త్యాగ మనేది ఒక గొప్ప సుగుణం
దాన్ని ఎపుడూ విడువకూడదు
అది మన జీవితాన్ని
ఒక ఉన్నత శిఖరంపై కూర్చో బెడుతుంది
కేవలం ఆచరణలోనే అది
సఫలీకృతం కాగలదు
నీకు కావాల్సింది మాత్రమే కాదు
నీకు లభ్యమయ్యేది కూడా
ఆనందంగా త్రుణీకరించడమే త్యాగం
కొత్తగా ఆశించడం మాని
ఉన్నవాటిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించండి.
నీదంటూ నీదగ్గర ఏముందని
నీవు దాచుకోవడానికి?
అంతా నీ బ్రాంతి కాకపోతే?
ముందుగా భ్రమనుండి తప్పుకో
నీ కూడిక సంపద నీదా?
పిల్లలు నీవాల్లా?
తలిదండ్రులు నీవారా?
ఎవరూ నీవారు కానపుడు
వాటన్నిటిని దూరం కావడమేమిటి హాస్యం కాకపోతే?
ఆలోచించి అడుగు ముందుకెయి
నేడే ఒక మంచి నిర్ణయం నిలబెట్టు
No comments:
Post a Comment