Tuesday, 4 May 2021

చాణక్య నీతి దర్పణము - సప్తమాధ్యాయము

 చాణక్య నీతి దర్పణము - సప్తమాధ్యాయము


శ్లో || అర్థనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ |

 వంచనం చావమానంచ మతిమాన్న ప్రకాశయేత్‌ || 1

 అర్థము :- అర్థనాశము = ధనము పోవుటయు, మనస్తాపం = మనస్సులోని బాధను, గృహే = ఇంియందు, దుశ్చరితాని = దోషములు, వంచనం = మోసగింపబడుటను, చ = మఱియు, అవమానం = అవమానమును, మతిమాన్‌ = బుద్ధిమంతుడైనవాడు, న ప్రకాశయేత్‌ = వెల్లడి చేయరాదు.

 తాత్పర్యము :- ధనము పోయినను, మనస్సునకు సంతాపము కలిగినను, ఇంిలో దోషములున్నను, ఇతరులచే మోసగింపబడినను, అవమానింప బడినను బుద్ధిమంతుడు వెల్లడి చేసికొనకూడదు.

 వివరణము :- పైన జెప్పబడిన విషయములను ఇతరులకు జెప్పినచో ఎగతాళి చేయుదురు కాని సానుభూతి చూపరు. ఇవి సొంత విషయములు కావున వీని నెంత దాచుకొనిన అంత మంచిది. వెల్లడి చేయరాదు.

శ్లో || ధనధాన్య ప్రయోగేషుః విద్యాసంగ్రహాణేషు చ |

 ఆహారే వ్యవహారేచ త్యక్తలజ్జః సుఖీ భవేత్‌ || 2 

 అర్థము :- ధనధాన్య ప్రయోగేషు = ధనము, అన్నమును వ్యాపారము చేయునపుడు అమ్ముట కొనుట చేయునపుడును, విద్యాసంగ్రహణేషు = విద్యను సంపాదించునపుడును, ఆహారే = భోజన విషయములోను, చ = మఱియు, వ్యవహారే = వ్యవహారము విషయములోను, త్యక్తలజ్జః = సిగ్గును, మొగమాటమును విడిచినవాడు, సుఖీ = సుఖము కలవాడు, భవేత్‌ = అగును.

 తాత్పర్యము :- ధనధాన్యాదుల వ్యాపారములో అమ్మునపుడు కాని, కొనునపుడు కాని, విద్యను నేర్చుకొనునపుడు కాని ఆహారము తీసుకొనునపుడు వ్యవహారము చేయునపుడు సంకోచింపక సిగ్గుపడక పనిచేయువాడు సుఖము కలవాడగును.

 వివరణము :- మనుష్యులకు లజ్జ భూషణము. విశేషించి స్త్రీలకు విశేషముగా ఆభరణము వింది. కాని యే యే విషయములో లజ్జ పనికిరాదో శ్లోకములో చెప్పబడినది.

శ్లో || సంతోషామృత తృప్తానాం యత్సుఖం శాన్తచేతసామ్‌ |

 న చ తద్‌ ధనలుభ్ధానా మితశ్చేతశ్చ ధావతామ్‌ || 3

 అర్థము :- సంతోషామృత తృప్తానాం = సంతోషమనెడి యమృతముతో తృప్తులైన్టి, శాంతచేతసాం = శాంతస్వభావులైన వారికి, యత్‌ = ఏ, సుఖం = సుఖమున్నదో, తత్‌ = ఆ సుఖము, ఇతశ్చేతశ్చ = ఇటు నటు, ధావతామ్‌ = పరుగెత్తున్టి, ధనలుబ్ధానాం = ధనలోభులకు, న చ = లేనేలేదు.

 తాత్పర్యము :- సంతోషమనెడు అమృతముతో తృప్తిపడిన్టి శాంతచిత్తుల క్టిె సుఖము కలదో య్టి సుఖము, శాంతి ఇటు నటు పరుగెత్తు ధనలోభులకు నుండదు.

 వివరణము :- పతంజలి మహర్షి యిట్లు చెప్పెను-

 సంతోషా దనుత్తను సుఖలాభః | (యోగ. 2-42)

 సంతోషము వలన సర్వశ్రేష్ఠమైన సుఖములు లభించును.

మఱొక కవి-

 అర్థీ కరోతి దైన్యం లబ్దార్థో గర్వమపరితోషం చ |

 నష్టధనశ్చ న శోకం సుఖమాస్తే నిఃస్పృహ పురుషః ||

 యాచకుడు దైన్యమును ప్రదర్శించును. ధనవంతుడు గర్విగా నుండును. మఱియు నధికేచ్ఛ గలవాడుగా నుండును. ధననష్టము పొందినవాడు శోకించును. నిఃస్పృహుడు (సంతోషి) సుఖముగా నుండును.

శ్లో || సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే |

 త్రిషు చైవ న కర్తవ్యో-ధ్యయనే తపదానయోః || 4

 అర్థము :- స్వదారే = తన భార్యయందును, భోజనే = భోజనమందును, ధనే = ధనమందును, త్రిషు = ఈ మూియందు, సంతోషః = సంతోషము, కర్తవ్యః = చేయదగినది, చ ఏవ = అంతేకాని, అధ్యయనే = శాస్త్రాదులు చదువుటయందును, తపదానయోః = తపస్సునందు, దానము చేయుట యందును, త్రిషు = ఈ మూియందు, సంతోషః న కర్తవ్యః = సంతోషింపరాదు.

 తాత్పర్యము :- తన భార్య, భోజనము, ధనము అను నీ మూి విషయములో సంతుష్టుడు కావలెను. కాని అధ్యయనము, తపస్సు, దానము అను మూి విషయములో సంతుష్టుడు కారాదు.

 వివరణము :- తన భార్యయందే సంతోషి కావలెను-

 నహీదృశమనాయుష్యం లోకే కించన విద్యతే |

 యాదృశం పురుషస్యేహ పరదారోప సేవనమ్‌ || (మను.4-134)

 ఈ ప్రపంచములో పరస్త్రీ సంబంధముతో సమానమైనది మనుజునకు ఆయువును క్షీణింపజేయునది మఱొకి లేదు. అందుచే దాని నన్నివిధముల విడువవలెను.

 యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః |

 నాలమేకన్య తత్పర్వమితి పశ్యన్న ముహ్యతి ||  (విదుర. 7-85)

 పృథివియందు ధాన్యము, యవలు, బంగారము, పశువులు, స్త్రీలు, ఎన్నికలవో యవి యన్నియు నొక్క మనుష్యునకే చాలవు, అనునాలోచనగల మనుజుడు మోహములో చిక్కుకొనడు.

 భోజన విషయములో సంతోషింపవలెను. హితము, మితమునైన భోజనము చేయవలెను. ఇతరుల భోజనము చూచి ఆశపడరాదు.

 మనుమహర్షి-

 అనారోగ్య మనాయుష్య మస్వర్గ్యం చాతి భోజనమ్‌ |

 అపుణ్యం లోకవిద్విష్టం తస్మాత్‌ తత్పరివర్జయేత్‌ ||

 అధిక భోజన మారోగ్యమును చెఱచును. ఆయువును క్షీణింపజేయును. దుఃఖమును కలిగించును. ఇహపర లోకముల నష్టపఱచును. అందుచే నధిక భోజనము చేయరాదు.

 తనకున్న ధనముతో సంతోషింపవలెను-

 అథో-ధః పశ్యతః కన్య మహిమా నోపచీయతే |

 ఉపర్యుపరి పశ్యన్తః పక్వ ఏవ దరిద్రతి || (హితో.2-2)

 తనకంటె తక్కువవారిని చూచుచు నభివృద్ధికి పాటుపడని వానికి గౌరవము పెరుగదు. కాని తనకంటె నధికులైన ధనవంతులజూచి తాను తక్కువ యని తలచువాడు దరిద్రుడే యగును. ధన విషయములో తనకంటె తక్కువ వారిని చూచి తాను ధనవంతుడనని సంతోషింపవలెను. అధ్యయన విషయములో సంతోషింపరాదు.

 అజరామర వత్ప్రాజ్ఞో విద్యామర్థం చ చింతయేత్‌ |

 గ్రహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్‌ ||

 మనుష్యుడు తాను జరామరణములు లేనివాడుగా భావించి విద్యను ధనమును సంపాదింపవలెను. కాని మృత్యువు తన శిరస్సుపై వెంట్రుకలు పట్టుకొనియుండి యెప్పుడు మ్రింగునో యనుభయము గలవాడై ధర్మాచరణము చేయవలెను.

 దివమారుహత్‌ తపసా తపస్వీ | (అథ.13-2-25)

 తపస్వి తపస్సు ద్వారా మోక్షమును పొందును.

 మను మహర్షి-

 యద్‌ దుస్తరం దురాపం యద్‌ దుర్గం యచ్చాసి దుష్కరమ్‌ |

 సర్వం తు తపసా సాధ్యం తపో హి దురతిక్రమమ్‌ ||

(మను. 11-238)

 కష్టముగా తరింపదగిన దానిని, కష్టముగా పొందదగిన దానిని కష్టముతో చేరగలిగిన దానిని, కష్టముతో చేయదగిన దానిని తపస్సుతో సిద్ధింప జేసికొనవచ్చును. తపస్సుచే సుసాధ్యమైనది లేదు.

 దానము అధికముగా చేయవలెను. వేదము-

 శతహస్త సమాహర సహస్రహస్త సంకిరః (అథ. 3-24-5)

 ఓ మనుష్యుడా ! నీవు వంద హస్తములతో సంపాదించినట్లు సంపాదించి వెయ్యి హస్తములతో పంచిప్టిెనట్లు పంచుము.

 వ్యాస మహర్షి-

 ద్వావమృసీ నివేష్టవ్యొ గలే బద్ధ్వా దృఢాంశిలామ్‌ |

 ధనవన్త మదాతారం దరిద్రం చాతపస్వినమ్‌ || (భార. ఉద్యో. 33.65)

 ఒకడు ధనవంతుడయ్యు దానము చేయని లోభిని, మఱొకడు పురుషార్థమొనర్చని సోమరిని వీరిద్దఱి మెడలలో పెద్ద బండ ఱాళ్లను క్టి నీిలో ముంచవలెను.

శ్లో || విప్రయోర్వి ప్రవహ్న్యోశ్చ దమ్పత్యోః స్వామి భృత్యయోః |

 అస్తరేణ న గస్తవ్యం హలస్య వృషభస్య చ || 5

 అర్థము :- విప్రయోః = ఇద్దఱు బ్రాహ్మణుల యొక్క, చ = మఱియు, విప్రవహ్న్యోః = బ్రాహ్మణునకు అగ్నికిని, దంపత్యోః = భార్యాభర్తలయొక్కయు, స్వామిభృత్యయోః = యజమానుడు సేవకుని యొక్కయు, హలస్య = నాగలి యొక్కయు, వృషభస్య చ = ఎద్దునకును, అంతరేణ = మధ్యలో, న గంతవ్యమ్‌ = వెళ్లరాదు.

 తాత్పర్యము :- ఇద్దఱు బ్రాహ్మణుల యొక్కయు, బ్రాహ్మణుడు అగ్ని యొక్కయు, దంపతుల యొక్కయు, యజమానుడు సేవకుల యొక్కయు, నాగలి యెద్దుల యొక్కయు మధ్యగా వెళ్లరాదు.

శ్లో || పాదాభ్యాం న స్పృశే దగ్నిం గురుం బ్రాహ్మణమేవ చ |

 నైవగాం న కుమారీం చ న వృద్ధం న శిశుం తథా || 6

 అర్థము :-  అగ్నిం = అగ్నిని, గురుం = గురువును, చ = మఱియు, బ్రాహ్మణమేవ = బ్రాహ్మణుని, గాం = ఆవును, కుమారీం = పుత్రికను, వృద్ధం = వృద్ధుని, తథా = అట్లే, శిశుం = పసిబిడ్డను, పాదాభ్యాం = కాళ్ళతో, న స్పృశేత్‌ = తాకరాదు, తన్నరాదు.

 తాత్పర్యము :- అగ్నిని, గురువును, బ్రాహ్మణుని, ఆవును, కన్యను, వృద్ధుని, శిశువును పాదములతో తాకరాదు (తన్నకూడదు)

 వివరణము :- అగ్నిని కాళ్ళతో తాకిన కాలును. గురువు, బ్రాహ్మణుడు, వృద్ధుడు పూజ్యులగుటచే తన్నరాదు. కుమారి, శిశువు చిన్నవారైనను వీరు భావి రాష్ట్ర నిర్మాతలు కావున కాలితో తన్నరాదు. ఆవును తన్నిన వారికి వేదములో దండన విధింపబడి యున్నది-

 యశ్చగాం పదా స్ఫురతి ప్రత్యజ్‌ సూర్యం చ మేహతి |

 తస్య వృశ్చామి తే మూలం ఛాయాం కరవో-పరమ్‌ ||

(అథర్వ.13-1-56)

 ఆవును తన్నిన వానిని, సూర్యుని వైపుకు తిరిగి మలమూత్ర విసర్జనచేసినవానిని మరల న్టి పనిని చేయకుండుటకై సమూలముగా నష్టపఱతును

శ్లో || శకటం పంచహన్తేన థహస్తేన వాజినమ్‌ |

 హస్తినం శతహస్తేన దేశత్యాగేన దుర్జనమ్‌ || 7

 అర్థము:- శకటం = బండిని, పంచహస్తేన = అయిదు చేతుల దూరముగాను, వాజినం = గుఱ్ఱమును, థహస్తేన = పది చేతుల దూరముగాను, హస్తినం = ఏనుగును, శతహస్తేన = వందచేతుల దూరముగాను, దుర్జనం = దుర్మార్గుని, దేశత్యాగేన = దేశము నుండి వెడలగొట్టుటతోను, విడిచిపెట్టవలెను.

 తాత్పర్యము :- బండిని అయిదు చేతుల దూరముగా, గుఱ్ఱమును పది చేతుల దూరముగాను, ఏనుగును వంద చేతుల దూరముగాను, దుర్జనుని దేశంతరములోను విడువవలెను.

 వివరణము:- దుర్జనుడు మిక్కిలి భయంకరుడగుటచే అతని నుండి రక్షించుకొనుట కాతనిని దేశాంతరములో విడువవలెను. లేనిచో నెవ్వడును సుఖపడడు.

శ్లో || హస్తీ అంకుశ హస్తేన వాజీ హస్తేన తాడ్యతే |

 శృంగీ లగుడ హన్తేన ఖడ్గహస్తేన దుర్జనః || 8

 అర్థము:- హస్తీ = ఏనుగు, అంకుశహస్తేన = చేతిలోని అంకుశముతోను, వాజీ = గుఱ్ఱము, హస్తీన = చేతిలోని కొరడా తోను, శృంగీ = కొమ్ములుగల పశువు, లగుడహస్తేన = చేతిలోని కఱ్ఱతోను, దుర్జనః = దుర్జనుడు, ఖడ్గహస్తేన = చేతిలోని కత్తితోను, తాడ్యతే = కొట్టబడును.

 తాత్పర్యము :- ఏనుగును చేతిలోని అంకుశముతోను, గుఱ్ఱమును చేతిలోని కొరడాతోను, కొమ్ములుగల జంతువును చేతిలోని కఱ్ఱతోను, దుర్జనుని చేతిలోని ఖడ్గముతోను క్టొి వశపఱచుకొనవలెను.

శ్లో || తుష్యన్తి భోజనే విప్రా మయూరా ఘనగర్జితే |

 సాధవః పరసమ్పత్తౌ ఖలః పరవిపత్తిషుః || 9

 అర్థము :- విప్రాః = బ్రాహ్మణులు, భోజనే = భోజనమందును, మయూరాః = నెమళ్లు, ఘనగర్జితే = మేఘముల గర్జనయందును, సాధవః = మంచివారు, పరసంపత్తౌ = ఇతరుల సంపదలయందు, ఖిలః = దుర్మార్గుడు, పరవిపత్తిషు = ఇతరుల యాపదయందును, తుష్యన్తి = సంతోషింతురు.

 తాత్పర్యము :- బ్రాహ్మణులు పొట్టనిండ భోజనము చేసిన సంతోషింతురు. నెమళ్లు మేగముల గర్జనలతో (ఉఱుము) ప్రసన్నములై పురివిప్పి యాడును. సజ్జనులు ధనధాన్యసంపన్నులగు నితరుల జూచి సంతుష్టులగుదురు. దుష్టస్వభావము కలవారు ఇతరులు ఆపదలో నున్నచో చూచి సంతోషింతురనుటకు-

 యథా పరోపకారేషు నిత్యం జాగర్తి సజ్జనః |

 తథా పరాపకారేషు జాగర్తి సతతం ఖలః ||

 సజ్జనులు ఇతరుల కుపకారము చేయుటకు నిత్యము సిద్ధముగా నున్నట్లు దుష్టులు ఇతరులకు కీడు చేయుటకు నెల్లపుడు సిద్ధముగా నుందురు.

శ్లో || అనులోమేన బలినం ప్రతిలోమేన దుర్జనమ్‌ |

 ఆత్మతుల్యబలం శత్రుం వినయేన బలేన వా || 10

 అర్థము :- బలినం = బలవంతుడైన శత్రువును, అనులోమేన = అనుకూలమైన వ్యవహారముతోను, దుర్జనం = దుష్టుడైన శత్రువును, ప్రతిలోమేన = ప్రతికూల వ్యవహారముతోను వశపఱచుకొనవలెను. ఆత్మతుల్య బలమ్‌ = తనతో సమానమైన బలముకలవానిని, శత్రుం = శత్రువును, వినయేన = వినయముతోగాని, బలేన = బలముతోగాని, వశము చేసికొనవలెను.

 తాత్పర్యము :- బలవంతుడైన శత్రువును అతని కనుకూలముగా వ్యవహరించుచును, దుష్టుడైన శత్రువును అతనికి బ్రతికూలముగా వ్యవహరించుచును, తనతో సమానమైన బలముగల శత్రువును వినయముతోగాని బలముతోగాని వశముచేసికొనవలెను.

శ్లో || బాహువీర్యం బలం రాజ్ఞో బ్రాహ్మణో బ్రహ్మవిద్బలీ |

 రూప యౌవన మాధుర్యం స్త్రీణాం బలముత్తమమ్‌ || 11

 అర్థము :- రాజ్ఞ: = రాజునకు, బలం = బలము, బాహువీర్యం = భుజబలము, బ్రహ్మవిత్‌ = వేదమును, ఈశ్వరుని తెలిసిన, బ్రాహ్మణః = బ్రాహ్మణుడు, బలీ = బలవంతుడు, రూపయౌవనమాధుర్యం = సౌందర్యము, యౌవనము, మాధుర్యము, స్త్రీణామ్‌ = స్త్రీలకు, అనుత్తమమ్‌ = మిక్కిలి శ్రేష్ఠమైన, బలం = బలము.

 తాత్పర్యము :- రాజునకు భుజబలమే బలము. వేదమును నీశ్వరుని నెఱింగినవాడే బలముగల బ్రాహ్మణుడు. సౌందర్యము, యౌవనము, మధురముగా మ్లాడుటయు స్త్రీలకు శ్రేష్ఠమైన బలము.

 వివరణము :- భగవంతుడు క్షత్రియులకు వారి భుజములలో బలము నుంచెను. శ్రీకృష్ణుడు జరాసంధునితో-

 క్షత్రియోబాహు వీర్యన్తు | (భార.సభా.21-51)

 క్షత్రియులకు బలపరాక్రమములు వారి భుజములలో నుండును.

 బ్రాహ్మణులకు బలము వారి వాక్కులలో నుండును. ఆతడు వేదము స్వాధ్యాయము చేసి (పఠించి) ఇతరులకు నమృతము త్రాగించును. స్త్రీకి బలము ఆమె రూపములోను, యౌవనములోను, మధురభాషణమునందు నుండును. చాణక్యుడు-

 యన్య భార్యా సురూపాచ భర్తారమనుగామినీ |

 నిత్యం మధురవక్త్రీ చ సాశ్రియో నశ్రియః శ్రియః ||

(చా.సార సంగ్రహము 2-82)

 రూపవతియగు భార్య కలవాడు, అనుకూలముగా ప్రవర్తించు భార్య కలవాడు, మధురముగా మ్లాడు భార్యకలవాడును ధనవంతుడు కాని కేవలము డబ్బు మాత్ర మున్నవాడు ధనవంతుడు కాడు.

శ్లో || నా-త్యస్తం పరలైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీమ్‌ |

 ఛిద్యన్తే సరలాస్తత్ర కుబ్జాస్తిష్ఠన్తి పాదపాః || 12

 అర్థము :- అత్యన్తం = మిక్కిలి, సరలైః = సరళ స్వభావముగా, స భావ్యం = ఉండరాదు, వనస్తలీం = అడవి ప్రదేశమునకు, గత్వా = వెళ్లి, పశ్య = చూడుము, తత్ర = ఆ అడవిలో, సరలాః = తిన్నగానుండు వృక్షములు, చిద్యన్తే = నఱకబడుచున్నవి, కుబ్జాః = వంకరింకరగానున్న, పాదపాః= చెట్లు, తిష్ఠన్తి = నిలబడియున్నవి.

 తాత్పర్యము :- మిక్కిలి సరళస్వభావము పనికిరాదు. అడవిలోనికి వెళ్లి చూచినచో నక్కడ తిన్నగానున్న చెట్లు నఱకబడుచున్నవి. వంకర ింకరగా నున్న చెట్లు నఱకబడక విడిచి పెట్టబడియుండును.

 వివరణము :- మనుష్యునిలో మిక్కిలి కోమలత్వముతోబాటు తీక్షణత్వము అనగా దుష్టులను దండించు శక్తి కూడ నుండవలెను.

శ్లో || యత్రోదకం తత్ర వసన్తి హంసాః

 తథైవ శుష్కం పరివర్జయన్తి

 న హంస తుల్యేన నరేణ భావ్యం

 పునస్త్యజన్తే పునతాశ్రయన్తే || 13

 అర్థము : - యత్రః = ఎక్కడ, ఉదకం = నీరుండునో, హంసాః = హంసలు, తత్ర = అక్కడ, వసన్తి = నివసించుచున్నవి, తథా = అట్లే, శుష్కం = నీరులేక యెండిన ప్రదేశమును, పరిత్యజన్తి = విడిచిపెట్టుచున్నవి, నరేణ = మనుష్యుడు, హంసతుల్యేన = హంసతో సమానుడు, న భావ్యం = కారాదు, పునః = మాిమాికి, త్యజన్తి = విడిచిపెట్టుచున్నవి, పునః = మాిమాికి, ఆశ్రయన్తే = ఆశ్రయించుచున్నవి, మనుష్యుడు స్వార్థపరుడు కారాదు, పరోపకారి కావలెను.

 తాత్పర్యము :- హంసలు నీరున్నచోట నివసించును. నీరెండిపోగానే యచ్చోటును విడిచివెళ్లును. మనుష్యుడు హంసవలె నుండరాదు. అవసరమైనపుడు దగ్గఱచేరుటయు అవసరము తీరగానే దూరమగుటయు చేయు స్వార్థపరుడు కారాదు. మనుష్యుడు స్వార్థము విడిచి పరోపకారి కావలెను.

శ్లో || ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవ హి రక్షణమ్‌ |

 తడాగోదర సంస్థానాం పరీవాహ ఇవామ్భసామ్‌ || 14

 అర్థము :- ఉపార్జితానాం = సంపాదింపబడిన, విత్తానాం = ధనమునకు, త్యాగ ఏవ = త్యాగము చేయుటయే, రక్షణం హి = రక్షణము గదా, తడాకోదరసంస్థానాం = చెఱువులోనున్న, అంభసాం = నీికి, పరీవాహః = అలుగు (బయటకు నీళ్లుపోవు తూము), ఇవ = వలె రక్షకమగును.

 తాత్పర్యము :- సంపాదించిన ధనమునకు త్యాగమే రక్షణము. చెఱువులో నిండిన నీిని అలుగు ద్వారా (బయటకు పోవు తూము) బయటకు పంపుటయే ఆ నీికి రక్షణము. లేకున్న పసరు చేసి చెడిపోవును.

 వివరణము :- భర్తృహరి ధనమునకు మూడుగతులు చెప్పెను-

 దానం భోగో నాశస్తిస్రో గతయో భవన్తి విత్తన్య |

 యో న దదాతి భుంక్తే తన్య తృతీయా గతిర్భవతి || (నీతి.శత.39)

 ధనమునకు దానము చేయుట, అనుభవించుట, నాశనమగుటయును మూడు స్థితులుండును. అందులో మొది రెండైన దానము చేయుట, అనుభవించుటయు లేని ధనము మూడవదగు నాశనము పొందును.

శ్లో || యస్యా-ర్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాన్ధవాః |

 యస్యా-ర్థాః స పుమాన్‌ లోకే యస్యా-ర్థాః స చ జీవతి || 15

 అర్థము :- లోకే = లోకమందు, యన్య = ఎవనికి, అర్థాః = ధనము కలదో, తన్య = అి్టవానికే, మిత్రాణి = స్నేహితులు, యన్య = ఎవనికి, అర్థాః = ధనములు కలవో, తస్య = అతనికి, బాంధవాః = బంధువులు, యన్య = ఎవనికి, అర్థాః = ధనములు గలవో, నః = వాడే, లోకే = లోకమందు, పుమాన్‌ = మగవాడు, చ = మఱియు, యన్య = ఎవనికి, అర్థాః = ధనములు గలవో, నః = వాడే, జీవతి = జీవించుచున్నాడు. వాడే జీవించినట్లు లెక్క.

 తాత్పర్యము :- ధనమున్నవానికే మిత్రులు, బాంధవులు నుందురు. ధనమున్నవాడే పెద్ద మనుష్యుడుగా వ్యవహరింపబడును. ధనమున్నవాని జీవితమే గొప్ప జీవితము.

 వివరణము :- డబ్బు లేకుండ నేపనియు గాదు. డబ్బున్నవాని చెంత మిత్రులు, బంధువులు చేరుదురు. ధనము పరమాత్మ కాకున్నను దాని మహిమనే గానము చేయుదురు. భర్తృహరి-

 యస్యాస్తి విత్తం స నరః కులీనః న పండితః న శ్రుతవాన్‌ గుణజ్ఞ

 న ఏవ నక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచన మాశ్రయన్తే ||

(నేతి. శ. 37)

 ధనవంతుడే గొప్ప కులముగలవాడుగాను, పండితుడు గాను, శాస్త్రజ్ఞుడుగాను, గుణవంతుడుగాను, వక్తగాను, అందగాడుగాను పరిగణింపబడును. గుణములన్నియు బంగారము నాశ్రయించియుండును. అది కలవాడే సర్వోపరి విరాజిల్లుచున్నాడు. ధనమావశ్యకమే. దానిని న్యాయమార్గమున సంపాదింపవలెను.

శ్లో || స్వర్గ స్థితానా మిహ జీవలోకే

 చత్వారి చిహ్నాని వసన్తి దేహే

 దాన ప్రసంగో మధురా చ వాణీ

 దేవా-ర్చనం బ్రాహ్మణ తర్పణం చ ||

 అర్థము :- ఇహ = ఈ, జీవలోకే = ప్రపంచమందు, స్వర్గస్థితానాం = సంతోషముగా నుండువారికి, దేహే = దేహమందు, చత్వారి = నాలుగు, చిహ్నాని = గుర్తులు, వనన్తి = ఉన్నవి, దానప్రసంగః = దానస్వభావము, చ = అట్లే, మధురవాణి = మధురముగా మ్లాడుట, దేవార్చనం = విద్వాంసులకు ఆదరసత్కారములు చేయుట, చ = మఱియు, బ్రాహ్మణ తర్పణం = బ్రహ్మనిష్ఠులను తృప్తి పఱచుట యనునవి.

 తాత్పర్యము :- ఈ ప్రపంచములో సుఖముగా నున్నవారి శరీరమందు నాలుగు చిహ్నములు (గుర్తులు) ఉన్నవి. దానస్వభావము, మధుర భాషణము, పండితుల సత్కరించుట, వేదవిద్వాంసులు బ్రహ్మనిష్ఠులైన వారిని తృప్తి పఱచుట యనునవి.

 వివరణము:- ఈ ప్రపంచములో ఆదర్శగృహస్థాశ్రమములో నున్న ఆదర్శగృహస్థుని జీవితములో నాలుగు విషయములుండును. 1. వారు దానశీలురైయుందురు. వారు వందలకొలది చేతులతో సంపాదించి వేలకొలది చేతులతో దానము చేయుదురు. 2. వారు మధురముగా మ్లాడుదురు. వారు మ్లాడునపుడు వారి నోినుండి పూలురాలు నట్లుండును. వారి నాలుక చివర హృదయమందును తేనె యున్నట్లుండును. 3. వారు దేవతలను అనగా తల్లిదండ్రులను, అతిధిని, ఆచార్యుని సాదరముగా సత్కరించి సంతుష్టులను జేయుదురు. 4. వేదవిద్వాంసులను, బ్రహ్మజ్ఞానము కల పండితులను భోజనము, వస్త్రాదులతో తృప్తి పఱచుదురు.

శ్లో || అత్యన్తకోపః కటుకా చ వాణీ

 దరిద్రతా చ స్వజనేషు వైరమ్‌

 నీచ ప్రసంగః కులహీన సేవా

 చిహ్నాని దేహే నారకస్థి తానమ్‌ || 17

 అర్థము: - అత్యన్తకోపః = మిక్కిలి కోపము, చ = మఱియు, కటుకావాణీ = మిక్కిలి కఠినముగా మ్లాడుట, దరిద్రకా = దారిద్య్రము, స్వజనేషు = తన బంధువులందు, వైరం = విరోధముగానుండుట, చ = మఱియు, నీచప్రసంగః = నీచమైన వారితో కలయిక (స్నేహము) కుల హీనసేవా = కులహీనులను సేవించుట, నరకస్థితానాం = నరకములో (దుఃఖములో) నుండువారియొక్క, దేహే = దేహమందుండు, చిహ్నాని = గుర్తులు.

 వివరణము :- ఏ స్త్రీ పురుషులలో పైన జెప్పిన చిహ్నములుండునో వారు పతితులై చెడిపోయిన గృహస్థాశ్రమములో నుండి దుఃఖమనుభవించుచున్నారని తెలిసికొనవలెను.

శ్లో || గమ్యతే యది మృగేంద్ర మందిరం

 లభ్యతే కరికపోల మౌక్తికమ్‌ |

 జంబుకా--లయ గతే చ ప్రాప్యతే

 వత్స పుచ్ఛఖర చర్మ ఖండనమ్‌ || 18

 అర్థము :- మృగేంద్ర మందిరం = సింహముండు గుహకు, గమ్యతే యది = వెళ్లినచో, కరికపోల మౌక్తికమ్‌ = ఏనుగుల కుంభస్థలములందుండు ముత్యము, లభ్యతే = లభించును, చ = మఱియు, జంబుకా--లయగతే = నక్కలుండు బొరియల దగ్గఱకు వెళ్లినచో, వత్స = దూడలయొక్క, పుచ్ఛ = తొడేలు, ఖర = గిట్టలు, చర్మఖండనమ్‌ = చర్మము యొక్క ముక్కయు, ప్రాప్యతే = లభించును.

 తాత్పర్యము :- మనుష్యుడెవడైన సింహము నివాసస్థానమైన గుహలోనికి వెళ్లి చూచినచో ఏనుగు మస్తకము (కుంభస్థలము) నందుండు ముత్యములు లభించును. అట్లే నక్కలుండు గుహలోనికి వెళ్లినచో నచట దూడల తోకలు, గాడిద చర్మపు ముక్కలు లభించును.

 వివరణము :- గొప్పవారి స్నేహము చేయవలెను. నీచ స్నేహము పనికిరాదు.

శ్లో || శునః పుచ్ఛమివ వ్యర్థం జీవితం విద్యయా వినా |

 న గుహ్యగోపనే శక్తం న చ దంశనివారణేః || 19

 అర్థము :- శునః = కుక్క యొక్క, పుచ్ఛం = తోక, గుహ్య గోపనే = గుప్తేంద్రియమును కప్పుటకుగాని, దంశనివారణే = దోమలు మొదలగు వాినుండి రక్షించుటకుగాని, న శక్తం = శక్తికలదికాదు (పనికిరాదు), ఇవ = అి్ట తోకవలె, విద్యయావినా = విద్యలేన్టి, జీవితం = జీవితము, వ్యర్థం = వ్యర్థము

 తాత్పర్యము :-విద్యలేనివాని జీవితము కుక్క తోక వలె వ్యర్థమగును. కుక్కతోక ముడ్డిని కప్పుటకు పనికిరాదు. మఱియు ఈగలు, దోమలు మొదలగు వానిని పాఱద్రోలుటకు పనికిరాదు. అట్లే మూర్ఖుడు రహస్యమును దాచలేడు. శత్రువులను ఆక్రమణ చేయలేక వ్యర్థుడునగును.

శ్లో || వాచః శౌచం చ మనసః శౌచమింద్రియ నిగ్రహః |

 సర్వభూతే దయా శౌచం ఏతచ్ఛౌచం పరా-ర్థినామ్‌ || 20

 అర్థము :- వాచః = వాక్కుయొక్క, శౌచం = పవిత్రత, చ = మఱియు, మనసః = మనస్సు యొక్క, శౌచం = శుద్ధియు, ఇంద్రియ నిగ్రహః = ఇంద్రియములను వశమందుంచుకొనుటయు, సర్వభూతే దయా = సర్వప్రాణులందు దయయు, శౌచం = ధనము యొక్క, పవిత్రత, ఏతత్‌ = ఇదియే, పరార్థినామ్‌ = పరోపకారులకు లేక మోక్షము కోరువారికి, శౌచం = శుద్ధిలేక పవిత్రత యగును.

 వివరణము :- శౌచమనగానేమి? వ్యాసమహర్షి - మహా, అశ్వపరి. 2216 లో చెప్పినది చూడుడు-

 బ్రహ్మచర్యం తపః క్షాంతి ర్మధుమాంసన్య వర్జనమ్‌ |

 మర్యాదాయాం స్థితశ్చైవ శమః శౌచన్య లక్షణమ్‌ ||

 తాత్పర్యము :- బ్రహ్మచర్యము, తపస్సు, క్షమ, మద్యమాంసముల విడుచుట, మర్యాదగా నుండుట, మనస్సును వశమునందుంచుకొనుట యనునవి యన్నియు శౌచము (పవిత్రత) లక్షణములు, వ్యాసమహర్షి అందులోనే 3238 లో శుద్ధిని అయిదు విధములుగా చెప్పెను. అందులో మనస్సు శుద్ధి, వాక్‌ శుద్ధియు చేర్చబడినవి-

 మనః శౌచం కర్మశౌచం కులశౌచం చ భారత |

 శరీర శౌచం వాక్‌ శౌచం శౌచం పంచవిధం స్మృతమ్‌ ||

 తాత్పర్యము :- మనశ్శుద్ధి, కర్మశుద్ధి, కులశుద్ధి, శరీరశుద్ధి, వాక్‌శుద్ధి అనునీయైదును శుద్ధిగా జెప్పబడుచున్నవి. అక్కడే-

 పంచస్వేతేషు శౌచేషు హృదిశౌచం విశిష్యతే |

 హృదయస్యతు శౌచేన స్వర్గం గచ్ఛన్తి మానవాః ||

 తాత్పర్యము :- ఈ అయిదు శుద్ధులలో హృదయశుద్ధి సర్వశ్రేష్ఠమైనది, మనస్సు యొక్క పవిత్రత వలన మానవులు స్వర్గమును (సుఖమును) పొందుదురు.

 అర్థము :- పవిత్రతను గూర్చి సర్వోత్తమముగా మనుమహర్షి-

 సర్వేషామేవ శౌచానా మర్థశౌచం పరం స్మృతమ్‌ |

 యో-ర్థే శుచిర్హి న శుచి ర్న మృద్వారి శుచిః శుచిః ||

(మను. 5-106)

 పవిత్రము లన్నింలో ధనపవిత్రత శ్రేష్ఠమైనది. ధనసంబంధముతో పవిత్రముగా నున్నచో అన్యాయముగా నితరుల ధనము తీసికొనడు. అదియే పవిత్రము. మ్టితో తోమి నీళ్ళతో కడుగుట పవిత్రము కాదు.

శ్లో || పుష్పేగంధం తిలే తైలంకాష్ఠే-గ్నిం పయసి ఘృతమ్‌ |

 ఇక్షే గుడం తథా దేహేపశ్యా--త్మానం వివేకతః || 21

 అర్థము :- పుష్పే = పుష్పమందు, గంధం = సువాసనను, తిలే = నువ్వుగింజయందు, తైలం = నూనెను, కాష్టే = కట్టెయందు, అగ్నిం = అగ్నిని, పయసి = పాలయందు, ఘృతం = నేతిని, ఇక్షౌ = చెఱకునందు, గుడం = బెల్లమును చూచుచున్నావో, తథా = అట్లే, దేహే = శరీరమునందు, వివేకతః = జ్ఞానమున, ఆత్మానం = జీవాత్మను పరమాత్మను, పశ్య = చూడుము.

 తాత్పర్యము :- పుష్పమునందు సువాసనయు, నువ్వులయందు నూనెయు, కట్టెయందు అగ్నియు, పాలలో నెయ్యి, చెఱకునందు బెల్లము, ఆలోచన ద్వారా యున్నట్లు తెలిసికొనిన విధముగా నీ శరీరములో నున్న ఆత్మను పరమాత్మను వివేకము ద్వారా చూడుము. తెలిసికొనుము.

 వివరణము :- మానవుడుగా ప్టుినవాడు ఆత్మ దర్శనము కొఱకు ప్రబల ప్రయత్నము చేయవలయును. ఉపనిషత్తు సందేశము-

 ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః మస్తవ్యః |

 నిధిధ్యాసితవ్యో మైత్రేయి || (బృహద్‌.ఉప.2-45)

 ఓ మైత్రేయి! పరమాత్మ సాక్షాత్కారము పొందవలెను. పరమాత్మ సంబంధములైన విషయములనే వినవలెను. ఆ విషయమునే చింతింపవలెను. మనన చేయవలెను. ధ్యానింపవలెను. ఉపాసింపవలెను. ఆ పరమాత్మ యెక్కడ దొరుకును? హృదయమందిరమందు. ఆ పరమాత్మను బయట ప్రపంచములో వెదక నావశ్యకము లేదు. పరమాత్మను బయట వెదకువాని స్థితి యీ క్రింది విధముగా నుండును-

 నంత్యజ్యహృద్గృ హేశనాం దేవమన్యం ప్రయాన్తియే |

 తే రత్న మనివాంఛన్తి త్యక్త్వా హన్తస్థ కౌస్తుభమ్‌ ||

-మహోపనిషద్‌ (6-20)

 హృదయరూప గుహలో నున్న పరమేశ్వరుని విడిచి యితర దేవతను వెదకువాడు పిడికిలిలోని మణి విడిచిప్టిె గాజు ముక్క కొఱకు వెదకుచున్న వాని వింవాడగును.

 బహిర్భ్రమతి యః కశ్చిత్‌ త్యక్త్వా దేహస్థ మీశ్వరమ్‌ |

 సో గృహపాయనం త్యక్త్వా భిక్షామటతి దుర్మతిః ||

 శరీరములో నున్న పరమేశ్వరుని విడిచిప్టిె బయటదేవుని కొఱకు వెదకువాడు- ఇంిలోనున్న పాయసమును విడిచిప్టిె యితరుల యిండ్ల దగ్గఱ బిచ్చమెత్తువానివిం మూర్ఖుడగును.

సప్తమాధ్యాయము సమాప్తము

No comments:

Post a Comment