాసములో నున్నపుడు తల్లివలె మేలుచేయును. విద్య దాచబడిన ధనము వింది. ఇంిలో స్త్రీ మిత్రము-
అర్థం భార్యా మనుష్యన్య భార్యా శ్రేష్ఠతమః సఖా |
భార్యా మూలం త్రివర్గస్య భార్యా మూలం తరిష్యతః ||
(భార. ఆది. 74-41)
భార్య పురుషునకు సగము శరీరము, భార్య పురుషునకు సర్వశ్రేష్ట మిత్రము. ధర్మార్థకామములకు భార్య మూలము. అట్లే యీ సంసారసాగరము తరింపజేయుటకు సాధనము భార్య.
సఖాయః స్రవివిక్తేషు భవన్త్యేతాః ప్రియంవదాః |
పితరో ధర్మకార్యేషు భవన్త్యార్తన్య మాతరః || (భార.ఆది. 74-73)
భార్య యేకాంత ప్రదేశమున ప్రియవచనములు చెప్పు మిత్రుని విందనియు, ధర్మకార్యములు చేయునపుడు తండ్రివలె మేలు కోరు న్టిదియు, సంకటకాలమందు తల్లివలె దుఃఖముల బోగొట్టునదియు నగును. చచ్చినవానికి మిత్రునివింది ధర్మము-
ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే
భార్యా గృహద్వారి సఖా శ్మశానే |
దేహశ్చితాయాం పరలోక మార్గే
ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః ||
జీవితమంతయు సంపాదించిన ధనము భూమి మీదను, పెంచిన పశువులు గోశాలలోను, భార్య యిిిం ద్వారమునందును, బంధుబాంధవులు స్నేహితులు శ్మశానము వఱకు వెంట నుందురు. మిక్కిలి ప్రీతితో చూచుకొన్న తన శరీరము భస్మమగు వఱకు నుండును. పరజన్మకు పోవునపుడు జీవునివలె వచ్చునని శుభాశుభకర్మలు మాత్రమే తక్కిన నేవియు రావు.
నా పుత్ర హి సహాయార్థం పితా మాతా తిష్ఠతః |
న పుత్ర దారా న జ్ఞాతి ద్ధర్మస్తిష్ఠతి కేవలః || (మనువు. 4-239)
పరలోకమున తల్లిదండ్రులు, పుత్రులు, భార్య, బంధుబాంధవులు మొదలగు వారెవ్వరు సాయపడరు. అక్కడ ధర్మమును మాత్రమే వెంటనుండి సాయపడును.
మృతం శరీర ముత్సృజ్య కాష్ఠలోష్ఠ సమం క్షితౌ |
విముఖా బాంధవా యాన్తి ధర్మస్త మను గచ్ఛతి || (మను. 4-241)
బంధు బాంధవులు నిర్జీవమైన శరీరమును (శవమును) కట్టెలు, మ్టిగడ్డలతో సమానముగా భూమిమీద విడిచి తమ యిండ్లకు తిరిగి పోవుదురు. అతడు చేసిన ధర్మమొక్కటే యతని వెంటనుండును.
శ్లో || వృథా వృష్టిః సముద్రేషు తృప్తేషు భోజనమ్ |
వృథా దానం ధనాధ్యేషు వృథా దీపో దివా-పిచ || 16
అర్థము :- సముద్రేషు = సముద్రములందు, వృష్టిః = వర్షము, వృథా = వ్యర్థము, తృప్తేషు = భోజనముతో తృప్తి పొందినవారికి, భోజనం = భోజనము, వృథా = వ్యర్థము, ధనాధ్యేషు = ధనవంతులకు, , దానం = దానము చేయుట, వృథా = వ్యర్థము, చ = మఱియు, దివా = పగలు, దీపః పి = దీపము కూడ, వృథా = వ్యర్థము.
తాత్పర్యము :- సముద్రములందు వర్షించుటయు, ఆకలి లేక తృప్తి పొందినవారికి భోజనము, ధనవంతులకు దానమిచ్చుట, పగలు దీపము వెలిగించుటయు వ్యర్థము.
వివరణము :- ధనికులకు దానమిచ్చుట వ్యర్థము-
దరిద్రాన్ భర కౌంతేయ మా ప్రయచ్ఛేశ్వర ధనమ్ |
వ్యాధిత స్యౌషధం పథ్యం నీరుజన్య కిమౌషధైః ||
(హితోపదేశము 1-15)
యుధిష్ఠిర! (ధర్మరాజా!) దరిద్రులను పోషించుము. ధనికులకు దానమీయరాదు. రోగులకు ఔషధమిచ్చుట మేలుకాని, రోగము లేని వానికౌషధము వ్యర్థము కదా!
శ్లో || నా-స్తి మేఘ సమం తోయం నా-స్తి చాత్మ సమం బలమ్ |
నా-స్తి చకక్షుః సమం తేజో నా-స్తి ధాన్య సమం ప్రియమ్ || 17
అర్థము :- మేఘసమం = మేఘ జలముతో సమానమైన, తోయం = నీరు, నాస్తి = లేదు, ఆత్మసమం = ఆత్మబలముతో సమానమైనది శరీరములోగాని పృథివిపైగాని మఱొకి, బలం = బలము, నాస్తి = లేదు, చకక్షు సమం = కన్నుతో సమానమైనది శరీరములో మఱొక, తేజః = తేజస్సు, నాస్తి = లేదు, ధాన్యసమం = అన్నముతో సమానమైనది మఱొకి, ప్రియం = ప్రియమైనది, నాస్తి = లేదు.
తాత్పర్యము :- మేఘ జలముతో సమానమైన శుద్ధజలము లేదు. ఆత్మ బలముతో సమానమైన బలము శరీరములో కాని పృథివిలో కాని రెండవది లేదు. కన్నుతో సమానమైన తేజస్సు గల యింద్రియము శరీరములో మఱొకి లేదు. ధాన్యముతో (అన్నముతో) సమానమైన వస్తువు మఱొకి లేదు.
వివరణము :- మేఘజలముతో సమానమైన శుద్ధ జలము వేఱొకి లేదు. మేఘములోని జలము భూమిలోని ఆవిరితో తయారగును. ఆవిరితో తయారైన జలమును ఇంగ్లీషులో 'డిస్టిల్డ్ వాటర్' అందురు. మేఘములో జరుగు నీ క్రియ మనుష్యుల వలన జరుగునది కాక ప్రాకృతికముగా జరుగునదే. అందుచేత మేఘజలము పృథివీజలముతో కలియక గుణము కలదియు పవిత్రమైనదియు నగును. మేఘముల ద్వారా పై నుండి పడుటచే నే పాత్రలోను పడనిదగుటచే పాత్రలకు సంబంధించిన దోషము లేక పవిత్రమైన సర్వశ్రేష్ఠముగా నుండును.
శ్లో || అధనా ధనమిచ్ఛన్తి నాచం చైవ చతుష్పదాః |
రీమానవాః స్వర్గమిచ్ఛన్తి మోక్ష మిచ్ఛన్తి దేవతాః || 18
అర్థము :- అధవాః = ధనములేనివారు, ధనం = ధనమును, ఇచ్ఛన్తి = కోరుచున్నారు, చతుష్పదాః = నాలుగుకాళ్ల జంతువులు, చ = కూడ, వాచం = వాక్కునే, ఇచ్ఛన్తి = కోరుచున్నవి, మానవాః = మనుష్యులు, స్వర్గం = సుఖమును, ఇచ్ఛన్తి = కోరుచున్నారు, దేవతాః = పండితులు, జ్ఞానులు, మోక్షం = మోక్షమును, (జన్మరాహిత్యమును) ఇచ్ఛన్తి = కోరుచున్నారు.
తాత్పర్యము :- ధనహీనులు ధనమును కోరుచుందురు. నాలుగు కాళ్ల పశువులు వాక్కును (మ్లాడవలెనని) కోరుచున్నవి. మానవులు స్వర్గమును (సుఖమును) కోరుచుందురు. దేవతలు (విద్వాంసులు) మోక్షమును కోరుచున్నారు.
శ్లో || సత్యేన ధార్యతే పృథ్వీ సత్యేన తపతే రవిః |
సత్యేన యాతి నాయుశ్చ సర్వం సత్యే ప్రతిష్టితమ్ || 19
అర్థము :- సత్యేన = సత్యముతో, పృథ్వీ = పృథివి, ధార్యతే = ధరింపబడుచున్నది, స్థిరముగానున్నది, రవిః = సూర్యుడు, సత్యేన = సత్యముతో, తపతే = తపించుచున్నాడు, సత్యేన = సత్యముతో, వాయుః చ= గాలి కూడ, వాతి = వీచుచున్నది, సర్వం = సమస్తము, సత్యే = సత్యమందే, ప్రతిష్ఠితమ్ = స్థిరముగా నున్నది.
తాత్పర్యము :- సత్యము వలన పృథివి స్థిరముగా నున్నది. సూర్యుడు సత్య బలముతో తపించుచున్నాడు. సత్యము వలన వాయువు వీచుచున్నది. సమస్తము సత్యమందే స్థిరమైయున్నది.
వివరణము :- పృథివి సత్యము యొక్క ఆధారముతో నిలిచి యున్నది. వేదము-
సత్యేనోత్త భితా భూమిః (ఋ. 10-85-1)
భూమి సత్యముపై నాధారపడి స్థిరముగా నున్నది.
వేదములో మఱొకచోట పృథివి యెనిమిది స్తంభములపై నిలిచియున్నదని చెప్పబడినది. ఆ యెనిమిది స్తంభములలో సత్యమొకి-
సత్యం బృహదృత ముగ్రం దీక్షా తపో
బ్రహ్మ యజ్ఞః పృథివీం ధారయన్తి (అథ. 12-1-1)
సత్యము, విశాలత, నియమము (వ్యవస్థ) ఉగ్రత (తేజస్విత) దీక్ష, తపము, బ్రహ్మ (జ్ఞానము) యజ్ఞము (పరోపకారము) కలాకౌశలము, ఉద్యోగమునకు ఏర్పాటు - ఈ యెనిమిది పృథివిని ధరించు స్తంభములు.
మఱొక శ్లోకము చూడుము-
గోభిర్వి ప్రైశ్చ వేదైశ్చ సతీభిర్సత్య వాధిభిః |
అలుదీద్ధైర్దాన శీతైశ్చ సప్తభిర్ధార్య తే మహీ || (స్కంధ. మా. కు. 2-71)
ఆవు, బ్రాహ్మణుడు, వేదము, పతివ్రత, సత్యవాది, లోభికానివాడు, దానశీలుడు, శూరవీరుడు నను ఏడుగురిపై పృథివి స్థిరపడియున్నది. ఇక్కడ సత్యవాదులను పృథివి ధారకులుగా నంగీకరించెను.
సత్యము యొక్క మహిమ గొప్పది-
సత్యమే వేశ్వరో లోకే సత్యే ధర్మః సదాశ్రితః |
సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్ ||
(వాల్మీ. రా. అయో. 109-13)
ప్రపంచములో సత్యమే యీశ్వరుడు, ఎల్లపుడు ధర్మము సత్యముపై నాధారపడియుండును. సత్యమే సర్వమునకు మూలము. సత్యమును మించిన శ్రేష్టమైన పదము మఱొకి లేదు. సత్యమనగా పరమేశ్వరుడనియు నర్థము కలదు. పరమేశ్వరుడను నర్థము తీసికొన్నచో చాణక్యుడు పైన వ్రాసిన శ్లోకమున కర్థము సరిపోవును. పరమేశ్వరుడు పృథివిని ధరించెను. ఆతని ప్రతాపము వలన సూర్యుడు ప్రకాశించుచున్నాడు. అతని వలన భయము వలన వాయువు వీచును. సమస్తము పరమేశ్వరుని వలననే స్థితమైయున్నది.
ఉపనిషత్తులలో-
భయాదస్యాగ్నిస్తవతి భయాశ్చ తపతి సూర్యః |
భయాదిన్ద్రశ్చ వాయ శ్చ మృత్యుర్థావతి పంచమ || (కథ. 6-3)
పరమేశ్వరుని భయము వలన (శాసనము, నియమము, వ్యవస్థ) అగ్ని ప్రజ్వరిల్లును. అతని భయము వలన సూర్యుడు ప్రకాశించును. విద్యుత్తు వాయువు ఆయన నియమము వలన నడుచుచున్నవి. ఆయన శాసము వలన మృత్యువు పాఱిపోవును.
శ్లో || చలా లక్ష్మీశ్చలాః ప్రాణాశ్చలం జీవిత-యౌవనమ్ |
చలాచలేచ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః || 20
అర్థము:- లక్ష్మీః = ధనసంపత్తి, చలా = చంచలమైనది (స్థిరమైనది కాదు), ప్రాణాః = ప్రాణములు, చలాః = చలన స్వభావలు కలవే, జీవిత యౌవనం = జీవనము యౌవనము కూడ, చలం = అస్థిరమైనదే, సంసారే = ప్రపంచములో, చలాచలే = చలములు, అచలములు, చేతనములు, జడములు, ధర్మః = ధర్మము, ఏకః = ఒక్కటే, హి = నిశ్చయముగా, నిశ్చలః = చలింపనిది, స్థిరముగా నుండునది.
తాత్పర్యము :- లక్ష్మీ (ధనసంపత్తి) చంచలమైనది (నశించునది) ప్రాణములు నాశస్వభావము కలవి. జీవనము యౌవనము నిశ్చలము లేనివి. చరాచర ప్రపంచములో ధర్మమొక్కటే నిశ్చలమైనది.
వివరణము :- ధనము చంచలమైనది. వేదములో-
అన్యమన్యముపతిష్ఠ రాయః || (ఋ. 10-117-5)
ధనము తిరిగెడు రథచక్రమువలె నొకదాని తరువాత నొకి వచ్చుచు పోవుచు నుండును.
యౌవనం జీవనం చిత్తం ఛాయా లక్ష్మీశ్చ స్వామితా |
చంచలాని షడేతాని జ్ఞాత్వా ధర్మరతో భవేత్ || (శుక్రనీతి 1-138)
యౌవనము, జీవనము, చిత్తము, ఛాయ, లక్ష్మీ, ప్రభుత్వము - ఈ యాఱును చంచలములు. ఈ విషయము గుర్తించి మనుష్యుడు ధర్మరతుడు కావలెను.
శ్లో || నరాణాం నాపితో ధూర్తః పక్షిణాం చైవ వాయసః |
చతుష్పదాంశృగాలస్తు స్త్రీణాం ధూత్తా చ మాలినీ || 21
అర్థము :- నరాణాం = మనుష్యులలో, నాపితః = మంగలి, ధూర్తః = తెలివికలవాడు, పక్షిణాంచ = పకక్షులలోను, వాయువః ఏవ = కాకియే ధూర్తః = మిక్కిలి చాకచక్యము కలది, చతుష్పదాం = నాలుగు కాళ్ల జంతువులలో, శృగాలః = నక్క తెలివిగలది, స్త్రీణాం = స్త్రీలలో, మాలినీ = దండలు గ్రుచ్చునది, ధూర్తా = నేర్పుగలది.
తాత్పర్యము :- మానవులలో మంగలి తెలివిగలవారు. పకక్షులలో కాకి తెలివిగలది. నాలుగు కాళ్ల జంతువులలో నక్క తెలివిగలది. స్త్రీలలో పూలుకట్టు స్త్రీ తెలివిగలది.
వివరణము :- మా దృష్టిలో ఈ శ్లోక మెవడో ధూర్తుడు ప్రక్షిప్తము చేసినట్లున్నది.
పంచమాధ్యాయము సమాప్తము
No comments:
Post a Comment