Thursday, 13 May 2021

ఆనతినీయవమ్మా

 వాగ్దేవిస్తుతి - ఆనతినీయవమ్మా దేవీ

ఆనతిచ్చినను ఆదరింపుమా

ఆగమపూజిత అవోకగానా

అంతరంగమున అధివసించినను

ఆజ్ఞాపించీ ఆశీర్వదించీ

జ్ఞానమునొసగే జ్ఞానదేవతవు 

జ్ఞానాజ్ఞేయ స్వరూపిణి నీవూ

థ్యాన, థ్యాతృ, థ్యేయరూపిణివి

థ్యానగమ్య పరిచ్ఛేదవు నీవూ

భక్తిథ్యానములో పరవశమొందీ

భక్తితో నిను వర్ణించుచునే

భావసుమము హారము కూర్చితి

రాగమాలికగా నీకర్పించితి

No comments:

Post a Comment