దయతో ఉండడం అందరికి సాధ్యమే!
అయితే కొంతమందికి దాన్ని ఆచరించడమే ఒక గొప్ప బద్ధకం.
సాటి జీవుల పట్ల జాలిని ప్రదర్శించడం
ఒక గొప్ప దైవ కార్యం లాంటిది.
వ్రతాలు, నోములు, పూజలు, పండుగలు, యజ్న యాగాదులు, క్రతువులు
ఇవన్నీ కేవలం అలంకార ప్రాయమే.
గుడిసెలో నివసించే ఒక పేదవాడి కడుపును చూడు.
వాడు నిత్యం ఆకలితో ఎంతగా నకనకలాడి పోతుంతాడో?
ఎనాడైనా వాడి ఆకలి తీవ్రత గురించి ఆలోచించావా ?
వెళ్లి పట్టెడన్నం వాడికెపుడైన పెట్టావా ?
పొద్దస్తమనూ నీ పొట్ట గురించే ఆలోచించావు తప్ప
ఎదుటి వాడి ఆకలి గురించి పట్టించుకున్నదెపుడని?
ఇప్పటికే చాల ఆలస్యం జరిగిందని
నీ మనసులో మెదిలితే
మరి తక్షణ కర్తవ్యం గురించి
నీవేం ఆలోచించావు?
ఆదమరచి ఇంకా
అలాగే నిద్రిస్తున్నావా
No comments:
Post a Comment