Tuesday, 4 May 2021

మాటతో మార్చు.....(తెలుగు కవిత)

మాటతో మార్చు...

(తెలుగు కవిత )

మనసుతో జీవించు
సమాజానికి నువ్వు కావాలి
నీకు సమాజం అవసరమే
ఏది కావాలన్నా ఒకరికి అడగలిగా
ఎలా ఉండాలన్నా ఏదో ఒకటి కావాలిగా ...
తప్పుకోవడానికి కారణాలు ఉండవచ్చు
ఎదుపడటానికి వెరవరాదు...
ఎదిరించడానికి వెనకడుగు వద్దు...
కలసి కదా జీవించేది
కాలయాపనకు కాపుకాయకు  ...
చక్కగా మాట్లాడితే ....
అందరూ నీవారే .....
కొండరెపుడు .....కొన్నిసార్లె
నీవేనాడు మరువకు నిజాన్ని
జార విడువకు నిర్భయాన్ని....
వస్తారు వెళతారు .....
పనులు చేస్తారు 
ఫలితాన్ని ఆశిస్తారు...
అనుకోకుండా కొన్నిటిని
పొందుతారు  ...అనుకుని మరికొన్ని
కోల్పోతారు....
మాట జారితే మనసు నొచ్చును
మనసు పలికితే మాట తిరుగును
దానికి దీనికి ఎక్కడో ఒక లింకు
దేనితో తెంప గలవని ?...
ఫలితం రాని  ప్రయాస గాకపోతే
మరొకటి కాదుగా ?..
వచ్చాక తప్పుతుందా మరి
తెంపినా తెగేది కాదుగా అది ?
కాలాన్ని వాడుకోవాలి
కలకలం నిలిచేలా కదం తొక్కాలి
ప్రపంచం నీకు కావాలి అవకాశం
ఆనందం పరవళ్ళు తొక్కాలి నిరంతరం
ముళ్ళు లేనిదా గులాబి ?
వాసన లేనిదా మొగలిరేకు?
కష్టం లేనిదే సుఖం లేదు కదా
పరిశ్రమ లేకుండా ఫలితం లేదుగా ...
రాత్రి లేనిదే ఉదయం లేదు
ఉదయం లేనిదే వెలుగు లేదు
వెలుగు లేనిదే మెలకువ రాదు కదా
పుట్టాక పోక తప్పదు
పోయాక తిరిగి రాక తప్పదు
రాక పోకల లెక్కలు మనకెందుకు
మనసులో మంచి భావాలు బోలెడుండగా .....
అవెలగూ తప్పదెవరికినీ ....
కలాలు చెప్పి వస్తాయా
కలతలు అలాగే మరి
నిజాల నిగ్గు తేల్చెదెవరు ?
నీవా ...నీ మనసా ...నీ తపనా....
ఏది నిజమని నమ్మేది ....
నీ చుట్టూరా అందం ఎప్ప్పుడైనా
అరిపోవాల్సిందే ....
వెలిగించిన కొవ్వత్తి ఎంత సేపుంటుందని?
ప్రేమయినా అంతేగా వెలిగించిన దీపం లాంటిదది
గిన్నెలో నూనె ఉన్నంతవరకేగా దాని జీవితం ....

No comments:

Post a Comment