Tuesday, 4 May 2021

ఆరోగ్యకరమైన జీవిత విధానం

ఆరోగ్యకరమైన జీవిత విధానం అనేది ఒక నైపుణ్యమని చెప్పుకోవాలి. అది శాస్త్రీయంగా నేర్చుకోవాల్సిన విషయం. 

మనిషి శరీరంలో జరిగే అనేక రసాయనిక చర్యలు, అనువంశికత, చుట్టూ ఉండే పర్యావరణం, సంస్కృతులూ- ఇలాంటివెన్నో మనిషి  ఆరోగ్యాన్నిప్రభావితం చేస్తాయి. 

ఒక వ్యక్తి శరీరములో ఎటువంటి జబ్బు లేనంత మాత్రాన ఆ వ్యక్తీ ఆరోగ్యవంతుడని అనలేము కదా! 

ఒక వ్యక్తి తను శారీరకంగాను, మానసికంగాను,శారీరకవిధుల నిర్వహణలోను, ఆర్ధికంగాను, సామాజికంగాను అన్నివిధాలా ఒక మంచి పద్ధతిగా తను ఉన్న ప్రదేశంలో సమర్ధవంతం గా నివసించ గలిగితే ఆ సదరు వ్యక్తీ ఆరోగ్య వంతుడనబడును.

ఆరోగ్యము కలిగి వుండడం ప్రతి మనిషి ప్రాధమిక హక్కు. వీలునుబట్టి చుట్టూరా మంచి ఆరోగ్యకర పరిసరాలను కల్పించుకోవాలి. 

ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి. అది ఏ కొందరికో పరిమితం కాకూడదు. సదా ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి. తను ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.

సమతుల ఆహారం తీసుకునే వారు , నిరంతరం  శారీరక వ్యాయామం చేసేవారు, వ్యక్తిగత జీవితంలో ఆశావహత-వాస్తవిక దృష్టిని కలిగినవారు, సామాజికంగా సానుకూల దృక్పథం మరియు సమిష్టితత్వం కలవారు ఆరోగ్యకరమైన జీవనశైలితో జీవిస్తున్నట్లు లెక్క.

ఆరోగ్యాన్ని పొందాలనుకునేవారు  పండ్లు, పప్పులు, ఆకుకూరలు , కాయగూరలు మున్నగు వాటిని రోజూ వాడాలి. 

ఆరోగ్యం కావాలంటే వెంటనే ధూమపానము లాంటి దురలవాట్లనన్నిటినీ వదిలివేయాలి. 

రోజూ పిండి పదార్దములు, మాంస కత్తులు, క్రొవ్వులు, విటమిన్లు, మినరల్స్, తగినంత నీరు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

అసలు టీ తాగకూడదు. దీని మూలంగా  పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది. మీ తిండికి తగిన వ్యాయామము రోజూ అవసరము. వ్యాయామం ద్వారా శరీరము లోని మలన పదార్దములు బయటికి  విసర్జించబడుతాయి. ప్రతి రోజు ఎంతో కొంత నడవాలి.

భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక ఇబ్బందులు అనేకం  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఎలాంటి సమస్యలున్నా ఎప్పుడు మీ మనసును  ఎంతో ప్రశాంతం గా ఉండేటట్లు చూసుకోవాలి. నిండుగా నవ్వుతు బ్రతకాలి. అందర్నీ నవ్విస్తూ బ్రతకాలి.

భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది. 

ధ్యానం అలవాటు చేసుకోండి. మీ మనషు స్థిరంగా, నిలకడగా ఒకే విషయం పై లగ్నం అయ్యేలా ప్రతిరోజూ గంట ధ్యానం లో ఉండాలి .

భోజనము చేసిన తరువాత పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.






No comments:

Post a Comment