Tuesday, 4 May 2021

తిరుమలలో ఎందుకీ కల్యాణ మహోత్సవం?

 తిరుమలలో ఎందుకీ కల్యాణ మహోత్సవం?


తిరుమలలో శ్రీ శ్రీనివాస చక్రవర్తికి ప్రతిరోజూ మహోత్సవ సంరంభమే! బ్రహ్మోత్సవమే! సంవత్సరానికి 365 రోజులుంటే, 400 పైగా ఉత్సవాలు. సేవలు. ప్రతిదినమూ వైభవమే! పర్వదినమే! పాయసాన్న ప్రసాద ప్రదానమే! వేంకటేశ్వరుడు దేవాధిదేవుడు. ఉత్సవప్రియుడు. భక్తవత్సలుడు. చేతులేత్తి, తలవంచితే మనసులోని గుసగుసలను పసిక్టి, శ్రేయస్సులను అనుగ్రహిస్తాడు. సేవలు చేస్తే, చేయిస్తే, వశపడి కాక్షిస్తాడు. సద్యః దర్శనమో, సన్నిధి దర్శనమో, దూరదర్శనమో, శ్రీవారి చానల్‌లో శ్రీవారి పలకరింపో - ఏదైతే ఏం - వరాలను వర్షించే కరుణావరణుడు - రమణుడు - ఈ వేంకటరమణుడు.

 దూరస్థులను 'ఏం ఒకసారి వచ్చి కన్పించి పోవచ్చు కద!' అని ప్రేరిస్తాడు. చల్లని చలవ చూపులతో ఊరిస్తాడు. దర్శిస్తే, సేవిస్తే, ప్రేమతో పలకరిస్తాడు. కనికరిస్తాడు.

 ఒక్కసారి పెద్దగా 'గోవిందా!' అని పిలిస్తే, పులకరించి మన కోర్కెలను తీరుస్తాడు. ఈవేళ వధూద్వయం-పద్మావతీ, అలర్‌మేల్‌మంగలతో కలిసి వచ్చిన మన స్వామికి మంగళనీరాజనాలను పలుకుదాం!

భగవద్రామానుజాచార్యులవారు మనకోసం ఈ స్వామిని ప్రార్థించి, మెప్పించారు.

అఖిల భువన జన్మస్థేను భంగాదిలీలే

వినత వివిధ వ్రాత రక్షైక దీక్షే |

శ్రుతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే

భవతు మమ పరస్మిన్‌ శేముషీ భక్తరూపా ||

 శ్రీ వేంకటేశ్వరస్వామివారు సకల లోకాల సృష్టి, స్థితి లయాదులను వినోదం కోసం చేస్తారట! భక్తి ప్రపత్తులతో తనను ఆశ్రయించిన సమస్తప్రాణి సంఘాతాలను రక్షించడమే తన ప్రధానదీక్షగా పెట్టుకున్నాడట! ఉపనిషత్తుల చేత స్వరూప స్వభావాలను బ్టి అతి విస్తృతంగా ప్రతిపాదించబడినవారు ఈ శ్రీనివాసుడేనట! అంతి పెద్ద దైవమైన ఈ వేంకటేశ్వరస్వామివారు నాకు ప్రేమాస్పదమైన, ఉపాసనాత్మకమైన జ్ఞానాన్ని అనుగ్రహించుగాక! - భగవద్రామానుజులు

 తిరుమలలో శ్రీనివాసుడు క్రీ.పూ.3 నుంచి 7 శతాబ్దాల మధ్యకాలంలో వెలిసినట్లు సుప్రసిద్ధ ప్రాచీన తమిళ లక్షణ గ్రంథం 'తొల్హాప్పియం' ప్రస్తావిస్తోంది. శ్రీ వేంకటేశ్వరుని సాహిత్యానికీ, కవితావైభవానికి ఆద్యుడు నమ్మాళ్వార్‌! 'తిరుమలలోని కోతులు ప్రాతఃకాలాన్నే పూలతో నిండిన గుంటలలో స్నానం చేసి, అక్కడ పుష్పించిన పూలు తెచ్చి స్వామిని అర్చిస్తాయి' - అంారు నమ్మళ్వార్లు. శ్రీనివాసుడ్ని 9 పాశురాలతో కీర్తించాడు ఆయన.

 ఇక కులశేఖరాళ్వార్‌ కేరళను పాలించిన చక్రవర్తి. పరమభాగవతోత్తములు. రాజ్యాన్ని విడిచిప్టిె, శ్రీరంగని కైంకర్యంలోనే కాలాన్ని గడిపిన మహానుభావుడు. 11 పాశుర సుమాలతో శ్రీ వేంకటేశ్వరుని కీర్తించాడు.

 ''తిరుమలలో పక్షిగా, చేపగా, చంపక వృక్షంగా, ఓషధిగా, సెలయేరుగా, కొండశిలగా, స్వామివారి సేవకుడిగా, గర్భ గృహసోపానంగా లేదా ఏడుకొండల మీద ఏదైనా అవుతాను'' - అంాడు.

 ''పడియమ్‌ కోడందు ఉన్‌ పవళవాయ్‌ క్రాన్‌ బేనే''

 'నీ ముందు రాతి గడపగానైనా ఉన్నట్లైతే, నిన్ను నిత్యం సందర్శించుకునే భాగ్యం లభిస్తుంది కద!' అంారు. అలా శ్రీవారి గర్భాలయం ముందున్న రాతిగడపను 'కులశేఖరప్పడి' అంారు.


శ్రీవారి కళ్యాణం ఎందుకు చేస్తున్నాం?

శ్లో|| సర్వమంగళ సంయుక్తాః సర్వేసంపత్‌ సమాయుతాః

 భవిష్యన్తి హరేరేవః కృత్వా వైవాహికం విధిమ్‌ ||

 కల్యాణ సంపథ్చాన్యాః భవన్త్యస్మాన్న సంశయః || (సమూర్తార్చనాధికరణం, 39-55, 57)

 సర్వసంపదలు, సర్వమంగళాలు, ఇహపర శ్రేయాలు, దేహాంతంలో శ్రీవైకుంఠప్రాప్తి కల్గుతాయి. ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి, సమాజ సౌభాగ్యం కూడ!

శ్లో|| సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం | శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివరూపిణీం ||

 అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, వివాహానంతర సుఖజీవనం, ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో లాభాలు, దూరంగా ఉన్న దంపతుల కలయిక, తెలియని గృహ, దేహ బాధల నివృత్తి, సకల శుభపరంపరలకు శ్రీవారి కల్యాణ మహోత్సవ సేవ చక్కని త్రోవ!

 గృహనిర్మాణం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, క్రొత్త కోర్సులలో ప్రవేశం, నూతన వృత్తి లేక ఉద్యోగ ప్రవేశం, విదేశీ ప్రయాణం, వివాహ నిశ్చితార్థం, దేవాలయ నిర్మాణం, ప్రతిష్ఠా కార్యక్రమం, కొడుకు ఉపనయనం, నిత్యానుష్ఠానంలో క్రొత్తగా పారాయణ ప్రారంభం, క్రొత్త షాపు ప్రారంభం, క్రయవిక్రయాదుల రిజిస్ట్రేషన్‌, పాస్‌పోర్టు, వీసాల స్వీకారం - ఇలాింవెన్నో కోర్కెలు వీటన్నింని తృిలో తీర్చగల చతురుడు గోవిందుడు.


కల్యాణోత్సవ నేపథ్యం

శ్రీనివాసునకూ-పద్మావతీ అమ్మవారికి 5 వేల ఏండ్లనాడు వివాహం జరిగిందట! దేవగురువు బృహస్పతి ప్టిెనది ఆ శుభముహూర్తం! వైశాఖమాసంలో ఉత్తరఫల్గునీ నక్షత్రం థమీ శుక్రవారం!

ఆ దివ్యమహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైశాఖమాసం శుక్ల నవమి-థమి-ఏకాదశీలలో 3 రోజులపాటు ''శ్రీపద్మావతీ పరిణయోత్సవా''న్ని ప్రతి ఏా నిర్వహిస్తున్నారు.

తిరుమల శ్రీనివాసుని సన్నిధి 'నిత్యకల్యాణ-పచ్చతోరణా'ల పెన్నిధి. ఈ నిత్య కల్యాణ చక్రవర్తికి పచ్చని మామిడి తోరణాలతో నిత్యప్రత్యూషం స్వాగతం పలుకుతుంది శ్రీవారి మహాద్వారం!

పద కవితా-మహితా-పితామహులు' అన్నమాచార్యుల వారు 500 సంవత్సరాలనాడు నిత్యకల్యాణమహోత్సవాలకు శ్రీకారం చ్టుారు. అందుకే అన్నమాచార్యుల వారిని శ్రీవారికి సాక్షాత్తూ 'మామ'గారిగా సంభావిస్తారు.

అటు శ్రీనివాసునిదీ, మామగారైన అన్నమాచార్యుల వారిదీ భారద్వాజ గోత్రమే కావడం ఒక విచిత్రం కద! వధూవరులు ఒకే గోత్రీకులు కాకూడదని సంప్రదాయం.

అయినా సర్వాంతర్యామి, విశ్వాత్మకుడు, విశ్వాంతరాత్ముడు, విశ్వంభరుడు అయిన వేంకటేశ్వరుడ్ని ఏ ఒక్క గోత్రానికో పరిమితం చేయలేము కద!

నిత్యకల్యాణమూర్తి, స్ఫూర్తి, నిత్యవరుడు మన గోవిందుడు. ఇక అన్నమయ్య నవ్యనిత్యకన్యాదాత! ఇక్కడ కల్యాణోత్సవంలో పాల్గొనే ప్రతి వారూ అన్నమాచార్యులే! ఆకాశరాజులే! సముద్ర సంబంధులే! జనకమహారాజులే!



No comments:

Post a Comment