Wednesday, 5 May 2021

వంటరితనమే జీవితమా!

వంటరితనమే జీవితమా! 


ఎవరికి వారే యమునా తీరే

వచ్చేటపుడు ఎవరొచ్చారు నీ వెంట?

పోయేటపుడు ఎవరు రాగలరు నీవెంట !


అగాధ మధ్యమం నీ జీవితం!

ఎపుడు మునిగి పోయెనో?

ఎవరూహించ గలరు రేపటి దినాన్ని?

ప్రయత్నించగా వచ్చిన ప్రతిభ

సంపాదించగా వచ్చిన డబ్బు

ఏవి వుండవుగా నీ సొంతం ?


రాయి రప్ప కాకి కప్ప

ఇవన్ని నీకన్న గొప్పే !

ప్రాణం లేని రాయి కూడా 

నీకన్న ఎక్కువ కాలం బతికేస్తుంది 


చలనం లేని మట్టి 

నీకన్న దీర్గంగా జీవిస్తుంది !


పురుగు కన్నా హీనమైన బ్రతుకు 

నీదని తెలుసుకో.....

పొగరుగా జీవించడం మాని 

మౌనిలా మసలడం నేర్చుకో 


ఇది ఇలాగే  చేయాలని చెప్పే 

గురువెవరూ లేదిక్కడ 

ఎవడికి వాడే వేదాంతి 

దేనికదే గొప్ప బ్రాంతి 


నిజం ఎక్కడుందో 

ఎవడికీ తెలియదు 

అంతటా అబద్దమే 

అన్నీ అబద్దమే 


దారి చూపే నాధుడే లేడు 

నావ నడిపే యోధుడు లేదు 

మునిగే నావే కదా జీవితం 

తేలేదాకనే కదా వైభవం 

No comments:

Post a Comment