Tuesday, 4 May 2021

చాణక్య నీతి దర్పణము - అష్టమాధ్యాయము

చాణక్య నీతి దర్పణము - అష్టమాధ్యాయము


శ్లో || అధమా ధనమిచ్ఛన్తి ధనం మానం చ మధ్యమాః |

 ఉత్తమా మాన మిచ్ఛన్తి మానో హి మహతాం ధనమ్‌ || 1

 అర్థము :- అధమాః = అధములైన మానవులు, ధనం = ధనమును, ఇచ్ఛన్తి = కోరుచున్నారు, మధ్యమాః = మధ్యములు, ధనం = ధనమును, మానం చ = మానమును (సమ్మానమును) కూడ, ఇచ్ఛన్తి = కోరుచున్నారు, ఉత్తమాః = ఉత్తములు, మానం = మానమును, ఇచ్ఛన్తి = కోరుచున్నారు, మహతాం = గొప్పవారికి, మానః హి = మానమే (గౌరవము) ధనమ్‌ = ధనము.

 తాత్పర్యము :- ధనము మాత్రము కాంక్షించు వారు అధములు. ధనమును, గౌరవమును గోరువారు మధ్యములు. కేవలము ఆదరము, సమ్మానము కోరువారు ఉత్తములు. మహాత్ములు మానమే (ఆదరమే) ధనము.

శ్లో || ఇకక్షురాపః పయో మూలం తామ్బూలం ఫలమౌషధమ్‌ |

 భక్షయిత్వా-పి కర్తవ్యాః స్నానదానా-దికాః క్రియాః || 2

 అర్థము :- ఇకక్షుః = చెఱుకు, ఆపః = నీరు, పయః = పాలు, మూలం = దుంప, తాంబూలం = తాంబూలము, ఫలం = పండు, ఔషధం = ఔషధమును, భక్షయిత్వా-పి = తినినను, స్నాన = స్నానమును, దాన = దానము, అదికాః = మొదలైన్టి, క్రియాః = పనులు, కర్తవ్యాః = చేయదగినవే.

 తాత్పర్యము :- చెఱకు, నీరు, పాలు, దుంపలు, తాంబూలము, పండ్లు, ఔషధము మొదలైనవి భక్షించినను స్నానము, దానము, పూజ మొదలగు సత్క్రియలు చేయవలెను.

 వివరణము :- శక్తిలేనివాడు, రోగి, యాత్రలోనున్నవాడు, వ్యసనములలో చిక్కుకున్నవాడు జలాది పానము చేసి ఓషధులు సేవించినను, సంధ్య, యజ్ఞము, పూజాపాఠము, స్నానము, దానము మొదలగు క్రియలను చేయవలెను. శుభకర్మలను విడిచి పెట్టరాదు.

శ్లో || దీపో భక్షయతే ధ్వాన్తం కజ్జలం చ ప్రసూయతే |

 య దన్నం భక్షయే న్నిత్యం జాయతే తాదృశీ ప్రజాః || 3

 అర్థము :- దీపః = దీపము, ద్వాంతం = చీకిని, భక్షయతే = తినుచున్నది, చ = మఱియు, కజ్జలం = నల్లని మసిని, ప్రసూయతే = ప్టుించుచున్నది, అట్లే మనుష్యుడు, యదన్నం = ఎటువిం యన్నమును, నిత్యం = ఎల్లపుడు, భక్షయేత్‌ = తినునో, కాదృశీప్రజా = అి్ట సంతానమునే, జాయతే = కనును.

 తాత్పర్యము :- దీపము (వెలుగు) చీకిని భక్షించును. నల్లని కాటుకను ఉత్పన్నము చేయును. అట్లే మనుష్యుడు నిత్యమ్టెియన్నమును దినునో దానికి సదృశమైన సంతానమునే కనును.

 ఆహార శుద్ధే సత్త్వ శుద్ధిః || (ఛాందోగ్య. 7-26-2)


No comments:

Post a Comment