Tuesday, 4 May 2021

చాణక్య నీతి దర్పణము - ద్వితీయాధ్యాయము

 చాణక్య నీతి దర్పణము - ద్వితీయాధ్యాయము


శ్లో ||  అనృతం సాహసం మాయా మూర్ఖత్వ మతిలుబ్ధతా ||

 అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషాః స్వభావజాః || 1

 అర్థము :- అనృతం = అబద్ధమాడుట, సాహసం =ఆలోచింపకయే పనిని చేయబూనుట, మాయా = మోసగించుట, మూర్ఖత్వం = మూర్ఖత్వము, అతిలుబ్ధతా = మిక్కిలి లోభగుణము, అశౌచత్వం = అపవిత్రత, నిర్దయత్వం = దయలేక యుండుట యనునవి, స్త్రీణాం = స్త్రీలకు, స్వభావజాః = స్వాభావికములగు, దోషాః = దోషములు.

 తాత్పర్యము : అబద్ధమాడుట, సాహసించుట అనగా ఆలోచింపకయే యేపని యందైనను త్వరగా లగ్నమగుట, మోసగించుట, మూర్ఖత్వము, లోభితనము, అపవిత్రత, దయావిహీనత, అను నివి స్త్రీలకు స్వభావముతోనే ప్టుిన దోషగుణములు.

 వివరణము :- ఈ శ్లోకము నిశ్చయముగా ప్రక్షిప్తమే. 'ద్వారం కిమేకం నరకన్య నారీ' అనగా నరకమునకు స్త్రీ యొక ద్వారమని స్త్రీల విషయములో సమాజములో హీనమనోవృత్తియున్న సమయములో నెవరో యీ శ్లోకమును వ్రాసి చాణక్య నీతిలో ప్రక్షిప్తము చేసి యుందురు.

 మూర్ఖత్వము స్త్రీలకు స్వాభావిక గుణమేయైనచో నే స్త్రీకిని జ్ఞానముండరాదు. అట్లే నిర్దయతకూడ స్త్రీలకు స్వాభావిక గుణముకాదు. స్త్రీ సాక్షాత్తుగా దయామూర్తి. బుద్ధిమంతుడైన చాణుక్యు డ్టి మూర్ఖత్వము కల వచనములు వ్రాయడు. మఱియు అబద్ధమాడుట స్త్రీలకు సహజ గుణమా? అయినచో స్త్రీ యెన్నడును సత్యము చెప్పజాలదు. స్త్రీ నిజమే చెప్పనిచో భర్త, బిడ్డలు, అత్తమామలు మున్నగువారితో నసత్య సంభాణమే చేయుచున్నచో ఆ యిిిం వాతావరణము అవిశ్వాసముతో నిండి ఆ యిల్లు నరకముగా తయారగును. ఇట్లే ఆ శ్లోకములోని యితర దోషములు గూడ నసత్యములే.

శ్లో ||  భోజ్యం భోజనశక్తిశ్చ రతిశక్తిర్వరాంగనా ||

 విభవో దానశక్తిశ్చ నా-ల్పస్య తపసః ఫలమ్‌ || 2

 అర్థము :- భోజ్యం = భుజించుటకు దగిన మంచి పదార్థములు లభించుటయు, చ = మఱియు, భోజనశక్తిః = ఆ పదార్థములు లభించిన తరువాత వండునంతవఱకు నోర్పు గలిగియుండుటయు భుజించు శక్తియు, వరాంగనా  = అందమైన భార్య లభించుటయు, రతిశక్తిః = ఆమె లభించిన తరువాత నామె ననుభవించుటకు దగిన కామశక్తి కలిగియుండుటయు, విభవః = సంపద కలిగియుండుట, చ = మఱియు, దానశక్తిః = దానము చేయు స్వభావము కలిగియుండుట యను నివి, అల్పన్య = స్వల్పమైన, తపనః = తపస్సు యొక్క, ఫలం = ఫలము, న = కాదు, అనగా నివి గొప్ప తపోవంతునకుగాని లభింపవని భావము.

 తాత్పర్యము :- మంచి భోజన పదార్థము లభించుటయు, ఆ భోజన పదార్థము తిని హరించుకొనుశక్తియు, అందమైన భార్య లభించుటయు, ఆమెతో హాయిగా భోగముననుభవించుటకు కామశక్తి కలిగియుండుటయు, సంపద కలిగియుండుటయు, ఆ సంపదను దానము చేయు బుద్ధి కలిగియుండుటయు, నను నివి యల్పమైన తపస్సుచే సంప్రాప్తము కావు. గొప్ప తపస్సంపన్నుడై యుండవలెను.

 వివరణము :- పైన చెప్పబడిన విషయములు భగవంతుడు సమానముగా నిర్మింపక విషమముగా నిర్మాణము చేయును, చూడుడు-

 యః సుందరస్తద్‌ వనితా కురూపా యా సుందరీ సా పతిరూపహీనా |

 యత్రోభయం తత్ర దరిద్రతా చ విధే ద్విచిత్రాణి విచేష్టితాని ||

 తాత్పర్యము :- పురుషుడు అందగాడైన స్త్రీ అంద విహీనయు, భార్య అందకత్తెయైన భర్త రూపహీనుడును, ఇద్ద ఱొక్కిగా నున్నచో వారు దరిద్రులుగా నుండుటయు విధాత యొక్క విచిత్రపు లీలలు- అట్లే ధనమున్నవాడు లోభియు, దాత ధనహీనుడుగాను నుందురు. అటులకాక పై విషయములు సమములుగా నున్నచో నవి యచ్చట వారి యొక్క పూర్వజన్మ తపః ఫలముగా భావింపవలెను.

శ్లో || యస్య పుత్రో వశీభూతో భార్యా ఛందాను గామినీ |

 విభవే యశ్చ సంతుష్ట స్తస్య స్వర్గ ఇహైవ హి || 3

 అర్థము : - యస్య = ఎవనికి, పుత్రః = పుత్రుడు, వశీభూతః = వశమందుండునో, భార్యా = భార్య, ఛందానుగామినీ =  = భర్త యిష్టానుసారము ఆచరించునదగునో, చ = మఱియు, యః = ఎవడు, విభవే = సంపదయందు, సంతుష్టః = సంతృప్తి కలవాడగునో, తన్య = అి్టవానికి ఇహ+ఏవ = ఇహైవ = ఈ పృథివియందే, స్వర్గః = సుఖముండును.

 తాత్పర్యము :- ఎవనికి పుత్రుడు వశమందుండునో, ఎవని భార్య అతని యిచ్ఛానుసారముగా ప్రవర్తించునో, ఎవడు తన సంపదచే సంతుష్టుడగునో య్టివానికి నిక్కడే స్వర్గము.

 వివరణము :- మఱొకరు చెప్పిన దానిని చూడుడు-

 అస్తి పుత్రో నశే యస్య భృత్యో భార్యా తథైవ చ ||

 అభావే పతి సంతోషః స్వర్గస్థో-హి మహీయతే ||

 తాత్పర్యము :- ఎవనియొక్క పుత్రుడు, సేవకుడు, భార్య వాని వశముననుందురో, అట్లే ఎవడు ధనము లేకున్నను సంతుష్టుడుగా నుండునో న్టివాడు భూతలమందే సుఖము ననుభవించును (స్వర్గమును). కపిలాచార్యుడు తన తల్లియగు దేవహూతితో స్వర్గ నరకముల గూర్చి చెప్పినది చూడుడు.

 అత్రైవ నరకః స్వర్గ ఇతి మాతః ప్రచక్షతేః |

 యా యాతనా వై నారక్యాస్తా ఇహా ప్యుపలక్షితా ||

(భాగ. పు. 3.20.29)

 తాత్పర్యము :- ఓ మాతా స్వర్గ నరకము లిచ్చటనే యున్నవని చెప్పుదురు. నరకములో నే బాధలున్నవో యవి యిక్కడ కూడ కనబడుచున్నవి.

శ్లో || తే పుత్రా యే పితుర్భక్తాః స పితా యస్తు పోషకః ||

 తన్మిత్రం యస్య విశ్వాసః సా భార్యాయత్రనిర్వృతిః || 4

 అర్థము :- యే = ఎవరు, పితుః = తండ్రికి, భక్తాః = భక్తులో, తే = వారు, పుత్రాః = పుత్రులు, యస్తు = ఎవడైతే, పోషకః = బిడ్డలను పోషించుచు మంచిచెడ్డల చూచునో, సః = వాడే, పితా = తండ్రి, యస్య = ఎవనికి, విశ్వాసః = విశ్వాసము, అనగా విశ్వసింపదగినవాడే, తత్‌ = మిత్రం = ఆ స్నేహితుడు, యత్ర = ఎవరివలన, నిర్వృతిః = సుఖము కలుగునో, సా = ఆమెయే, భార్య = భార్య.

 తాత్పర్యము :- తండ్రియందు భక్తి కలవారే పుత్రులు. బిడ్డల పాలన పోషణ చేయువాడే తండ్రి, విశ్వాసపాత్రుడైన వాడే మిత్రుడు. ఏ స్త్రీ వలన భర్తకు సుఖము ప్రాప్తించునో య్టి స్త్రీయే భార్య.

 వివరణము :- పుత్రునిగూర్చి శుక్రనీతిసారము2-38 లో చూడుడు-

 ప్రాప్యా-పి మహలీం వృద్ధిం వర్తేత పితురాజ్ఞయా |

 పుత్రస్య పితురాజ్ఞా-పి పరమం భూషణం స్మృతమ్‌ ||

 తాత్పర్యము :- పుత్రు డున్నత స్థానములో నున్నను తండ్రి యాజ్ఞ ననుసరించి నడపవలెను. తండ్రి యాజ్ఞను పాలించుట పుత్రునకు పరమభూషణము.

 తత్కర్మ నియతం కుర్యాద్యేన తుష్టో భవేత్‌ పితా |

 తన్నకుర్యాద్యేన పితా మనాగపి విసీదతి || (శుక్ర. 2-44)

 తాత్పర్యము : - ఏ పని చేసిన తండ్రి సంతుష్టుడగునో యా పనిని పుత్రుడవశ్యము చేయవలెను. తండ్రికి నే కొంచెము దుఃఖము కలిగించునదైనను ఆ పని పుత్రుడు చేయరాదు.

 యః ప్రీణయే త్సుచరితైః పితరం న పుత్రో

 యదృర్తు రేవ హితమిచ్ఛతి తత్కలత్రమ్‌ |

 తన్మిత్ర మా పది సుఖే చ నమక్రియం యత్‌

 ఏవ తత్త్రయం జగతి పుణ్యకృతో లభన్తే ||

 తాత్పర్యము :- తన సదాచారములతో తండ్రిని ప్రసన్నుని చేయువాడు పుత్రుడు. ఎల్లపుడు భర్త యొక్క శుభమును గోరున్టిదియే భార్య. సుఖ దుఃఖసమయములలో వెంటనుండి యొకే రీతిగా నుండువాడు మిత్రుడు. ప్రపంచములో నీ ముగ్గురు పుణ్యాత్ములకే లభింతురు.

శ్లో || పరోక్షే కార్యహన్తారం ప్రత్యక్షే ప్రియవాదినమ్‌ ||

 వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్‌ || 5

 అర్థము :- పరోక్షే = చాటున, కార్యహన్తారం = పనులు చెడగొట్టువాడును, ప్రత్యక్షం = ఎదుట, ప్రియవాదినం = తియ్యి మాటలు చెప్పువాడును, అయిన,  తాదృశమ్‌ = అి్ట, మిత్రం = స్నేహితుని, పయోముఖం = మూతి దగ్గర పాలుండి, విషకుంభం = నిండుగా విషముగల కడవనువలె, వర్జయేత్‌ = విడిచిపెట్టవలెను.

 తాత్పర్యము :- చాటున కార్యములకు హాని కలిగించుచు, ఎదుట తియ్యని మాటలాడున్టి మిత్రుని పయోముఖ విషకుంభమువలె విడువవలెను. కడవ లోపలనంతయు విషముండి కడవమూతిదగ్గఱ పాలు కల దానిని పయోముఖ విషకుంభమందురు.

శ్లో || న విశ్వనేత్‌ కుమిత్రే చ మిత్రేచాపి న విశ్వసేత్‌ |

 కదాచిత్‌ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్‌ || 6

 అర్థము :- కుమిత్రే = చెడ్డ స్నేహితునియందు, న విశ్వసేత్‌ = విశ్వాసముంచరాదు, మిత్రేచాపి = మంచి స్నేహితునియందు, న విశ్వసేత్‌ = విశ్వాసముంచరాదు, కదాచిత్‌ = ఎన్నడైన, కుపితం = కోపించున్టి, మిత్రం = మిత్రుడు, సర్వం = సమస్తమైన, గుహ్యం = రహస్యమును, ప్రకాశయేత్‌ = వెల్లడించును, అందుచేత నమ్మరాదు.

 తాత్పర్యము :- చెడ్డ స్నేహితునియందు విశ్వాసముంచరాదు. మంచి మిత్రుని యందును విశ్వాసముంచరాదు. ఎందుచేతననగా నెప్పుడైనను కోపము వచ్చినచో ఆ మిత్రుడు తన రహస్యముల నన్నింని వెల్లడించును.

 వివరణము:- అథర్వ వేదము 19-15-6 లో చూడుడు-

 'అభయం మిత్రా దభయ మమిత్రాత్‌' అనగా మిత్రుని నుండి మొదట అభయమును కోరెను. కారణము మిత్రుడుగా నున్నపుడు రహస్యములు తెలిసికొనియుండును. కావున కోపము వచ్చినచో ఆ రహ్యముల వెల్లడింపకలడు. అందుచేత శత్రువుకంటె మిత్రుని నుండియే అభయమును ముందుగా కోరెను.

శ్లో || మనసా చింతితం కార్యం వాచా నైవ ప్రకాశయేత్‌ |

 మంత్రేణ రక్షయేద్‌ గూఢం కార్యం చాపినియోజయేత్‌ || 7

 అర్థము :- మనసా = మనస్సు ద్వారా, చింతితం = ఆలోచింపబడిన, కార్యం = పనిని, వాచా = వాక్కుతో, నైవ ప్రకాశయేత్‌ = ప్రకాశింపజేయనే కూడదు, మంత్రేణ = ఆలోచన ద్వారా, రక్షయేత్‌ = రక్షింపవలెను, చ = మఱియు, గూఢమపికార్యే = రహస్యమైన కార్యమందును, నియోజయేత్‌ = పరిణతి చెందవలెను (సిద్ధిపొందవలెను)

 తాత్పర్యము :- మనస్సుతో నాలోచించిన కార్యమును వాక్కుతో వెల్లడింపరాదు. ఆ కార్యమును బాగుగా ఆలోచించుచునే రక్షింపవలెను. రహస్యముగా నుంచియే ఆ కార్యమును పూర్తి చేయవలెను.

 వివరణము :- ఋగ్వేదము 10-31.2 లో - 'స్వేన క్రతునావదేత్‌' అనగా తాను ఆలోచించిన దానిని చెప్పదలచిన దానిని కర్మచేసి చూపవలెను. అనగా కర్మద్వారానే వెల్లడింపవలెను.

శ్లో || కష్టం చ ఖలు మూర్ఖత్వం కష్టం చ ఖలు యౌవనమ్‌ |

 కష్టాత్కష్టతరం చైవ పరగేహ నివాసనమ్‌ || 8

 అర్థము :- మూర్ఖత్వం = మూర్ఖత్వము, ఖలు చ = నిశ్చయముగా, కష్టం = కష్టదాయకమైనది, చ = మఱియు, యౌవనం = యౌవనావస్థ, ఖలు = కూడ, కష్టం = దుఃఖదాయకమైనది, చ = అట్లే, పరగేహనివాసనం = ఇతరుల యింట నివసించుట, కష్టాత్కష్టతరమ్‌ ఏవ = మిక్కిలి కష్టదాయకమైదే.

 తాత్పర్యము :- మూర్ఖత్వము నిశ్చయముగా కష్టమును గలిగించును. మఱియు యౌవనము కూడ కష్టమును కలిగించునదియే, అట్లే యితరుల యిండ్లలో నివసించుటయు నత్యంత కష్టదాయకమే.

 వివరణము :- మూర్ఖత్వమును గూర్చి (యోగవా-ఉప-29-57) లో చూడుడు-

 న మౌర్ఖ్యా దధికో లోకే కశ్చిద న్తీహ దుఃఖదః - అనగా మూర్ఖత్వమును మించి ప్రపంచములో దుఃకమును కలిగించునది మఱొకి లేదు.

 యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వ మవివేకతా |

 ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్‌ ||

 యౌవనము, ధనసంపద, ఫ్రభుత్వము, అవివేకము (అజ్ఞానము) అనువానిలో నే యొక్కటున్నను అనర్థమును కలిగించును. అటులకాక నాలుగు నొక్కచో నున్నచో నింక చెప్ప వలసిన దేమున్నది?

 ఇతరుల యింట నివాసమును గూర్చి (మ. భా. వన. 313-115) లో యకక్షుడు యధిష్టురు నడిగెను. ఎవడు ప్రపంచములో సుఖముగా నుండి సంతోషించును? దానికి యుధిష్ఠిరుని సమాధానము.

 పంచమే-హని షష్ఠే వా శాకం పచతి స్వగృహే |

 అనృణీ చాప్రవాసీ చ స వారిచర! మోదతే ||

 తాత్పర్యము :- జలచరుడైన యక్షా! ఋణము లేనివాడు, పరదేశమందు, లేనివాడు, అయిదాఱు రోజులైనను తన యిిింలో వంటచేసికొని భుజించువారును సుఖము కలవాడగును- మఱియు

 వినా కార్యేణ యే మూఢా గచ్ఛన్తి పరమందిరమ్‌ |

 అవశ్యం లఘుతాం యాన్తి కృష్ణపక్షే యథా శశీ ||

 తాత్పర్యము :- మూఢులైనవారు పనిలేకుండ సోమరులై యితరుల యిండ్లకు పోవుదురో వారు కృష్ణపక్షములో చంద్రుడు క్షీణించి అల్పుడగునట్లు తేలికయై పోవుదురు.

శ్లో || శైలే శైలే న మాణిక్యం మౌక్తికం చ గజే గజే |

 సాధవో న హి సర్వత్ర చందనం న వనే వనే || 9

 అర్థము :- శైలే శైలే = ప్రతి పర్వతమునందును, మాణిక్యం = మాణిక్యము, న = ఉండదు, గజేగజే = ప్రతి ఏనుగు నందును, మౌక్తికం = ముత్యము, న = పుట్టదు, సాధవః = సజ్జనులైనవారు, సర్వత్ర = అంతట, నహి = ఉండరు గదా! అట్లే, వనే వనే = ప్రతి అరణ్యమునందును, చందనం = గంధపుచెట్టు, న = ఉండదు.

 తాత్పర్యము:- ప్రతి పర్వతమునందు మాణిక్యములుండవు. ప్రతి యేనుగు తలయందును ముత్యములు పుట్టవు. సాధువులు అన్ని చోట్ల నుండరు. ప్రతి అరణ్యమునందు మంచిగంధపు చెట్టుండదు.

శ్లో || పుత్రాశ్చ వివిధైః శీలై ర్ని యోజ్యాః సతతం బుధైః

 నీతిజ్ఞాః శీలసంపన్నా భవన్తి కులపూజితాః || 10

 అర్థము :- బుధైః = బుద్దిమంతుల ద్వారా, పుత్రాః చ = బిడ్డలైన బాలబాలికలును, సతతం = ఎల్లపుడును, వివిధైః = అనేకవిధములగు, శీలైః = మంచిగుణములతో, నియోజ్యాః = నియుక్తులు కావలెను (మంచి గుణములను నేర్పవలెను), నీతిజ్ఞా! = నీతి నెఱింగినవారును, శీలసంపన్నాః = శీలసంపదకలవారు మాత్రమే, కులపూజితాః = కులమునందు(మానవ సమాజమందు) పూజింపబడనివారు, భవన్తి = అగుచున్నారు.

 తాత్పర్యము :- బుద్ధిమంతుల ద్వారా తమ బిడ్డలు ఎల్లపుడు వివిధములగు మంచిగుణములు గలవారుగా దిద్దబడవలెను. కులములో గుణవంతులచే పూజింపబడుదురు. కావున పిల్లలను గుణవంతుల జేయవలెను.

 వివరణము :- శీలమన నేమో వ్యాసమహర్షి-

 (మ. భా.అను.124-66) లో

 అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా |

 అనుగ్రహం చ దానం చ శీలమేతత్రపశన్యతే ||

 తాత్పర్యము :- ప్రాణులన్నింయందు మనోవాక్కాయ కర్మలతో ద్రోహము (వైరము) లేకుండుటయు, దయ కలిగియుండుటయు, దానముచేయుటయు, శీలముగా ప్రశంసింపబడుచున్నది.

శ్లో || మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః |

 న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా ||

 అర్థము :- యేన = ఏ తల్లి చేతగాని, తండ్రి చేతగాని, బాలః = కుమారుడు, నపాఠితః = చదివింపబడడో, అి్ట, మాతా = తల్లి, శత్రుః = శత్రువు, పితా = తండ్రి, వైరీ = శత్రువు, అటుల చదివింపబడని బాలుడు, హంసమధ్యే = హంసల మధ్యలో, యథా = ఎట్లు, బకః = కొంగ, న శోభతే = ప్రకాశింపదో యట్లే, సభామధ్యే = సభలో, న శోభతే = ప్రకాశింపడు.

 ఏ తల్లిదండ్రులు పిల్లలను జదివింపరో వారు శత్రువులు, కారణము హంసల మధ్యలో కొంగ రాణింపనట్లు ఆ చదువురాని బాలుడు సభా మధ్యలో రాణింపడు కావున అి్ట స్థితికి దెచ్చిన తల్లిదండ్రులు శత్రువులే. ఈ శ్లోకమును దయానందమహర్షి తన సత్యార్థప్రకాశము ద్వితీయ సముల్లాసములో బాలశిక్షాప్రకరణములో ఉటంకించినారు.

శ్లో || లాలనాద్‌ బహవో దోషా స్తాడనాద్‌ బహవో గుణాః |

 తస్మాత్పుత్రం చ శిష్యంచ తాడయేన్న తులాలయేత్‌ || 12

 అర్థము : - లాలనాత్‌ = గారాబము చూపుటవలన పిల్లలలో, బహువః = చాల, దోషాః = దోషములును, తాడనాత్‌ = దండించుటవలన, బహవః = చాల, గుణాః = గుణములును కలుగును, తస్మాత్‌ = అందువలన, పుత్రంచ = పుత్రుని, శిష్యంచ = శిష్యుని, తాడయేత్‌ = దండింపవలెను, న తు లాలయేత్‌ = గారాబము చూపరాదు.

 తాత్పర్యము :- లాలన చేయుట వలన (బుజ్జగించుట) పిల్లలో చాల దోషము లుత్పన్నములగును, దండించుట వలన చాల గుణములు గలుగును. కావున సంతానమును, శిష్యులను దండింపవలెనే కాని లాలింపరాదు.

 వివరణము :- పతంజలి మహర్షి వ్యాకరణ భాష్యము (8-1-8) లో

 సామృతైః పాణిభిర్ఘ్నన్తి గురవో న విపోక్షితైః |

 లాలనా శ్రయిణో దోషాస్తాడనాశ్రయిణో గుణాః ||

 తాత్పర్యము :- దండించుటవలన సంతానము శిష్యుడును దోషములేనివాడును, గుణయుక్తులు నగుదురు. తల్లిదండ్రులు, అధ్యాపకులు అమృతమయములగు హస్తములతో కొట్టుదురు. విషమయములగు చేతులతో కాదు. వారు ఈర్ష్యాద్వేషములతో కాక పైకి భయమును కనబఱచుచు లోపల దయ కలిగియుందురు.

శ్లో || శ్లోకేనవా తదర్ధేన పాదేనైకాక్షరేణ వా |

 అబన్ధ్యం దివసం కుర్యాద్‌ దానాధ్యయన కర్మభిః || 13

 అర్థము :- శ్లోకేన = ఒక్క శ్లోకమును పఠించుట ద్వారా కాని చింతన చేయుట ద్వారా కాని మనన చేయుట ద్వారా కాని, లేక తదర్ధేన = సగము శ్లోకము ద్వారా కాని, పాదేన = ఒక పాదము ద్వారా కాని, ఏకాక్షరేణవా = ఒక యక్షరము ద్వారా కాని, దానాధ్యయన కర్మభిః = దానము, అధ్యయనము మొదలగు శుభకర్మల ద్వారా కాని, దివసం = దినమును, అబంధ్యం = సార్థకమైన దానినిగ, కుర్యాత్‌ = చేయవలెను, వ్యర్థపఱచరాదు.

 తాత్పర్యము :- ఒక్క శ్లోకమును బాగుగా చదివి చింతన చేసి మాి మాికి మనన చేయుట ద్వారా కాని, సగము శ్లోకము ద్వారా కాని, ఒక పాదము(నాల్గవ వంతు) ద్వారా కాని యొక యక్షరము ద్వారా కాని ప్రతిదినము స్వాధ్యాయము చేయవలెను. దానము, అధ్యయనము మొదలగు శుభకర్మల ద్వారా దినమును సార్థకపఱపవలెను, వ్యర్థము చేయరాదు.

 వివరణము :- దినమును సార్థకపఱచుటలో విదురుని వచనము-

 (విదుర నీతి 3-67-68) లలో

 దిన సేనైవ తత్కుర్యాచ్‌ యేన రాత్రౌ సుఖం వసేత్‌ |

 అష్టమా సేన తత్కుర్యాద్‌ యేన వర్షాః సుఖం వసేత్‌ ||

 పూర్వం వయసి తత్కుర్యాన్‌ యేన వృద్ధః సుఖం వసేత్‌ |

 యావజ్జీవనే తత్‌ కుర్యాత్‌ యేన ప్రేత్య సుఖం వసేత్‌ ||

 తాత్పర్యము :- రాత్రి సుఖముగా నుండుటకు తగినట్లుగా పగలు పని చేయవలెను. ఆ పని వలన రాత్రి యే చింతయు లేక హాయిగా నిద్రపట్టవలెను. ఇట్లే సంవత్సరములో నెనిమిది మాసములు ప్రయత్నము చేసి వర్షఋతువులో సుఖముగా నుండవలెను. పరలోకములో (పరజన్మలో) సుఖముగా నుండుటకు దగిన కర్మలను ఈ జన్మలో జీవితమంతయు ప్రయత్నింపవలెను.

శ్లో || కాంతా వియోగః స్వజనాపమానః

 ఋణస్య శేషం కునృపస్య సేవా |

 దరిద్రభావో విషమా సభా చ

 వినా-గ్ని మేతే ప్రదహన్తి కాయమ్‌ || 14

 అర్థము :-  కాంతా వియోగః భార్యా వియోగము, స్వజనాపమానః = తన బంధు బాంధవుల ద్వారా కలిగిన యనాదరము, ఋణస్య శేషం = ఋణశేషము, కునృపన్య సేవా = దుష్టరాజును సేవించుట, దరిద్రభావః = దారిద్య్రము, చ = మఱియు, విషమా సభా = స్వార్థపరులనభయ, ఏతే = ఇవి యన్నియు, అగ్నిం వినా = అగ్ని లేకుండనే, కాయం = శరీరమును, ప్రదహన్తి = దహించుచున్నవి.

 తాత్పర్యము :- భార్యా వియోగము, బంధు బాంధవుల అనాదరము, ఋణశేషము, దుష్టరాజును సేవించుట, దారిద్య్రము, అజ్ఞానులు సార్థపరులైనవారుగల సభ యివి యన్నియు అగ్ని లేకుండనే శరీరమును దహింపజేయును.

శ్లో || నదీతీరే చ యే వృక్షాః పరగేహేషు కామినీ |

 మంత్రిహీనాశ్చ రాజానః శీఘ్రం నశ్యన్త్య సంశయమ్‌ ||  15

 అర్థము :- యే = ఏ, వృక్షాః = వృక్షములు, నదీతీరే = నది యొడ్డుననున్నచో, చ = మఱియు, పరగేహేషు = ఇతరుల యిండ్లలో నుండున్టి, కామినీచ = స్త్రీయు, మంత్రిహీనాః = మంత్రులు లేన్టి, రాజానః = రాజులును, శీఘ్రం = మిక్కిలి త్వరగా, నశ్యన్తి = నశింతురు, అసంశయమ్‌ = సందేహము లేదు.

 తాత్పర్యము :- నది యొడ్డున నున్న చెట్లు, ఇతరుల యిండ్లలో నుండు స్త్రీ, మంత్రిలేని రాజులు, శీఘ్రముగా నశింతురు. ఇందులో సంశయము లేదు.

శ్లో || బలం విద్యా చ విప్రాణాం రాజ్ఞాం సైన్యం బలం తథా |

 విత్తం బలం చ వైశ్యానాం శూద్రాణాం పరిచర్యకాః || 16

 అర్థము :- విప్రాణాం = బ్రాహ్మణులకు, బలం= బలము, విద్యా = విద్య, తథా = అట్లే, రాజ్ఞాం = రాజులకు, బలం = బలము, సైన్యం = సైన్యము, వైశ్యానాం = వైశ్యులకు, విత్తం = ధనము, బలం = బలము, శూద్రానామ్‌ = శూద్రులకు, పరిచర్యికా = సేవ, బలమ్‌ = బలము.

 తాత్పర్యము : - బ్రాహ్మణులకు తేజస్సు, విద్యయు, బలము, రాజులకు బలము, సైన్యము, వైశ్యులకు బలము ధనము, గోసంరక్షణ మొదలైనవి శూద్రులకు బలము సేవించుటయు.

 వివరణము :- విదురనీతి (2-73) లో-

 హింసాబల మసాధూనాం రాజ్ఞాం దండవిధిర్భలమ్‌ |

 శుశ్రూషాతు బలం స్త్రీణాం క్షమా గుణపతాం బలమ్‌ ||

 తాత్పర్యము :- దుష్టులైన వారికి బలము హింసించుటయే. దండించుటయే రాజులకు బలము, శుశ్రూష చేయుటయే స్త్రీలకు బలము, గుణవంతులకు ఓర్పే బలము.

 చాణక్య శతకము 1-81 లో

 దుర్భలస్య బలం బాలానాం రోదనం బలమ్‌ |

 బలం మూర్ఖస్య మౌనిత్వం చోరాణామనృతం బలమ్‌ ||

 తాత్పర్యము : - రాజు దుర్బలులకు బలము, పిల్లలకు బలము ఏడ్చుట, మూర్ఖునకు బలము మౌనముగా నుండుట, దొంగలకు అబద్ధమాడుట బలము.

శ్లో || నిర్ధనం పురుషం వేశ్యా ప్రజాభగ్నం నృపం త్యజేత్‌ |

 ఖగా వీతఫలం వృక్షంభుక్త్వాచా-భ్యాగ తాగృహమ్‌ || 17

 అర్థము :- వేశ్యా = వేశ్య, నిర్ధనం = ధనహీనుడైన పురుషం = పురుషుని, ప్రజాః = ప్రజలు, భగ్నం = పరిజితుడైన లేక శక్తిహీనుడైన, నృపం = రాజును, త్యజేత్‌ = విడువలెను, ఖగాః = పకక్షులు, వీతఫలం = పండ్లులేని, వృక్షం = వృక్షకుడు, అభ్యాగతాః = అతిథులు, భుక్త్వాః = భుజించిన తరువాత, గృహం = ఆ యిిింని, విడిచిపెట్టుచుందురు.

 తాత్పర్యము : - వేశ్య ధనహీనుని, ప్రజలు ఓడిపోయిన రాజును విడుచుదురు. పకక్షులు పండ్లు లేని చెట్లను, అతిథులు భోజనము చేసిన యిిింని విడిచిప్టిె వెళ్లుదురు.

శ్లో || గృహీత్వా దక్షిణాం విప్రాస్త్యజన్తి యజమానకమ్‌ |

 ప్రాప్తవిద్యాగురుంశిష్యాదగ్ధా-రణ్యంమృగాస్తథా || 18

 అర్థము :- విప్రాః = బ్రాహ్మణులు, దక్షిణాం = దక్షిణను, గృహీత్వా = తీసికొని, యజమానాకం = యజమానుని, త్యజన్తి = విడుతురు, శిష్యాః = శిష్యులు, ప్రాప్తవిద్యా = విద్యను పొందినవారై, గురుం = గురువును, త్యజన్తి = విడుచుచున్నారు, తథా = అట్లే, మృగాః = లేళ్లు మొదలగు జంతువులు, దగ్ధారణ్యం = కాలిపోయిన యరణ్యమును విడిచిపెట్టును.

 తాత్పర్యము :- బ్రాహ్మణులు దక్షిణ పుచ్చుకొని ఆ యజమానుని విడిచి వెళ్లుదురు. శిష్యులు విద్యనుపొంది గురువును విడిచిపెట్టుదురు. అట్లే మృగములు పశువులు దహింపబడిన వనమును విడుచును.

శ్లో || దురాచారీ చ దుర్దృష్టి ర్దురావాసీ  చ దుర్జనః |

 యన్మైత్రీ క్రియతే పుంభిర్నరః శీఘ్రం వినశ్యతి || 19

 అర్థము :- దురాచారీ = ఆచార విహీనుడును, దుర్దృష్టిః = చెడ్డదృష్టిగలవాడును, దురావాసః = చెడ్డస్థలములందుండువాడును, చ = మఱియు, దుర్జనః = దుష్టుడు మొదలగు, పుంభిః = పురుషులతో, యన్నరః = ఏ మనుష్యుడు, మైత్రీ = స్నేహమును, క్రియతే = చేయునోవాడు, శీఘ్రం = శీఘ్రముగా, వినశ్యతి = నశించుచున్నాడు.

 తాత్పర్యము :- ఆచారహీనుడు పతితుడునైన వానితోను, మంచి చూపులేని వానితోను, చెడ్డ స్థలములో నుండు దుర్జనునితోను, స్నేహముచేయువాడు శీఘ్రముగా నశించును.

 వివరణము :- ఈ శ్లోకము పూర్వార్ధములో సుందరమైన అనుప్రాసాలంకారము గలదు. చాణక్యుడు మఱొకచోట గూడ దుర్జనుని దూరముగా నుంచుమని ఆదేశించెను (చాణక్య శతకము - 3-35లో)

 దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతో-పి నన్‌ |

 మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః ||

 తాత్పర్యము :- విద్యగలవాడైనను దుర్జనుడు దూరముగా నుంచగదిగనవాడే. ఎట్లనగా మణికలిగియున్నను సర్పము భయంకరమైనదే గదా!

 దుర్జనః ప్రియవాదీ చ నైవ విశ్వాసకారణమ్‌ |

 మధు తిష్టతి జిహ్వాగ్రే హృది హాలాహలం విషమ్‌ ||

 (చాణక్య శత. 3-28)

 తాత్పర్యము :- దుర్జనుడు, ప్రియముగా మొగమిచ్చకమునకు మ్లాడువాడు కూడ నమ్మదగనివారు. అి్ట వారికి నాలుక చివర తేనెయు, హృదయమందు భయంకరమైన విషమునుండును.

శ్లో || సమానే శోభతే ప్రీతిః రాజ్ఞి సేవా చ శోభతే |

 వాణిజ్యం వ్యవహారేషు దివ్యా స్త్రీ శోభతే గృహే || 20

 అర్థము :- ప్రీతిః = ప్రేమ, సమానే = సమానులయందు, శోభతే = ప్రకాశించును, రాణించును, చ = మఱియు, సేవా = సేవ, రాజ్ఞి = రాజునందు, శోభతే = ప్రకాశించును, వాణిజ్యం = వ్యాపారము, వ్యవహారేషు = వ్యవహారములందును(కృషి చేయుటలోను) గృహే = గృహమందు, దివ్యా = గుణవంతురాలైన్టి, స్త్రీ = స్త్రీ, శోభతే = ప్రకాశించుచున్నది.

 తాత్పర్యము :- సమానమైన వారియందు ప్రీతిరాణించును. సేవించుట రాజునందు శోభించును. వ్యవహారములందు (కృషిచేయుటలో) వాణిజ్యము (వ్యాపారము) శ్రేష్టము. ఇంిలో మంచిగుణముగల స్త్రీ శోభించును.

ద్వితీయాధ్యాయము సమాప్తము

No comments:

Post a Comment